.
Pardha Saradhi Upadrasta …. చైనా సైన్యంలో భారీ ప్రక్షాళన కొనసాగుతోంది!
చైనా మాజీ రక్షణ మంత్రులు Wei Fenghe, Li Shangfu కు అవినీతి కేసుల్లో “2 సంవత్సరాల సస్పెండెడ్ డెత్ సెంటెన్స్” విధించారు. (అంటే వెంటనే మరణశిక్ష వేయకుండా, రెండేళ్ల పరీక్షాకాలం ఉంటుంది, పర్లేదు అనుకుంటే యావజ్జీవంగా మారుస్తారు)…
వీరిద్దరిపై భారీ లంచాలు తీసుకోవడం, అధికార దుర్వినియోగం, సైనిక నియామకాలలో అక్రమాలు చేసిన ఆరోపణలు నిరూపితమయ్యాయి.
చైనా కోర్టు వీరి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలని, జీవితాంతం రాజకీయ హక్కులు రద్దు చేయాలని కూడా ఆదేశించింది.
Ads
ఇది కేవలం అవినీతి కేసు మాత్రమే కాదు…
చైనా అధ్యక్షుడు Xi Jinping గత కొన్ని సంవత్సరాలుగా PLA (People’s Liberation Army) లో పెద్ద ఎత్తున “పర్జ్” నిర్వహిస్తున్నాడు.
ఎందుకు ఈ పర్జ్?
▪️ సైన్యంలో అవినీతి విపరీతంగా పెరిగిందని బీజింగ్ భావిస్తోంది.
▪️ రాకెట్ ఫోర్స్, మిసైల్ ప్రోగ్రామ్, ఆయుధాల కొనుగోలు విభాగాల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి.
▪️ Xi Jinping కు పూర్తిగా విధేయత లేని అధికారులు టార్గెట్ అవుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది.
▪️ 2023 నుంచి 100+ పైగా సీనియర్ మిలిటరీ అధికారులు విచారణలు, తొలగింపులు లేదా అదృశ్యాలు ఎదుర్కొన్నారు
ముఖ్యంగా “Rocket Force” పై దృష్టి…
Wei Fenghe గతంలో చైనా Rocket Force కమాండర్. ఇదే విభాగం చైనా అణు క్షిపణులు, హైపర్సోనిక్ మిసైల్స్‌ను నియంత్రిస్తుంది. అక్కడ జరిగిన అవినీతి , భద్రతా లోపాలు Xi ను తీవ్రంగా కలవరపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని రహస్యాలు శత్రు దేశాలకు అమ్ముకున్నారు అనే ఆరోపణలు కూడా వున్నాయి..
ప్రపంచానికి ఇది ఏం సంకేతం?
Xi Jinping ఇప్పుడు PLA పై పూర్తి నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సైన్యంలో loyalty > capability అనే పరిస్థితి పెరుగుతోందని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం, అయితే ఈ భారీ ప్రక్షాళన వల్ల చైనా సైన్యపు command structure బలహీనపడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు వస్తున్నాయి.
“చైనా సైన్యంలో మావో కాలం తర్వాత ఇదే అతిపెద్ద అంతర్గత ప్రక్షాళన” అని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. — ఉపద్రష్ట పార్ధసారధి
#China #XiJinping #PLA #ChineseMilitary #LiShangfu #WeiFenghe #Corruption #Geopolitics #RocketForce #MilitaryPurge #ChinaNews #PardhaTalks
Share this Article