పార్ధసారధి పోట్లూరి …. ఎవ్వరు తీసిన గోతిలో వాళ్లే పడాలి సామెత ప్రకారం! చైనాకి చెందిన అణు జలాంతర్గామి ప్రమాదానికి గురయి 55 మంది సైలర్స్ మరణించారు!
****************
బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఈ సమాచారాన్ని బయట పెట్టినట్లుగా తెలుస్తుస్తున్నది! కానీ చైనా మాత్రం తన సబ్మెరైన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బుకాయిస్తున్నది! సాధారణంగా బ్రిటీష్ ఇంటెలిజెన్స్ చాలా అరుదుగా ఇలాంటి సమాచారాన్ని బయటపెడుతుంది. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ బయటపెట్టిన సమాచారంలో పలు సాంకేతిక (టెక్నీకల్) అంశాలు ఉండడం వలన సమాచార విశ్వసనీయత మీద నమ్మకం కలుగుతున్నది!
Ads
అసలేం జరిగింది? చైనాకి చెందిన PLA 093-417 అనే అణు జలాంతర్గామి తూర్పు చైనా (yellow sea) సముద్రంలో రొటీన్ గస్తీ కాస్తుండగా ప్రమాదానికి గురైంది! అయితే ఈ ప్రమాదం అనేది యాదృచ్చికం కాదు. తూర్పు చైనా సముద్రంలో అమెరికన్, బ్రిటీష్ యుద్ధ నౌకలతో పాటు నేవీకి చెందిన న్యూక్లియర్ సబ్ లు కూడా ప్రయాణిస్తుంటాయి.
చైనా అంతర్జాతీయ జలాలని తమదిగా ప్రకిటించుకొని (2015) ఆ జలాలలోకి వచ్చే పోయే నౌకల మీద నిఘా పెడుతున్నది. ఆగస్టు 21 న చైనా అణు జలాంతర్గామి తూర్పు చైనా సముద్రంలో నిఘా కోసమ్ వెళ్లగా ప్రమాదానికి గురైంది. నిజానికి అది ప్రమాదం కాదు. చైనా ఏర్పాటు చేసిన ట్రాప్ లో తన సబ్ మెరైనే చిక్కుకొని మొత్తానికి మొత్తం సిబ్బందిని కోల్పోయింది!
అమెరికన్, బ్రిటీష్ సబ్ లని ట్రాప్ చేయడానికి చైనీస్ నేవీ సముద్రంలో ఇనుప చైన్ లని అమర్చి వాటికి బరువయిన యాంకర్లు అమర్చింది!
సముద్రం అడుగున ప్రయాణించే సబ్ లకి ఐరన్ చైన్లు అడ్డుపడి ఆపేస్తాయి. పోనీ అలానే ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే యాంకర్లు ఉండడం వలన ముందుకు వెళ్లలేవు లేదా సముద్ర ఉపరితలంకి వెళ్లలేవు! హాచ్ ని తెరిచి ఎవరన్నా చైన్లని తీసివేయాలన్నా ఒకరు ఇద్దరితో సాధ్యం కాదు!
దీనిని అండర్ వాటర్ ట్రాప్ లు అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం నుండి ఈ టెక్నాలజీని వాడుతున్నారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి అయిన తరువాత ఇలాంటి అండర్ వాటర్ ట్రాప్ లని సులభంగా గుర్తించి తప్పించుకు పోతున్నాయి సబ్ లు.
**************
చైనీస్ సబ్ తన ట్రాప్లో తానే చిక్కుకొని నాశనం అయ్యింది! నిపుణుల అనాలసిస్ ప్రకారం చైనీస్ సబ్ ఐరన్ చైన్ ట్రాప్ లో చిక్కుకొని ఆ కుదుపుకి సబ్ లోపలి సిస్టమ్స్ టెంపరరీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రోపల్షన్ సిస్టం (Air Independent Propulsion System- AIP) దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది.
AIP సిస్టంలో రెండు విభాగాలు ఉంటాయి. 1. ఆక్సిజెన్ జెనెరేటర్. 2. కార్బన్ డైయాక్సైడ్ ని కలెక్ట్ చేసి దానిని నిల్వ ఉంచే సిస్టం. AIP సిస్టం దెబ్బతినడంతో మొదట ఆక్సిజెన్ ఉత్పత్తి ఆగిపోయింది. కార్బన్ డైయాక్సైడ్ ని కలెక్ట్ చేసి నిల్వ చేసే సిస్టమ్ కూడా దెబ్బతినడంతో విష వాయువులు అక్కడే ఉండి పోవడంతో సబ్ లోని సిబ్బంది మొత్తం హైపోక్సీయాతో చనిపోయారు.
దెబ్బతిన్న AIP సిస్టమ్ ని తిరిగి పనిచేయించడానికి సబ్ లోని ఇంజినీర్లు నిర్విరామంగా 6 గంటల పాటు పనిచేశారు కానీ ఆక్సిజెన్ లేకపోవడం, సిబ్బంది వదిలే కార్బన్ డైయాక్సైడ్ అక్కడే ఉండిపోవడం, అణు రియాక్టర్ ని చల్లబరిచే ప్రక్రియలో ఎలెక్ట్రిక్ జెనరేటర్స్ నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ కూడా అక్కడే ఉండిపోవడం వలన సబ్ లోని 55 మంది సిబ్బంది చనిపోయారు! 22 మంది సీనియర్ ఆఫీసర్స్, 7 మంది ఆఫీసర్లు , 17 మంది సైలర్స్, 9 మంది సహాయకులు చనిపోయారు. కెప్టెన్ Captain Colonel Xue Yong-Peng కూడా చనిపోయాడు.
*****************
సబ్మెరైన్ లో వాడే సోనార్ (అండర్ వాటర్ రాడార్) సిస్టమ్ విషయంలో చైనా, రష్యాలు చాలా వెనకపడిపోయి ఉన్నాయని బయట పడ్డది. కనీసం తాము ఏర్పాటు చేసిన ట్రాప్ ని గుర్తించలేని విధంగా చైనా సబ్మెరైన్ సెన్సార్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా భారత్ కి అనుకూలించే అంశం. అత్యాధునిక సోనార్ సిస్టం, దాని సబ్ సిస్టమ్స్, సెన్సార్స్ విషయంలో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాలు చాలా ముందున్నాయి. అయితే భారత్ విషయంకి వచ్చేసరికి రష్యన్, ఫ్రాన్స్ లతో పాటు మరింత మెరుగయిన ఇజ్రాయెల్ సెన్సార్స్ ని ఉపయోగిస్తుంది.
2015 లోనే అత్యాధునిక మెరైన్ సెన్సార్స్ మీద భారత్, ఇజ్రాయెల్ ఒప్పందం చేసుకోవడమే కాదు వేగంగా వాటిని మన సబ్మెరైన్ లలో వాడడం మొదలుపెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ మెరైన్ సెన్సార్లు అత్యాధునికమైనవి. ఈ విషయంలో భారత్ ది పైచేయి. So, హిందూ మహాసముద్రంలో మన నేవీ శక్తిని ఏ దేశము తక్కువ చేసి చూడలేదు! చైనా సబ్ లో AIP సిస్టమ్ విఫలం అవడం మీద మళ్లీ AIP సిస్టంకి ప్రాముఖ్యత ఏర్పడింది.
2020 లో మన DRDO పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో AIP సిస్టమ్ ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. బహుశా మరో రెండేళ్లలో మన స్వంత AIP సిస్టమ్ ఎవరి మీద ఆధారపడకుండా పూర్తి స్ధాయిలో వినియోగంలోకి రావొవచ్చు!
Share this Article