Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికావాడి పొగరు, బలుపు దింపాలంటే… అది చైనాకే సాధ్యం…

January 28, 2025 by M S R

.

Jaganadha Rao ……. చైనా పోరాటపటిమని ఖచ్చితం గా అభినందించాలి, హాట్సాఫ్ చైనా…

ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ (AI) గురించి చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఈ కృత్రిమ మేధలో అమెరికానే టాప్. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ లో చాట్ జీపీటీ కూడా ఎక్కువ భాగం తెలుసు. అయితే చాట్ జీపీటీని రూపొందిన సంస్థ పేరు ఓపెన్ AI.

Ads

అమెరికా అధ్యక్షుడు అవగానే డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ మధ్య ఓపెన్ ఏఇ సంస్థ CEO శ్యాం ఆల్టమన్ ని కలిసి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ లో మనం ఎవరికీ అందనంత ఎత్తుకి వెళ్ళాలి, మన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాకూడదు అని చెప్పి ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ లో భారీ గా పెట్టుబడులు పెడదాం అని చెప్పాడు.

ఇంతవరకు బానే ఉంది… ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ లో ప్రపంచంలో నంబర్ వన్ సంస్థ ఓపెన్ AI, కంపనీ CEO శ్యాం ఆల్ట్ మన్ గతంలో (June 2023) ఇండియా వచ్చినప్పుడు అతన్ని ఒక ప్రశ్న అడిగారు “మా ఇండియాలో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెజెన్స్‌కి సంబంధించి మేం అభివృద్ధి చెందాలి అంటే ఏమి చేయాలి, ఎలా ప్రారంభించాలి” కొంచెం చెప్తారా..? అని………

దానికి సమాధానంగా ఓపెన్ AI, CEO ఇలా చెప్పాడు – మీ ఇండియన్స్ వలన కానీ, మీ కంపనీల వలన కానీ ఇది సాధ్యం అవదు, కంప్లీట్లీ హోప్ లెస్, మీ ఇండియన్స్ వలన ఎప్పటికీ అయ్యేపని కాదు టోటల్లీ హోప్ లెస్ అన్నాడు.

ఆ పొగరు, అహంకారం అమెరికన్స్ కి ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కట్ చేస్తే రెండు సంవత్సరాలు తిరగక ముందే మన ఇండియన్స్ క్రియేట్ చేయలేదు కానీ మన పక్కన ఉన్న చైనా వాళ్ళు అమెరికా ఓపెన్ AI యొక్క చాట్ జీపీటీ కంటే కొంచెం గొప్పగానే “డీప్ సీక్” తయారు చేశారు నిన్న.

చైనా వాళ్ళ దెబ్బకి అమెరికన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. స్టాక్ మార్కెట్ లో అమెరికన్ టెక్నాలజీ ఇండెక్స్  NASDAQ 100 ఒక్కరోజే 3% పడిపోయింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అమెరికా స్టాక్స్ అయితే భారీగా పడిపోయాయి, NVIDIA అయితే ఏకంగా ఒక్కరోజులోనే 17% పడింది.

అమెరికాలో కొన్ని వేల, లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఆవిరి అయ్యాయి. అమెరికన్ కంపనీల తలపొగరు ఒక్క రోజులోనే 100 సెంటీమీటర్లు దిగింది. ఒక చిన్న చైనా స్టార్ట్ అప్ సంస్థ “డీప్ సీక్” దెబ్బకి అమెరికా కంపనీలతో సహా డోనాల్డ్ ట్రంప్ కూడా అబ్బా అని అరిచాడు.

అవన్నీ పక్కన పెడితే చైనా యొక్క స్టార్ట్ అప్ సంస్థ డీప్ సీక్ ఫౌండర్ పేరు “లియాంగ్ వెన్ ఫెంగ్”. ఇతను చైనాలో ఒక బడి పంతులు కొడుకు. చైనాలో మంచి యూనివర్శిటీల్లో చదివిన/ చదువుతున్న పిల్లలని తీసుకొని దీన్ని రూపొందించాడు. చాలా తక్కువ ఖర్చుతోనే డీప్ సీక్ తయారు చేశాడు.

చైనా వాళ్ళకి ఇంగ్లీష్ పెద్దగా రాకపోయినా అమెరికాలో ఉన్న ప్రతి పెద్ద కంపనీ, టెక్నాలజీకి ప్రత్యామ్నాయం సొంతంగా తయారు చేసుకున్నారు. అమెరికా- చైనా పోలికలు: చైనా ఎప్పటికప్పుడు అమెరికా టెక్నాలజీకి సమానమైన లేదా బెటర్ ప్రత్యామ్నాయాలను తయారు చేస్తూ ముందుకెళ్తోంది

1. అమెరికా చాట్ జీపీటీకి చైనా ప్రత్యామ్నాయం డీప్ సీక్
2. అమెరికా గూగుల్ కి చైనా ప్రత్యామ్నాయం బైడూ
3. అమెరికా అమెజాన్ కి చైనా ప్రత్యామ్నాయం అలీబాబా
4. అమెరికా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ కి చైనా ప్రత్యామ్నాయం వీచాట్, వైబో, టిక్‌టాక్
5. అమెరికా యూట్యూబ్ కి చైనా ప్రత్యామ్నాయం యూకూ
6. అమెరికా నెట్‌ఫ్లిక్స్ కి చైనా ప్రత్యామ్నాయం బిలిబిలి
7. అమెరికా ఆపరేటింగ్ సిస్టమ్ iOS/Android కి చైనా ప్రత్యామ్నాయం హార్మనీ OS
8. అమెరికా స్మార్ట్‌ఫోన్స్ (Apple) కు చైనా ప్రత్యామ్నాయం షావోమి, హువావే, ఒప్పో, వివో Etc.
9. అమెరికా ల్యాప్‌టాప్ (Dell) కు చైనా ప్రత్యామ్నాయం లెనోవో
10. అమెరికా నెట్‌వర్కింగ్ (సిస్కో) కు చైనా ప్రత్యామ్నాయం హువావే
11. అమెరికా పేమెంట్ సిస్టమ్ (వీసా, మాస్టర్‌కార్డ్) కు చైనా ప్రత్యామ్నాయం వీచాట్ పే, అలీపే
12. అమెరికా ఈ-కామర్స్ (వాల్‌మార్ట్) కు చైనా ప్రత్యామ్నాయం సునింగ్, గోమ్
13. అమెరికా రైడ్‌షేరింగ్ (Uber) కు చైనా ప్రత్యామ్నాయం దీది చుక్సింగ్
14. అమెరికా ఎలక్ట్రిక్ కార్లు (టెస్లా) కు చైనా ప్రత్యామ్నాయం BYD, Nio
15. అమెరికా క్లౌడ్ కంప్యూటింగ్ (AWS, Azure) కు చైనా ప్రత్యామ్నాయం అలీబాబా క్లౌడ్, టెన్సెంట్ క్లౌడ్
16. అమెరికా వీడియో గేమ్స్ (Activision Blizzard) కు చైనా ప్రత్యామ్నాయం టెన్సెంట్, నెట్‌ఈజ్
17. అమెరికా ఫిల్మ్ మేకింగ్ (వార్నర్ బ్రదర్స్) కు చైనా ప్రత్యామ్నాయం వాండా పిక్చర్స్
18. అమెరికా ఆఫీస్ సాఫ్ట్‌వేర్ (MS Office) కు చైనా ప్రత్యామ్నాయం WPS ఆఫీస్
19. అమెరికా ఆపరేటింగ్ సిస్టమ్ (Windows) కు చైనా ప్రత్యామ్నాయం కైలిన్ OS
20. అమెరికాతో సమానంగా లేదా ఎక్కువే…  చైనా వాళ్లు సొంత టెక్నాలజీ తో సూపర్ కంప్యుటర్స్ తయారు చేసుకున్నారు. అమెరికన్స్ మా దగ్గరే ఎక్కువ ఉన్నై అంటారు, అది వేరే విషయం

ఈ భూమి మీద కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి, బాగుపడాలి. మరొక్కసారి హాట్సాఫ్ చైనా  – సామాన్యుడు (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…
  • పార్టీ పాలసీల్లో గందరగోళం, అస్పష్టత… అమరావతిపై యూటర్న్ అదే…
  • ‘కూలీ’ ఇచ్చి మరీ… కొరడాలతో కొట్టించుకోవడమంటే ఇదే…
  • నాటకాలు, సినిమాలు… రచన, నటన… విసు ఓ తమిళ దాసరి…
  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
  • ‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions