పార్ధసారధి పోట్లూరి ………. నాటో దేశాలలో చీలిక వచ్చిందా ? గతంలోనే చెప్పుకున్నట్లు రష్యా మీద ఆంక్షలు విధించి అమెరికా, యూరోపు మరియు జపాన్, ఆస్ట్రేలియాలు తప్పు చేశాయి అని రుజువు అవుతున్నది.
రెండు రోజుల క్రితం అప్పటి వరకు రష్యా మీద నిప్పులు చెరిగిన జపాన్ ఇప్పుడు రష్యా నుండి ఆయిల్ ని దిగుమతి చేసుకుంటాము అని ప్రకటించింది! జపాన్ కూడా రష్యాకి సంబంధించి డాలర్లని ఫ్రీజ్ చేసింది గత సంవత్సరం! కానీ చవకగా వచ్చే ఇంధనం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు రష్యాతో మళ్ళీ ఆయిల్ దిగుమతి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది !
ఎలా దిగుమతి చేసుకుంటుంది ? డాలర్లని ఇచ్చి కొనుగోలు చేస్తుందా ? లేక రష్యన్ రూబుల్ కొని దిగుమతి చేసుకుంటుందా ? రష్యా గత సంవత్సరమే ప్రకటించింది ఎవరన్నా క్రూడ్ ఆయిల్ మా దగ్గర కొనాలి అంటే అయితే రూబుల్ రూపంలో చెల్లింపులు జరపాలి లేదా చైనా కరెన్సీ అయిన యువాన్ల రూపంలో చెల్లించాలి అని! అమెరికా మరియు ఇతర యూరోపు దేశాల ఆంక్షలని కాదని మరియు తాను విధించిన ఆంక్షలని ఎత్తివేసి మరీ రష్యా నుండి ఆయిల్ కొంటుందా ?
Ads
ఏది ఎలా ఉన్నా జపాన్ రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవాలనే నిర్ణయం జో బిడెన్ యంత్రాంగంకి మింగుడు పడని చర్య ! గత రెండు రోజుల నుండి చైనా తైవాన్ ద్వీప కల్పంని చుట్టు ముట్టి నిజమయిన సైనిక విన్యాసాలు చేస్తున్నది తాను యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాను అంటూ ! ఈ దశలో జపాన్ తీసుకున్న నిర్ణయం తైవాన్ గొడవతో మాకేమీ సంబంధం లేదు అనే సంకేతాన్ని ఇచ్చినట్లుగా ఉంది. చైనా విషయంలో భారత్ ఎలా అయితే పట్టు విడుపు ధోరణిని ప్రదర్శిస్తున్నదో సరిగ్గా అదే రీతిలో జపాన్ కూడా ప్రవర్తిస్తున్నది. రష్యా నుండి ఆయిల్ కొనాలి అనే నిర్ణయం వెనుక చైనాతో సంబంధం ఏమిటీ అనే సందేహం రావొచ్చు మీకు, కానీ జింగ్పింగ్ రష్యా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాతే జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది అంటే బయటికి చెప్పని రహస్యం ఏదో ఉందనే అర్ధం కదా ?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చైనా పర్యటన !
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తన నాలుగు రోజుల చైనా పర్యటనని ముగించుకొని నిన్ననే తిరిగి పారిస్ వెళ్ళిపోయాడు. మాక్రాన్ కూడా జింగ్పింగ్ రష్యా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాతే చైనాలో పర్యటించాడు అన్నది గమనార్హం ! మాక్రాన్ చైనా పర్యటన కేవలం ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి జింగ్పింగ్ ని మధ్యవర్తిత్వం నెరపమని అడగడానికి అని బయటికి చెపుతున్నా అసలు ఉద్దేశ్యం వేరు. రోజు రోజుకి కుంగిపోతున్న తమ ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి గాను చైనా సహాయం కొరడానికే బీజింగ్ వచ్చాడు తప్పితే ఉక్రెయిన్ సంక్షోభం గురించి కానీ క్లైమేట్ ఛేంజ్ గురించి కాదు.
అఫ్కోర్స్ ఉక్రెయిన్ సంక్షోభం మరియు క్లైమేట్ ఛేంజ్ అనేది సాకు మాత్రమే ! ఒక పక్క అమెరికా తైవాన్ విషయంలో చైనాని రెచ్చేగొట్టే ధోరణిలో ఉండగా నాటో సభ్య దేశం అయిన ఫ్రాన్స్ ఇలా హఠాత్తుగా చైనాలో పర్యటించడం, అదీ తమ దేశ ఆర్ధిక అవసరాల కోసం అనేది ఉంది చూశారూ, ఇది ఎవరికీ మింగుడుపడని అంశం ! వాతావరణ అసమతుల్యత అనేది అన్ని దేశాలు కూర్చొని చర్చించే అంశం కానీ మాక్రాన్ ఒక్కడే చైనాని అభ్యర్ధించే అంశం కాదు. కానీ బయటి ప్రపంచానికి మాక్రాన్ క్లైమేట్ ఛేంజ్ అనే అంశం మీద చర్చించడానికి చైనా వెళ్ళాడు అనేది అబద్ధం ! దీని కోసం నాలుగు రోజులు కావాలా ?
నిన్న ఫ్రాన్స్ కి తిరిగి వెళుతూ మాక్రాన్ సంచలన వ్యాఖ్య చేశాడు : యూరోపు అమెరికాని అనుసరించకూడదు ! Well ! మొత్తానికి జ్ఞానోదయం అయ్యింది అన్నమాట ! మాక్రాన్ దారిలో మరిన్ని యూరోపు దేశాలు నడవబోతున్నాయి అన్నమాట !
మీ సమస్యలు మీవే!మా సమస్యలు మావే ! ఇదీ యూరోపు దేశాల ఆలోచనా ధోరణి ! గట్టిగా ఒక సంవత్సరం పాటు చవక ఇంధన సరఫరా ఆగిపోయేసరికి యూరోపు డొల్లతనం బయటపడ్డది ! రేపొద్దున నాటో కనుక రష్యాతో తలపడాల్సి వస్తే అది అందరూ కలిసి చేస్తారు అనే నమ్మకం పోయింది. ఫ్రాన్స్ దూరంగా ఉండిపోవచ్చు. ఇక ఉక్రెయిన్ నుండి రష్యా పైప్ లైన్ ద్వారా మరో నాటో దేశం అయిన హంగరీ దేశానికి ఇంధనమ్ సరఫరా అవుతున్నది, కానీ ఇంతవరకు ఉక్రెయిన్ ఆ పైప్ లైన్ ని ధ్వంసం చేయలేదు హంగరీ కోసం ! కాబట్టి హంగరీ దేశం కూడా రష్యాకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలని తీసుకోదు ! రేపో మాపో ఫ్రాన్స్ కూడా రష్యా నుండి ఇంధనం కొనడానికి మళ్ళీ ఒప్పందం చేసుకోవచ్చు లేదా పాత ఒప్పందాన్నే కొనసాగించమని రష్యాని కోరవచ్చు.
ఇక ఫిన్ లాండ్ దేశం నాటో సభ్య దేశంగా మారిపోయింది ! అంటే సరిగ్గా రష్యా సరిహద్దుల్లో నాటో తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట ! ఇది రష్యాని మరింత ఇరుకున పెట్టె చర్య ఆమెరికాది ! అయితే గియితే మూడో ప్రపంచ యుద్ధం అనేది రష్యా ఫిన్లాండ్ ని ఆక్రమించుకోవడం ద్వారా మొదలవవచ్చు !
ఇక ఉక్రెయిన్ యుద్ధం చివరి దశకి వచ్చింది అనేలోపుగా మళ్ళీ కొనసాగుతోంది… ఉక్రెయిన్ పైలట్ల కి F-16 ల మీద శిక్షణ ఇవ్వడం అనే కార్యక్రమం వేగంగా జరుగుతున్నది ! ఇది రష్యన్ ఫైటర్ జెట్ ఫ్లీట్ కి పెద్ద సవాలు ! రష్యన్ Su -30 లవరకు అయితే ఫరవాలేదు కానీ Su-30 కి ముందు ఏవయితే సోవియట్ యుగం నాటి ఫైటర్ జెట్స్ ఉన్నాయో అవి తుడుచుపెట్టుకు పోవడం ఖాయం !
అయితే ఇక్కడ చిన్న సమస్య ఉంది ! అది ఉక్రెయిన్ ఫైలట్లకి మొదటి నుండి సోవియట్ విమానాలు నడపడంలో మాత్రమే అనుభవం ఉంది. అదే F-16 దగ్గరికి వచ్చే సరికి పూర్తి భిన్నంగా ఉంటాయి ఆపరేషన్స్. పైగా ఉక్రెయిన్ పైలట్లకి ఇంగ్లీష్ భాష పెద్ద సమస్య ! ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇరాక్ సైన్యానికి అమెరికా తన అత్యాధునిక అబ్రామ్శ్ M1 A1 MBT లని ఇచ్చింది కానీ వాటిని ఆపరేట్ చేయడం లో విఫలం అవడం వలన అవి ISIS చేతిలోకి వెళ్లిపోయాయి చాలా వరకు ! ఇప్పుడు ఉక్రెయిన్ పైలట్లు చేసే పొరపాట్ల వల్ల F-16 లకి అదే గతి పడుతుంది అని అనుకోవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ! పైగా S-300 మరియు S-400 ల నుండి F-16 లు ఎలా తప్పించుకుంటాయో చూడాలి, ఎందుకంటే ఇప్పటివరకు ఈ రెండింటి మధ్య ఎలాంటి పోరాటం జరగలేదు !
ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ ఉప మంత్రి MS జపరోవా [Dzhaparova ] రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కి వచ్చింది ! మన విదేశాంగ శాఖ మంత్రి [state ] మీనాక్షీ లేఖితో సమావేశం అవుతున్నది. జస్ట్ ఉక్రెయిన్ కి ఆర్ధిక సహయమ్ అడగడానికి జపరోవా భారత్ కి వచ్చింది !
భారత్ ఏమన్నా ధర్మ సత్రమా ? ఉక్రెయిన్ ఎప్పుడూ భారత్ కి మద్దతుగా నిలవలేదు ! అలాంటప్పుడు ఎందుకు సహాయం చేయాలి ? సరిగ్గా సంవత్సరం క్రితం ఉక్రెయిన్ మంత్రి ఒకరు ఐక్యరాజ్యసమితిలో భారత్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది : ‘‘భారత్ విద్యార్దులు మా దేశంలో 10 వేల మందికి పైగా ఉన్నారు, వాళ్ళు సురక్షితంగా బయటికి ఎలా వెళతారు ?’’ ఈ వ్యాఖ్య చేసింది అధికారికంగానే ! ఇలాంటి హెచ్చరిక చేసిన ఉక్రెయిన్ కి ఇప్పుడు మన దేశం ఆర్ధికంగా సహాయం చేయాలట ! జపరోవా పర్యటన జస్ట్ ఒక ట్రిక్ ! సహాయం అడగడానికి వచ్చి ఎటూ ఇవ్వరని తెలిసీ, చూశారా, భారత్ రష్యా పుతిన్ వైపే ఇప్పటికీ బలంగా ఉన్నది అని అంతర్జాతీయ వేదికల మీద ఆరోపణలు చేయడానికే ఇదంతా !
అఫ్కోర్స్ మన పెద్దలకి ఇది తెలియదని కాదు, కానీ పరిశీలిస్తాం అని చెప్పి పంపిస్తారు తప్పితే సహాయం చేయకపోవచ్చు ! ఆయుధాలు ఇచ్చి యూరోపుతోపాటు అమెరికా కూడా అలిసిపోయాయి తప్పితే ప్రయోజనం ఏమీ లేదు ! ఇప్పుడు వాళ్ళని ఆర్ధిక సహాయం అడగలేక మన దేశానికి వచ్చారు ! పుతిన్ కి వ్యతిరేకంగా భారత్ ఇలాంటి వాటిని సమర్ధించదు !
కంక్లూజన్ : ఉక్రెయిన్ కి మద్దతు ఇచ్చి ఎలా నాశనం చేశారో ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా అదే చేయబోతున్నాయి అమెరికా యూరోపులు! చైనా ఒక్క ఆయిల్ కోసం తప్పితే మిగతావన్నీ తానే తయారుచేసుకోగల స్థితిలో ఉంది కాబట్టి రష్యా లాగా అవబోదు ! ఎటొచ్చీ చైనా ఆయుధాల పని తీరుని పసిగట్టడానికి పశ్చిమదేశాలకి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే రష్యా ఆయుధాల పని తీరుని సమీక్షించే అవకాశం దొరికింది ఇప్పుడు చైనా పని తీరుని సమీక్షించే అవకాశం ఉంది !
గత నెలలోనే నేను పోస్ట్ పెట్టాను చైనా తన ఆయుధాలని తైవాన్ సరిహద్దుల దగ్గరకి తరలిస్తున్నది అంటూ ! గత రెండు రోజుల నుండి తైవాన్ ని చుట్టుముట్టి విన్యాసాలు నిర్వహిస్తున్నది చైనా ! ఒక వేళ దాడి అంటూ మొదలు పెడితే రష్యా లాగా కాకుండా సమృద్ధిగా ఆయిధ డిపోలని నింపేసి సిద్ధంగా ఉంది. దీనికి నెల రోజుల సమయం తీసుకుంది చైనా! అయితే మొదటి దాడి తైవాన్ వైపు నుండి జరగాలని చూస్తున్నది చైనా !
Share this Article