.
అక్కినేని ఇంటి కోడలు కాకముందు శోభిత అంటే ఒక లెక్క… ఇప్పుడు ఆమె సినిమా అంటే మరొక లెక్క..! అందులోనూ ఆమె లీడ్ రోల్ చేసిన ‘చీకటిలో’ అనే క్రైమ్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది… మరి ఈ ‘మల్లెపూల’ సీరియల్ కిల్లర్ కథ ఎలా ఉందో ఓసారి చూద్దాం పదండి…
కథా కమామిషు…: సంధ్య (శోభిత) ఒక జర్నలిస్ట్… క్రైమ్ వెనుక ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకునే రకం…. కానీ ఛానెల్ వాళ్లేమో టీఆర్పీల కోసం ఆమె స్క్రిప్ట్‌ను వల్గర్‌గా మార్చేస్తుంటే భరించలేక ఉద్యోగం మానేసి, ఓ స్నేహితురాలు బాబీ సలహా మేరకు తనే సొంతంగా పాడ్‌కాస్ట్ మొదలుపెడుతుంది….
Ads
ఇంతలో ఆమె స్నేహితురాలు బాబీ హత్యకు గురవుతుంది… అసలు విషయం ఏంటంటే… ఆ కిల్లర్ ఒక్క బాబీనే కాదు, ఎంతోమంది అమ్మాయిలను చంపి, వాళ్ళ జడలో మల్లెపూలు పెట్టి వెళ్ళిపోతుంటాడు… ఆ సీరియల్ కిల్లర్ ఎవరు…? పోలీస్ ఆఫీసర్లు రాజీవ్ (చైతన్య కృష్ణ), ఆనందిత (ఇషా చావ్లా) ఇన్వెస్టిగేషన్ ఏమైంది…? సంధ్య తన పాడ్‌కాస్ట్ ద్వారా ఆ హంతకుడిని ఎలా బయటకు లాగింది…? అనేదే అసలు సినిమా…
హైలైట్స్ & ముచ్చట్లు
-
శోభిత మార్క్ నటన…: శోభిత తన పాత్రలో ఒదిగిపోయింది…. ఒక సీరియస్ జర్నలిస్ట్ బాడీ లాంగ్వేజ్‌ను బాగా క్యారీ చేసింది…. గ్లామర్ పక్కన పెట్టి నటనకే ప్రాధాన్యత ఇచ్చింది…
-
ట్విస్టుల ముసుగులో నిజం…: సాధారణంగా ఇలాంటి సినిమాల్లో కిల్లర్‌కి ఒక ట్రాజెడీ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది… కానీ ఇక్కడ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఒక కొత్త కోణాన్ని టచ్ చేశాడు… మహిళలు వేసే తప్పటడుగులు, కొందరి ప్రవర్తన అమాయకులను ఎలా హంతకులుగా మారుస్తాయి అనే పాయింట్ ఆసక్తికరం…
-
మేకింగ్…: థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన మూడ్‌ను కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఎలివేట్ చేశాయి….
ఎక్కడ తగ్గింది..?
-
పాత్రల బలం…: సినిమా మొత్తం శోభిత చుట్టూనే తిరుగుతుంది…. దాంతో చైతన్య కృష్ణ, ఇషా చావ్లా, ఆమని లాంటి టాలెంటెడ్ నటులు ఉన్నా వారికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది….
-
నెమ్మదించిన కథనం…: క్రైమ్ థ్రిల్లర్ అంటే పరుగులెత్తాలి, కానీ కొన్ని చోట్ల సినిమా సాగతీతగా అనిపిస్తుంది…. రెగ్యులర్ థ్రిల్లర్ ఫార్మాట్‌ను ఫాలో అవ్వడం వల్ల అక్కడక్కడా ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది….
ముగింపు…. ‘చీకటిలో’ సినిమా అందరికీ నచ్చేస్తుందని చెప్పలేం కానీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక డీసెంట్ వాచ్… పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, వీకెండ్‌లో ఏదైనా డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఓటీటీలో ఒక లుక్ వేయొచ్చు…. శోభిత కోసమైనా ఓసారి చీకటిలోకి వెళ్ళొచ్చు…!
Share this Article