టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి తెలంగాణలో పార్టీని గెలిపించుకుంటాడా..? తన చిరకాల కోరిక సీఎం పదవి సాధిస్తాడా..? ఈ దిశలో చాలా సమీకరణాలు అడ్డుపడతాయి కానీ కొడంగల్‌లో మళ్లీ గెలుస్తాడా..? తను సర్వే చేయించుకున్నాడు… ఎక్కడెక్కడ మైనస్ పాయింట్లున్నాయో లెక్కతీసి, సరిదిద్దుబాట్లు కూడా చేసుకున్నాడు గరిష్ట స్థాయిలో…
పైగా ఇప్పుడు తను టీపీసీసీ అధ్యక్షుడు… ఎక్కడా కాంప్రమైజ్ కాడు… ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి తన సాధనసంపత్తి మొత్తం ప్రయోగించక తప్పదు… అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరగాలి… ప్రచారం చేయాలి… కనీసం తన వర్గం లీడర్లను గెలిపించుకునే ప్రయత్నాలన్నీ చేయాలి… తప్పదు… రాబోయే ఎన్నికలు తనకు ఓ పరీక్ష.,.
ఐతే రేవంత్‌రెడ్డి వోట్లను చీల్చడానికి… ఓడగొట్టడానికి… కేవలం తన నియోజకవర్గానికే పరిమితం చేయడానికి ఓ ప్రయత్నం జరుగుతోందా…? పొలిటికల్ సర్కిళ్లలో మాత్రం ఓ ప్రచారం వినిపిస్తోంది… అఫ్‌కోర్స్, వినిపించేవన్నీ నిజాలు కావు కానీ ఇది కాస్త ఆసక్తికరంగా ఉంది… కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి వైఎస్సార్టీపీ షర్మిలకు రేవంత్‌రెడ్డి అడ్డుపడ్డాడనేది అందరికీ తెలిసిన రహస్యమే…
Ads
ఇప్పుడు ఏం జరుగుతన్నదట అంటే… కేసీయార్ కేవీపీ ద్వారా బ్రదర్ అనిల్‌కుమార్‌ను కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి మీద ప్రయోగించే అవకాశం ఉందట… అబ్బే, గెలుస్తాడని, ఓడగొడతాడని కాదు… రేవంత్‌కు ఊపిరాడకుండా చేయడం… కేవీపీ అంబట్ల తెడ్డు… తనకు అన్ని క్యాంపులూ ఒకటే… పేరుకు కాంగ్రెస్… కానీ బీఆర్ఎస్ కూడా మనదే… ఎలాగూ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా రేవంత్ అడ్డుపడ్డాడు కాబట్టి షర్మిలకు కోపముంది… అది తీర్చుకోవాలంటే ఇదే మార్గమని అనుకుంటున్నారట…
నిన్నోమొన్నో ఆమె ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది…‘నేను పార్టీని విలీనం చేయడం లేదు, సరిపడా టైమ్ ఇచ్చి వెయిట్ చేశాను, కానీ జరగలేదు, నేను పాలేరు నుంచే పోటీ చేస్తాను, విజయమ్మ, బ్రదర్ అనిల్‌లను కూడా పోటీచేయించాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి… పోటీలో వాళ్లు ఉండవచ్చు కూడా…’ ఇదీ ఆమె పార్టీ ప్రకటన… సో, బ్రదర్ అనిల్ పోటీలో ఉండడు అని తేల్చిపారెయ్యడానికి వీల్లేదు…
నిజంగా బ్రదర్ అనిల్‌కుమార్ గెలవాలంటే ఖమ్మం జిల్లాలో ఏదో ఓ సీటు చూడాలి గానీ… వైఎస్సార్టీపికి పెద్దగా ఏమీ లేని కొడంగల్‌లో పోటీచేయించడం ఏమిటి అంటారా..? అదే మరి… అసలు లక్ష్యాలు వేరు కదా… వోట్లు చీల్చాలి, రేవంత్ ఎక్కువ ఎఫర్ట్ తన సీట్‌లోనే పెట్టాలి, తనను ఓడగొట్టాలి’ అదీ టార్గెట్ అట… పోనీ, ఎందుకైనా మంచిదని రేవంత్ రెండు సీట్లలో పోటీచేస్తే..? అబ్బే, దీన్ని చూపించి పార్టీలో ఇతర ప్రముఖులు మాకూ ఆ స్కీమ్ అప్లయ్ చేయాలని గొడవ చేస్తారు…
కేవీపీని జగన్ ఎలాగూ దగ్గరకు రానివ్వడు, ఏమేం లోగుట్లు ఉన్నాయో తెలియదు… ఏపీలో కాంగ్రెస్ ఎలాగూ లేదు… సో, తనను తెలంగాణ కాంగ్రెస్ వాడిగా పరిగణించాలని ఆయన కోరిక… జగన్ తనను నమ్మడు కదా, మరి షర్మిల ఎందుకు నమ్ముతుంది..? ఆయన్ని నమ్మడమో నమ్మకపోవడమో కాదు, రేవంత్ మీద ఇలా కోపం తీర్చుకోవచ్చునేమోనని షర్మిల ఆలోచించవచ్చు కదా… ఏమో, జరగవచ్చు… రాజకీయాల్లో ఇది జరగదు అని దేన్నీ చెప్పలేం కదా…
Share this Article