చైనా ఆయుధాలు కొని మోసపోయిన బంగ్లాదేశ్ ! చైనా బాధితుల లిస్టులోకి తాజాగా బంగ్లాదేశ్ కూడా చేరిపోయింది! చాలా కాలంనుండి భారత్ చుట్టూ ఉన్న దేశాలకి ఆయుధాలు అమ్మడం ద్వారా భారత్ ని ఇబ్బంది పెట్టాలనే దురాలోచనతో ఉంది చైనా ! ఆ ఆలోచనని భారత్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆచరణలో పెట్టింది గుట్టుచప్పుడు కాకుండా ! అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు సరికదా మౌనంగా ఉండిపోయింది. చైనా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి తమ ఆయుధాలని కొనిపించి, కనీసం 30 ఏళ్లు తమ మీదనే ఆధారపడేట్లు చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్న వాటిని వాటి నాణ్యత బాగా లేకపోయినా చచ్చినట్లు వాడాల్సిందే మరియు వాటి విడి భాగాల కోసం చైనా మీద ఆధారపడాల్సిందే ! దీనివల్ల భారత్ దగ్గర నుండి సమీప భవిష్యత్తులో ఆయుధాలు కొనే అవసరం ఉండదు…
ఇప్పటికే బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్, నావీకి అమ్మిన చైనా ఆయుధాలు సరిగా పనిచేయట్లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు చైనా… తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీకి అమ్మిన ఆయుధాలు కూడా పనిచేయట్లేదు అని వాపోతున్నది బంగ్లా ఆర్మీ! చైనాకి చెందిన నార్త్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ [North Industries Corporation (Norinco)] బంగ్లాదేశ్ కి యుద్ధ టాంకులకి సంబంధించి సరఫరా చేసిన మందుగుండు సామాగ్రి మరియు విడి భాగాల నాణ్యత తమకి చూపించినట్టు కాకుండా చాలా హీనమయిన నాణ్యత కలవి సరఫరా చేసిందంటూ బంగ్లా ఆర్మీ అధికారులు వాపోతున్నారు. సరఫరా చేసిన వాటిని తిప్పి చైనాకి పంపివేసింది బంగ్లా ఆర్మీ !
అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్ కి ఈ చైనా సరఫరా చేసిన నాసిరకం ఆయుధాలు మరియు విడిభాగాలు తలనొప్పిగా మారాయి. చైనా సరఫరా చేసిన వాటిని తిరస్కరించినా నారింకో [Norinco] మళ్ళీ ఎప్పుడు తిరిగి మంచివి సరఫరా చేస్తుందో తెలియదు. మంచివి అంటూ తిరిగి వాటినే బాచ్ నంబర్లు మార్చి సరఫరా చేసే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. గతంలో చాలా దేశాలకి చైనా ఇలానే చేసింది.
Ads
రోమన్ డిఫెన్స్ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ [Roman news portal DIFESA] డీఫెస రిపోర్ట్ ప్రకారం చైనా బంగ్లాదేశ్ కి అమ్మిన అన్ని తేలికపాటి ఆయుధాలు [Light Weopons],ఆర్టీలరీ, ఆర్మూడ్ వెహికిల్స్ [artillery and armoured vehicles] కూడా రష్యా ఆయుధాలని కాపీ చేసి తయారు చేసినవే ! చాలా వరకు రష్యన్ ఆయుధాలకి నంబర్ 2 గ్రేడ్ ని ఇచ్చాయి ప్రముఖ డిఫెన్స్ న్యూస్ పత్రికలు… రష్యన్ కాపీ ఆయిన చైనా ఆయుధాలకి నంబర్ 3 గ్రేడ్ ని ఇచ్చాయి.
నిజానికి చైనా తను తయారుచేసే ఆయుధాలకు సంబంధించి సమయానికి ఎక్కువ ప్రాధాన్యత [Time Target ] ఇస్తుంది, అంటే దీనర్ధం ఎంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ తయారు చేస్తున్నాము అన్న దానినే లెక్క వేస్తుంది… అంతే తప్పితే వాటి క్వాలిటీ కంట్రోల్ మీద శ్రద్ధ పెట్టదు. ప్రతి బాచ్ లోని ఆయుధాలని నిశితంగా పరీక్షించి అవి తగిన ప్రమాణాలతో ఉన్నాయా లేవా అన్న దానిని నిర్ధారించుకోవాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ నిర్ణీత ప్రమాణాలు లేవని తేలితే ఆ బాచ్ మొత్తం ఆయుధాలని ఫాక్టరీ నుండి బయటికి వెళ్ళకుండా చూస్తారు. ఇది వెస్ట్రన్ దేశాల ఆయుధ తయారీదారులు పాటించే పద్దతి. అలాగే భారత్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నది ఇప్పటివరకు. కానీ చైనాకి ఇవేవీ పట్టవు. రోజుకి ఎన్ని ఫాక్టరీ నుండి బయటికి వస్తున్నాయో లెక్క వేసుకుంటుంది, కానీ క్వాలిటీ విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు.
బంగ్లాదేశ్ తన ఆర్మీని పటిష్టం చేయడం కోసం, ఆధునీకరించే పనిలో భాగంగా 2010-2020 అంటే పదేళ్ళలో దశల వారీగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల కోసం కొత్త తరం ఆయుధాలని సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకొని, తక్కువ ధర కోట్ చేసిందని చైనా నుండి కొంటూ వచ్చింది. ఎయిర్ ఫోర్స్ కి చైనా ఇచ్చిన షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో భారీగా లోపాలు ఉన్నట్లు కనుగొన్నది నెల రోజుల క్రితమే… ఇప్పుడు తేలికపాటి ఆయుధాలు [Light Weopons],ఆర్టీలరీ, ఆర్మూడ్ వెహికిల్స్ [artillery and armoured vehicles] అన్నీ లోపాలతో ఉండడమే కాదు, వాటికోసం పంపిన విడి భాగాలు, ఆయుధాలు కూడా లోప భూయిష్టంగా ఉన్నాయని బంగ్లా ఆర్మీ ఆరోపిస్తూ వాటిని వెనక్కి పంపింది.
రెండేళ్ల క్రితమే రష్యన్ డిఫెన్స్ కౌన్సిల్ ఒక ప్రకటన చేసింది: చైనా ఆయుధ తయారీ సంస్థలకి కనీసం యుద్ధ టాంకులు తయారుచేయగల పూర్తి సామర్ధ్యం లేదు అని… చైనా తయారీ యుద్ధ టాంకులు అవి ఏవయినా సరే అవి పూర్తి శక్తి , సామర్ధ్యం కల యుద్ధ టాంకులతో ఏ మాత్రం పోటీపడలేవు. కీలకమయిన విడి భాగాల కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ చైనా సంస్థలు అంత రిస్క్ తీసుకోవు. ఒక యుద్ధ టాంక్ తయారు చేయాలంటే చాలా దశలలో కఠిన పరీక్షలని దాటుకొని రావాలి, కానీ చైనా ఆయుధ సంస్థల నాణ్యత నియంత్రణ [క్వాలిటీ కంట్రోల్ ] నామ మాత్రముగా ఉంటాయి.
రష్యాకి రావాల్సిన థాయిలాండ్ , సెర్బియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంట్రాక్టులతో పాటు పలు ఆఫ్రికా దేశాలు కూడా చైనా నుండి ఆయుధాలు కొన్నాయి. ఇందులో థాయిలాండ్ మరియు సెర్బియా దేశాలకి షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని రష్యా సరఫరా చేయాలని చూసినా అతి తక్కువ ధరలో చైనా ఈ దేశాలకి అమ్మగలిగింది. చివరకి రష్యన్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకటన చేస్తూ చైనా అంత తక్కువ ధరకి అమ్మే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చైనా చెప్పినట్లుగా పనిచేయవని తెలిపింది… ఇప్పుడు బంగ్లాదేశ్ మొదటిసారిగా వాటిలోని లోపాలని బయటపెట్టింది. గత సంవత్సరం పాకిస్థాన్ సైన్యం ముందు చైనా అధికారులు ఒక మిసైల్ టెస్ట్ నిర్వహించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్ డిఫెన్స్ కి చెందిన మిసైల్ సిస్టమ్ ఒకటికి మూడు సార్లు ప్రయత్నించినా అవి గాల్లోకి ఎగరలేదు సరికదా కృత్రిమ టార్గెట్ ని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు అసలు పసిగట్టలేకపోయాయి.
ఇప్పుడు చైనా దగ్గర ఆయుధాలు కొన్న దేశాలకి వేరే మార్గం ఉండబోదు… వాటిని వాడి తీరాల్సిందే లేదా వాటిని పక్కన పెట్టేసి కొత్తవి కొనాలి. బహుశా రాబోయే 10 ఏళ్లు చాలా కీలకమవబోతున్నాయి మన దేశానికి ! ఎందుకంటే చైనా ఆయుధాలు కొని బాధపడుతున్న దేశాలకి ప్రత్యామ్నాయం భారత్ అవవచ్చు! ఇంతా చేస్తే చైనా కూడా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో మన వెనకాలే ఉంది ! కానీ ఇప్పటికిప్పుడు చైనా లాభపడ్డా రాబోయే రోజుల్లో మన దేశం నుండి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది క్వాలిటీ విషయంలో ! చైనా బాధిత దేశాలు క్రమంగా మన దేశం వైపు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని రష్యన్ ఆయుధ సంస్థల చూపు మన దేశం వైపు ఉన్నది. రష్యన్ ఆయుధ సంస్థలు క్రమంగా ఒక్కోటీ మన దేశానికి తరలి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రస్తుతం రష్యాకి నిపుణులయిన ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉండడం వలన చాలా ఆయుధ పరిశ్రమలలో ఖాళీలు భారీగా ఉన్నాయి… వాటిని భర్తీ చేయగల వారు ప్రస్తుతం అందుబాటులో లేరు రష్యాలో… గత నాలుగు నెలల కాలంలో రష్యన్ ఇంజినీర్లు దేశాన్ని వదిలి ఇతర దేశాలకి వలస వెళ్లిపోయారు, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా అభివృద్ధి మరియు పరిశోధన జరుగుతుంది, కానీ తయారీ మాత్రం భారత్ లోనే జరిగే అవకాశాలు సమీప భవిష్యత్తులో ఉన్నాయి…
Share this Article