ఒక జోక్… చైనా దగ్గర పుష్కలంగా అణ్వాయుధాలున్నయ్… త్వరలో 1500 అణ్వస్త్రాల్ని నిల్వ చేయనుందట… భారీ రీచ్ ఉండే మిస్సైళ్లు, అతి పెద్ద సైన్యం, భారీ ఆర్థికవనరులు, ప్రతిపక్షమే ఉండని సుస్థిర, నియంతృత్వ పాలన… క్షిపణి రక్షణ వ్యవస్థ, అత్యంతాధునిక ఫైటర్ విమానాలు, భారీ యుద్ధనౌకలు… ఐనాసరే, ఇండియా చైనాను చూసి భయపడదెందుకు..? వైర్లు చుట్టిన రాడ్లతో చైనా సైనికులను బాదిపారేస్తున్నది ఎలా..? గల్వాన్, తవాంగ్ సెక్టార్లలో ఢీ అంటే ఢీ అంటున్నదెందుకు..? చైనా ఆయుధాలంటే వణుకు లేదా..?
ఏమాత్రం లేదు… ఎందుకంటే… మేడిన్ చైనా అంటేనే నాసిరకం… చైనావాడు తన క్షిపణిని వదిలితే అది ఆ దేశంలోనే ఎక్కడో తుస్సుమని కిందపడిపోయే అవకాశాలే ఎక్కువ… ఇదీ జోక్… నిజం, చైనా సరుకు అంటేనే నాసిరకం… ఇన్నేళ్లు ఇతర దేశాలకు చైనా సరుకు ఓ జబ్బు… ఇప్పుడది తన తలకే చుట్టుకుంది… తను తయారు చేసిన కరోనా వేక్సిన్ ఉత్త డొల్ల అని తేలిపోయి, తన పరువునే కాదు, తన ప్రజల ప్రాణాలనే తీసేస్తోంది…
తను రూపొందించిన వైరస్… ఇప్పుడు దేశదేశాలు చుట్టి, లక్షల మందిని పొట్టనబెట్టుకుని… ప్రస్తుతం తన జన్మస్థానంలోనే కేంద్రీకృతమైంది… పల్లెత్తుమాట అనడానికి గడగడా వణికే ప్రజలు తిరగబడుతున్నారు… జీరో కోవిడ్ పేరిట జీవితాల్నే అస్తవ్యస్థం చేస్తున్న పాలసీలను ప్రశ్నిస్తున్నారు… చివరకు చైనా జనాగ్రహానికి తలొంచింది… లాక్ డౌన్లు ఎత్తేస్తోంది… కానీ ప్రజల ప్రాణాలకు పూచీ ఏది..? లేదు… ఆ వేక్సిన్లు పనిచేయవు… మరెలా..?
Ads
నిజానికి మొదట్లో చైనా పలు దేశాలకు సప్లయ్ చేసిన టెస్టింగ్ కిట్స్ నాసిరకం అని తేలిపోయి పలు వివాదాలు తలెత్తాయి… అప్పుడైనా అర్థం కావాలి కదా చైనా సరుకంటే ఏమిటో… చైనా సప్లయ్ చేసిన వేక్సిన్లను తీసుకున్నయ్… దాదాపు 150 కోట్ల డోసులు… అవిగాకుండా 30 కోట్ల ఉచిత డోసులు పేదదేశాలకు… ఈ వేక్సిన్లు తీసుకున్న పలు దేశాలు ఇదొక చెత్త టీకా మందు… దేనికీ పనికిరాదు అని తేల్చేశాయి… పోనీ, తన ప్రజల కోసమైనా నాణ్యమైన వేక్సిన్‌ను తయారు చేసుకోవచ్చు కదా అంటారా..? నాణ్యత అనేది చైనాకు చేతకాదు… అదీ అసలు జబ్బు…
ప్రపంచమంతా కరోనా భయం తొలగిపోతే, కేసులు తగ్గిపోతే… కొన్ని దేశాల్లో జీరో స్థాయికి వస్తే… చైనాలో మాత్రమే ఎందుకు ఇంకా పెరుగుతున్నయ్… ఇంకా పెరగవచ్చుననే అంచనాలు ఎందుకు వెలువడుతున్నాయి..? తన వైరసే తనకు భస్మాసుర హస్తంగా మారిందా..? ఒమిక్రాన్ గాకుండా ఇంకేదైనా కొత్త వేరియంట్ వ్యాపిస్తోందా..? ఇప్పుడు ప్రపంచదేశాలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? చైనాను ఐసొలేట్ చేయడం ద్వారానేనా..? అది సాధ్యమేనా..? చైనావాడు మిగతావన్నీ చీప్ క్వాలిటీతో తయారు చేస్తాడు గానీ కరోనా వైరస్‌ను మాత్రం చాలా భీకరమైన నాణ్యతతో పుట్టించాడు సుమీ అనేది మరో క్రూరమైన జోక్…!!
Share this Article