పార్ధసారధి పోట్లూరి ………. చైనా – తైవాన్ వివాదం పార్ట్ 02… తమ విమానాలని తైవాన్ గగనతలంలోకి పంపించి వివరాలు సేకరించడం అనేది గత సంవత్సర కాలంలో మూడు సార్లు జరిగింది ! అయితే ప్రతిసారీ ఇలా ఎందుకు చేస్తున్నది చైనా ? తైవాన్ లో అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఎక్కడ ఎక్కడ మోహరించింది అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికే ! అయితే ఈ పని గూఢచార ఉపగ్రహాల ద్వారా చేయవచ్చు కదా అనే సందేహం కలుగవచ్చు మనకి.
గూఢచార ఉపగ్రహాలని బోల్తా కొట్టించగల టెక్నిక్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో వాడుకలోకి వచ్చేసింది! డిజిటల్ కామొఫ్లాజ్ [Digital Camouflage] ద్వారా నిజంగా ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి వాటిని అక్కడక్కడా పెడతారు కానీ అవి నిజమయినవి కావు… జస్ట్, అలా కనపడతాయి ఉపగ్రహాలకి ! గత లాడాక్ కాన్ఫ్లిక్ట్ సమయంలో భారత్ కూడా ఇలాంటి టెక్నిక్ నే వాడింది ! ఉక్రెయిన్ కూడా అమెరికా నాటో సహాయంతో రష్యాని బోల్తా కొట్టించింది చాలాసార్లు. ఈ డిజిటల్ కామోఫ్లాజ్ ద్వారా రష్యా కనీసం 30 క్రూయిజ్ మిస్సైళ్లని నష్టపోయింది నకిలీ టార్గెట్లని నిజమయినవి అనుకోని !
***************
Ads
గత సోమవారం ఉదయం చైనా తన నిఘా విమానాలని తైవాన్ గగనతలం మీదకి పంపించడం అనేది ఈసారి నిజంగానె తైవాన్ మీద దాడి చేయడానికి ఉద్దేశించి చేసిన ట్రయల్ రన్ !
చైనా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది ఎందుకని ?
1. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా సుదీర్ఘంగా జరగకూడదు ! ఆపరేషన్ తైవాన్ అనేది ఒక నెలలోపే జరిగిపోవాలి. లేకపోతే రష్యా నష్టపోయినట్లు తాను సుదీర్ఘ కాలం యుద్ధం చేస్తూ నష్టపోవడానికి ఇష్టపడట్లేదు!
2. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కొత్తగా చాలా పాఠాలు నేర్చుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. వీటిలో భారత్ మరీ ముఖ్యంగా 80% రష్యా వెపన్స్ ని వాడుతున్నది కనుక ఇది అత్యవసరం భారత్ కి.
3. ఇక చైనా కూడా పూర్తిగా రష్యా నుండి దిగుమతి చేసుకున్న వాటితో పాటు రష్యన్ ఆయుధాలని రివర్స్ ఇంజినీరింగ్ ప్రక్రియ ద్వారా తయారుచేసుకున్నది కాబట్టి రష్యా ఏ విభాగంలో ఏ ఆయుధం విఫలం అయ్యింది అది ఎందుకు విఫలం అయ్యింది అనే కోణం లో డాటా తీసుకుంటూనే వస్తున్నది !
4. తైవాన్ పూర్తిగా అమెరికన్ ఆయుధాలని వాడుతున్నది కాబట్టి చైనా దాడి చేయడానికి సమయం తీసుకున్నది ఇన్నాళ్ళూ! ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధం అయ్యింది !
5. రష్యా ఉక్రెయిన్ మీద దాదాపుగా 1300 మిస్సైళ్లని ప్రయోగించింది ఇప్పటి వరకు. వీటిలో క్రూయిజ్ మిస్సైళ్ళ తో పాటు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ళు, హైపర్ సానిక్ మిస్సైళ్ళు ఉన్నాయి!
6. కానీ ఉక్రెయిన్ లొంగలేదు ఎందుకని ? ఏ యుద్ధం అయినా ఆకాశం, సముద్రం, భూమి మీద ఆధిపత్యం వహించగలిగితేనే గెలవగలుదు.
7. రష్యా మొదట్లో మూడు విభాగాలలో ఆధిపత్యం వహించినా ఆపరేషన్ ని కొనసాగించడంలో వ్యూహాత్మక తప్పిదాలు చేశారు రష్యన్ ఫీల్డ్ కమాండర్లు! దాంతో మొదట భూమి మీద తన ఆధిపత్యాన్ని కోల్పోయింది రష్యా… దీనికి కారణం ఉక్రెయిన్ కి అమెరికా ఇచ్చిన యాంటీ టాంక్ జావెలిన్ మిస్సైళ్ళు రష్యన్ మెయిన్ బాటిల్ టాంక్ లని నాశనం చేయడం… దాదాపుగా 2 వేల జావెలిన్ మిస్సైళ్ళు ఉక్రెయిన్ కి సరఫరా చేసింది అమెరికా. వీటి వల్ల రష్యా దాదాపుగా 500 ల యుద్ధ టాంకులని నష్టపోయింది.
8. అమెరికన్ యాంటీ టాంక్ జావెలిన్ మిస్సైల్ పరిధి 4 కిలోమీటర్లు. లక్ష్యాన్ని గురి తప్పకుండా కొట్టగలిగే జావెలిన్ వల్ల ఉక్రెయిన్ భూభాగం మీద రష్యా ఆధిపత్యం వహించలేకపోయింది. జావెలిన్ ఆధునిక యుద్ధ టాంకుల కోసం తయారుచేయబడ్డది కాబట్టి అవతలి యుద్ధ టాంక్ ఎలాంటిది అయినా నాశనం అయిపోతుంది.
9. ఇక బ్రిటన్ ఇచ్చిన NLaw యాంటీ టాంక్ , యాంటీ ఆర్మ్డ్ పర్సనల్ వెహికిల్ [APV-AFV] మిసైళ్ళ వల్ల యుద్ధ రంగంలో యుద్ధ టాంక్ లతో పాటు, APV , AFV లని వందల సంఖ్యలో నష్టపోయింది రష్యా. NLaw మిసైల్ పరిధి 800 మీటర్లు. బ్రిటన్ వీటిని 2 వేల దాకా ఇచ్చింది ఉక్రెయిన్ కి. అమెరికన్ జావెలిన్, బ్రిటన్ NLaw మిసైళ్లు వందల సంఖ్యలో వాటి సీల్ తీయని స్థితిలో రష్యాకి చిక్కాయి గత ఏడాది మొదట్లో ! అఫ్కోర్స్ రివర్స్ ఇంజినీరింగ్ చేయడంలో రష్యా కూడా దిట్ట !
10. తనకి దొరికిన జావెలిన్, NLaw మిసైళ్ళని కొన్ని తన దగ్గర ఉంచుకొని కొన్నింటిని చైనాకి తరలించింది రష్యా.
11. గత ఆరునెలలుగా జావెలిన్, NLaw లని నిశితంగా పరిశీలించి వాటి బలాలు, బలహీనతలని గుర్తించారు చైనా ఇంజినీర్లు.
12. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లు జావెలిన్, NLaw లని తైవాన్ కి కూడా ఇచ్చి ఉండవచ్చు పైగా సమయం ఉంది కాబట్టి తైవాన్ సైనికులకి వాటిని ఎలా వాడాలో ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉంటుంది అమెరికా.
13. జావెలిన్, NLaw లని ఎలా డాడ్జ్ [Dodging] చేయవచ్చో కనిపెట్టింది చైనా. డాడ్జింగ్ అంటే తన మీదకి వచ్చే మిస్సైళ్ళ ని తప్పు దారిపట్టించి రక్షించుకోవడం అన్నమాట. ఏ టెక్నాలజీ ద్వారా [సీకర్స్] అయితే జావెలిన్, NLaw లు అవతలి వైపు ఉన్న యుద్ద టాంక్ లేదా APV లని గుర్తుపట్టి దాడి చేస్తాయో వాటికి విరుగుడుగా తమ యుద్ధ టాంక్ ల మీద ఎలెక్ట్రానిక్ సిస్టమ్స్ అమర్చి వాటిని ప్రయోగాత్మకంగా వాడి చూసింది చైనా ! అవి విజయవంతంగా జావెలిన్, NLaw లని బోల్తా కొట్టించాయి. So ! తైవాన్ మీద దాడి విషయంలో చైనాకి ఎలాంటి భయాలు ఉండబోవు ఇప్పుడు.
14. ఇక మిగిలింది సముద్రం ద్వారా తైవాన్ లోకి ప్రవేశించేటప్పుడు అమెరికన్, యూరోపు లకి చెందిన యాంటీ షిప్ మిసైళ్ళ వలనే ఇప్పుడు చైనాకి ముప్పు పొంచి ఉంది. రష్యా తన నావీని నల్ల సముద్రంలో ఉక్రెయిన్ కి దూరంగా ఉంచుతున్నది అంటే అది ఉక్రెయిన్ కి చెందిన నాటో టెక్నాలజీతో రూపొందించిన యాంటీ షిప్ మిస్సైళ్ళ వల్లనే.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెక్నాలజీల గురించి చెప్పాల్సి ఉంటుంది! చైనా యుద్ధ సన్నద్ధత రష్యా వైఫ్యల్యాల నుండి నేర్చుకున్నదే ! ఒక్కో దానిని సమీక్షించి సమయం తీసుకొని మరీ తైవాన్ మీదకి కాలు దువ్వుతున్నది చైనా! అయితే గియితే ఒక నెలలోపే దాడిని ముగించి తైవాన్ ని తన అధీనంలోకి తీసుకోవాలి అని చైనా ఆలోచన ! కానీ అది జరుగుతుందా ? చైనా తైవాన్ తో పాటు అమెరికా, యూరోపు దేశాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు భారత్ ప్రేక్షక పాత్ర వహిస్తుందా? లేక PoK తో పాటు ఆక్సయి చిన్ ల స్వాధీనం కోసం ప్రయత్నిస్తుందా?
వారం క్రితం చైనా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో రహస్య చర్చలు ఎందుకు చేశాడు? భారత్ వ్యూహం ఏమిటి ? తరువాత
తెలుసుకుందాము !
Share this Article