మాట్లాడితే చాలు, అమెరికా సామ్రాజ్యవాదం, దుర్నీతి వంటి చాలా పదాలు వాడుతుంటారు చాలామంది… అఫ్‌కోర్స్, చైనా మత్తులో ఉండి అలా కొన్ని పడికట్టు పదాల్ని వాడేస్తుంటారు… కానీ చైనా కపటం మాత్రం కనిపించదు వాళ్లకు… టిబెట్‌ను గుట్టుచప్పుడు గాకుండా మింగిన ఆ అనకొండకు తన ఇరుగూపొరుగూ దేశాలన్నింటితోనూ తగాదాలున్నయ్…
మన ఆక్సాయ్‌చిన్ మింగేయడమే కాదు, అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా గుటుక్కుమనాలనే ఆకలి దానిది… మన చుట్టూ ఉన్న దేశాల్ని తన ట్రాపులో పడేసుకుని, మనల్ని చక్రబంధంలో ఇరికించే కుట్రలే రోజూ… ఆల్రెడీ పాకిస్థాన్ తన వలలో చిక్కి దివాలా దశకు చేరింది… చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ దాన్ని ముంచేస్తుంది… నేపాల్ ఆల్రెడీ ఆ ట్రాపులో ఇరుక్కుంది…
మాల్దీవుల సంగతి తెలిసిందే… శ్రీలంకను ట్రాపులో వేసింది… అది రెండేళ్ల క్రితం దివాలా తీసింది… సమయానికి ఇండియా 3.5 బిలియన్ డాలర్ల సాయం చేస్తే తాము గట్టెక్కామని నిన్న శ్రీలంక అధ్యక్షుడు ప్రకటించాడు… చైనా నిజరూప దర్శనం జరిగిపోయింది దానికి… ఇప్పుడిక చైనా బంగ్లాదేశ్ మీదకు ట్రాప్ విసురుతోంది…
Ads
నిన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాక నేపథ్యం కూడా ఇదే… రెండు వారాల్లోనే ఇది రెండో పర్యటన… ప్రధాని మోడీ స్వయంగా ఆమెకు స్వాగతం పలికాడు… ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది… విదేశీ మారక నిల్వలు అడుగంటాయి… ఇండియా సాయం కోరుతోంది ఆమె… మీరు కాదంటే చైనా వైపు మళ్లుతాం అనే ఓ చిన్నపాటి బ్లాక్ మెయిల్ కూడా…
ఆల్రెడీ చైనా నుంచి 5 బిలియన్ డాలర్ల లోన్ అడిగింది బంగ్లాదేశ్… షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్లినప్పుడు ఇది ఖరారు కావచ్చుననేది అంచనా… కాకపోతే చైనా ట్రాపులో ఇరికితే మళ్లీ బయటపడటం కష్టమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు… ఇటీవల బంగ్లాదేశ్ ముఖ్యులు ఇజ్రాయిల్‌ను, యూదుల్ని విమర్శిస్తున్నారు… ఇది రానురాను బంగ్లాదేశ్‌కు ముప్పు తీసుకొచ్చేట్టుంది…
అమెరికా, యూరప్ దేశాలకు బంగ్లాదేశ్ దుస్తుల్ని ఎగుమతి చేస్తుంది… దాని ఆర్థిక వ్యవస్థకు అదే ఆలంబన… ఈ కొనుగోళ్లలో యూదులే ఎక్కువ… వాళ్లు బంగ్లాదేశ్ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకుని ఆర్డర్లను రద్దు చేస్తూ పోతే బంగ్లాదేశ్ మరింత కుప్పకూలుతుంది… షేక్ హసీనా పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికే ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేసింది… ఇప్పుడిక ఇజ్రాయిల్, యూదు, ఇండియా వ్యతిరేక ప్రచారం బాగా పెరిగింది…
ఇండియా ఉత్పత్తుల బహిష్కరణ పిలుపు ప్రభావం చూపిస్తూనే ఉంది… ఆ పార్టీపై ఆల్ ఖైదా ప్రభావం ఉందంటారు… ఈ వ్యతిరేక ప్రచారాలతో పాలక అవామీ లీగ్ పార్టీ తల్లడిల్లిపోతోంది… బంగ్లాదేశ్‌కు మరో తలనొప్పి… 12 లక్షల మంది రోహింగ్యాలు ఈ దేశంలోకి పారిపోయి వచ్చారు… ఆ క్యాంపులు అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులకు అడ్డాలుగా మారుతున్నాయి… హసీనా ప్రత్యర్థులు కూడా వాళ్లతో చేతులు కలుపుతున్నారు…
ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ఆసక్తిగా ఎదురుచూస్తోంది… హసీనా ప్రత్యర్థులు బలం పెంచుకోవడం చైనాకు ఆనందంగా ఉంది… ఒకవేళ చైనా ట్రాపులో బంగ్లాదేశ్ పడితే మాత్రం ఇండియాకు నష్టదాయకమే… ఈ స్థితిలో హసీనా ప్రధాని మోడీతో ముఖాముఖి చర్చల కోసం ఇండియాకు వచ్చింది… విదేశాంగ మంత్రి జైశంకర్ దౌత్య నైపుణ్యానికి ఇప్పుడు ఒక పరీక్ష..! హసీనా రాకకు ఏవేవో ఒప్పందాలను బయటికి చెబుతున్నా ఆమెకు కావల్సింది తక్షణం ఆర్థికసాయం..!!
Share this Article