Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదేమిటో గానీ ఆయన సినిమాల్లో వాణిశ్రీ ఎక్కువ అందంగా కనిపిస్తుంది..!!

October 8, 2024 by M S R

చీరెలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు . ఈ సినిమా అనగానే ఎవరికయినా గుర్తుకొచ్చే పాట ఇదే . నాకు ఈ పాట కూడా చాలా చాలా ఇష్టం . ఆత్రేయ గారు వ్రాసారు . 1978 లో వచ్చిన ఈ చిలిపి కృష్ణుడు సినిమా జనానికి బాగా నచ్చింది . ఇరవై అయిదు వారాలు ఆడింది .
ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది ANR రంగురంగుల , పువ్వుల పువ్వుల చొక్కాలు . రాజబాబువి కూడా అలాగే ఉంటాయి . ఇంక వాణిశ్రీ చీరల గురించి చెప్పేదేముంది . ఆమె చీరెల్ని ఆమే సెలెక్ట్ చేసుకునేవారేమో ! తెలుగు హీరోయిన్లలో వాణిశ్రీ , ఆమె తర్వాత లక్ష్మిలాగా చీరెల్ని కట్టే వారు లేరేమో ! అక్కినేనికి ఈ కాస్ట్యూమ్సుని డిజైన్ చేసింది ఎవరా అని ప్రత్యేకంగా టైటిల్స్ కూడా చూసా . యం కృష్ణారావు . అక్కినేనిని బాగా చూపారు . కానీ ఆ మీసకట్టే కాస్త బాలేదు .

రామానాయుడు గారి సినిమా . అన్నీ పకడ్బందీగా ఉంటాయి కదా ! ప్రొడక్షన్ ప్లానింగ్ , వగైరా అన్నీ టైటుగా ఉంటాయి . కధను బాగా నేయించారు . ఇద్దరు వాణిశ్రీలు . ఒకరు చనిపోయాక మరొకరు వస్తారు . దసరా బుల్లోడు సినిమాలో లాగా ANR , వాణిశ్రీల డ్యూయెట్లు చాలా అందంగా , హుషారుగా ఉంటాయి .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వాన్ని అభినందించాలి . పాటలన్నీ హిట్టే . ఆత్రేయ , వేటూరిలు వ్రాసారు . వేటూరి వ్రాసిన ఏ మొగుడూ లేకుంటే అక్క మొగుడే దిక్కని పాట బాగుంటుంది . చాలా పాపులర్ సామెత ఇది . ఈ సినిమా కధకు కూడా సూటయ్యేది . వేటూరి బాగా ఇరికించేసారు .

Ads

మిగిలిన పాటల్లో మెడికల్ కాలేజీలో రాగింగ్ పాట గోవిందా గోవిందా బాగుంటుంది . వాణిశ్రీ మీద చిత్రీకరించబడిన ఎళ్ళొస్తానోయ్ మావ పాటలో వాణిశ్రీ అదరగొట్టేస్తుంది . మిగిలిన పాటలు నేర్చుకో నేర్పుతాను , కాటుకెట్టి బొట్టుపెట్టి గమ్మత్తుగా చీరె కట్టి బాగా శ్రావ్యంగా ఉంటాయి .

దర్శకుడు బోయిన సుబ్బారావుకు రెండో సినిమా ఇది . ద్వితీయ విఘ్నం లేకుండా బాగా ఆడింది . 1980 లో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసారు . బందిష్ . రాజేష్ ఖన్నా హేమమాలినిలు హీరోహీరోయిన్లుగా నటించారు . బాపయ్య దర్శకుడు .

ప్రధాన పాత్రల్లో రాజబాబు , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్య , సత్యేంద్రకుమార్ , ఫటాఫట్ జయలక్ష్మి , శుభ , శాంతకుమారి , రమాప్రభ , రాధాకుమారిలు నటించారు .

మాటల్ని ఆత్రేయే వ్రాసినా ప్రేమనగర్ సినిమాలోలాగా గుర్తు ఉండేవి కావు . సినిమా విజయానికి కారణం వాణిశ్రీ , పాటలు , ANR … అన్నింటికన్నా ముందు రామానాయుడు గారి అదృష్టం , నిర్మాతగా పక్కా ప్లానింగ్ . పూర్తి వినోదాత్మక చిత్రం . యూట్యూబులో ఉంది . ANR , వాణిశ్రీ అభిమానులు చూడవచ్చు . వాణిశ్రీని ఎంత సేపయినా చూడొచ్చు . రామానాయుడు సినిమాలలో వాణిశ్రీ ఎక్కువ అందంగా కనిపిస్తుందేమో ! పాటల వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబులో . హుషారుగా ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions