Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీ గౌరీప్రియ ! సరైన పాత్ర దొరికితే తెలుగమ్మాయిలు దున్నేయగలరు !!

July 24, 2026 by M S R

.

శ్రీ గౌరీప్రియ … హైదరాబాద్‌లో పుట్టింది… సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదివింది… 28 ఏళ్లు… 2018లో మిస్ హైదరాబాద్… సింగర్ కూడా… డాన్స్ కూడా బాగా చేయగలదు… పెయింటింగ్ చేస్తుంది… ఫోటోగ్రఫీ హాబీ… సాహసి, స్కైడైవింగ్ అంటే ఇష్టం… నిర్మలా కాన్వెంట్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాక, చాలా సినిమాలు చేసింది…

మొదట్లో అతిథి పాత్రలు, తరువాత ప్రాధాన్యమున్న రోల్స్… కానీ తెలుగమ్మాయి కదా, ఆమె తనలోని నటిని బాగా ఎగ్జిబిట్ చేయగల పాత్రలు రాలేదు సహజంగానే… మన ఇండస్ట్రీకి తెలుగమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడం అంటే విముఖత కదా… అందుకే తనకు మంచి పాత్రల్ని ఎవరూ రాయలేదు, రాలేదు… కానీ..?

Ads

ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీలో కథానాయికగా కాస్త మంచి పాత్ర దొరికింది… హీరో కిరణ్ అబ్బవరం అక్కడక్కడా వెలవెలబోతే… గౌరీప్రియ మాత్రం సినిమా మొత్తం డామినేట్ చేసింది, దున్నేసింది… ఎస్, మంచి పాత్రలు దొరికితే ఆమె ఇంకా క్లిక్ కాగలదు… నిరూపించుకుంది… ఆమె పాత్రలోని అమాయకత్వం, బాధ, ప్రేమ, సంఘర్షణలను చాలా సహజంగా చూపించింది… ఎక్కడా ఓవర్ కాకుండా, పాత్రను జీవించింది…

ఈ సినిమాలో తనే షీరో… తరువాత హీరో మణిశర్మ… చాన్నాళ్ల తరువాత మణిశర్మ మెరిశాడు… బీజీఎం హృద్యంగా, ఆహ్లాదంగా వినిపించింది… గుర్తుందా అనే పాట బాగుంది, సరే, పాటలు ఎలా ఉన్నా, కథకు అనుగుణంగా నేపథ్య సంగీతం… ఇప్పుడు బీజీఎం అంటేనే సౌండ్ బాక్సులు పగులగొట్టే హైపిచ్ ఢమఢమ కాదు, ఇదీ బీజీఎం అన్నట్టుగా సాగింది… మరి కిరణ్ అబ్బవరం..?

జస్ట్, పర్లేదు… ఎమోషన్ సీన్లలో ఎప్పుడూ తనకు తడబాటే… గౌరీప్రియకు జోడిగా నటించిన త్రిగుణ్ సో సో… కథలో సరిగ్గా పెళ్లిరోజే నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెళ్లిపోవడం ఆ కేరక్టరైజేషన్ అంటే పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసింది…

మామూలుగా లవ్ ఫెయిల్యూర్లతో మగ పురుష్ దేవదాసులైపోతారు, దేవదాసులు మందు తాగుతూ ఉంటారు… ఇక్కడ లేడీ దేవదాస్ అవుతుంది హీరోయిన్… వెరయిటీ… కాకపోతే కాస్త అసహజత్వం… అప్పుడు ఓ అనాథ పాత్రతో కిరణ్ అబ్బవరం ఎంట్రీ… ఫిల్మ్ మేకర్ అవ్వాలని చెన్నై వచ్చిన అతను ఈమె జీవితంలోకి అతిథిగా ప్రవేశిస్తాడు…

తను ఆమెకు ఎలా దగ్గరయ్యాడు, పాత ప్రేమికుడు మళ్లీ ఎందుకొచ్చాడు, ఏం జరిగిందనేది కథ …(చెన్నై మాత్రమే దేనికి..? హైదరాబాద్‌నే చూపించొచ్చు కదా… పేరుకు చెన్నై లవ్ స్టోరీ, షూటింగ్, స్పాట్స్ మాత్రం హైదరాబాదే)…

కలర్ ఫోటో, బేబీ సినిమాలతో పాపులరైన దర్శకుడు సాయి రాజేష్ ఈ కథ విషయంలో (కథ- స్క్రీన్ ప్లే- సహనిర్మాత) సెకండాఫ్ మాత్రం విసిగించాడు… మరీ ఆత్మలు, ఫాంటసీ నప్పలేదు కథకు… దీనికి దర్శకుడు నంబూరి రవి… (అప్పుడప్పుడూ వేదికల మీద వింత వ్యాఖ్యానాలతో విసిగించే ఎస్‌కేఎన్ దీనికి నిర్మాత)… ట్రెయిలర్ లాంచ్‌కు అల్లు అరవింద్, ప్రిరిలీజుకు చిరంజీవి రావడంతో ఈ సినిమాకు మంచి ప్రచారం దక్కింది కానీ సెకండాఫ్ ట్రీట్‌మెంట్ బాగుంటే, వారి ప్రోత్సాహానికి న్యాయం దక్కేది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నీట్ మాత్రమే కాదు ! బలమైన భారత్‌ను బలహీనపరిచే ఏదో కుట్ర !!
  • శ్రీ గౌరీప్రియ ! సరైన పాత్ర దొరికితే తెలుగమ్మాయిలు దున్నేయగలరు !!
  • అదే హైడ్రా – అదే ఆర్మీ – రెండు వేర్వేరు భిన్న వార్తలు !!
  • BRS Hereditary heir KTR only – ఈ పార్టీ కేసీయార్ సొంత కుటుంబ ఆస్తి !!
  • అదే గ్లోబరీనా! – కీలెరిగి వాత పెట్టడంలో రేవంత్ తరువాతే ఎవరైనా?
  • ‘యంగెస్ట్- ఫాస్టెస్ట్ ఫిఫ్టీ’ బుడ్డోడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ కాదు… ఎందుకు..?
  • మరక మంచిదే… ఇదీ ఓ పాఠం… ఆదమరిస్తే మరింత ప్రమాదం…
  • నీట్ ఒక్కటే కాదు ! అసలు వైద్య విద్య సమస్యల లోతుల్లోకి వెళ్లేవారేరీ !
  • రూమ్ రెంటుకూ తిప్పలు పడే స్థితి నుంచి… జాతీయ అవార్డు గ్రహీత దాకా…
  • మోదీ ప్రతిష్ట నానాటికీ పలుచన – బీజేపీకి ఇవన్నీ అశుభ సూచికలే !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions