Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇజ్రాయిల్, హమాస్ యుద్ధంపై చైనా యూ టర్న్… నమ్మి భంగపడిన రష్యా…

October 26, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట! పార్ట్ -6……. అమెరికా మరో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ని తూర్పు మధ్యధరా సముద్రంలోకి పంపింది!ఇరాన్ కనుక హమాస్ కి మద్దతుగా దిగితే ఎదుర్కోవడానికి ! So! మధ్యధరా సముద్రం దాదాపుగా అమెరికన్ నేవీ పర్యవేక్షణ కిందకి వచ్చినట్లుగా భావించాలి! మరో వైపు మిగిలిన నాటో దేశాలు కూడా తమ డిస్ట్రాయర్స్ , ఫ్రిగేట్స్ ని మధ్యధరా సముద్రంలోకి పంపించాయి ఇజ్రాయెల్ కి మద్దతుగా!

***************
అయితే పుతిన్ కి ఈ చర్య మింగుడు పడేది కాదు. ఎందుకంటే సిరియాకి సహాయంగా వేటినైనా పంపించాలి అంటే మధ్యధరా సముద్రం నుండి పంపించాలి కానీ కుదరదు. పుతిన్ జింగ్పింగ్ కి ఫోన్ చేసాడు మధ్యధరా సముద్రంలోకి చైనా యుద్ధ నౌకలని పంపమని. పుతిన్ చైనాకి వెళ్లినప్పుడే మాట్లాడుకున్నారు కనుక జింగ్పింగ్ ఒప్పుకున్నాడు!
*****************
మొత్తం 6 యుద్ధనౌకలని చైనా మధ్యధరా సముద్రంలోకి పంపింది! చైనాకి రష్యా కంటే ఇరాన్ తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. చైనా ఇప్పటికే 25 సంవత్సరాల కాలంకి ఇరాన్ నుండీ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది! చాలా తక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నది చైనా! ఇక ఆయిల్ కి చెల్లింపులు కూడా చైనా కరెన్సీ అయిన యువాన్ లలో చెల్లిస్తుంది. బదులుగా ఇరాన్ చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులకు తిరిగి అవే యువాన్ల ని చెల్లిస్తుంది. చైనా తన ముడి చమురు అవసరాలలో 50% ఇరాన్ నుండి దిగుమతి చేసుకుంటుంది, అదీ తన డాలర్ రిజర్వ్ నుండి ఒక్క డాలర్ కూడా ఖర్చుపెట్టకుండా, కాబట్టి ఇరాన్ రక్షణ కోసం చైనా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
*********************
యెమెన్ నుండి హుతీ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీదకి నాలుగు మిసైల్స్, 6 కామికాజ్ డ్రోన్లని ప్రయోగించారు అయితే అమెరికన్ నావీ వాటిని మార్గమధ్యంలోనే అడ్డుకొని కూల్చేసింది. రష్యా, చైనా, ఇరాన్ దేశాలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ని అన్నివైపుల నుండి ముట్టడించే విధంగా ప్లాన్ చేశాయి.
ప్రస్తుతం లేబనాన్ లోని హెజేబొల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ తో ఘర్షణకు దిగారు.  గతంలోలాగా హెజెబోల్లా లేదు ఇప్పుడు. ప్రస్తుత హెజ్బొల్లా తీవ్రవాదులు రష్యన్ కొర్నేట్ (9M133 వాడుతున్నారు… కోర్నెట్ అనేది రష్యన్ మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, ఇది ప్రధాన యుద్ధ ట్యాంకులకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించబడింది) యాంటీ టాంక్ గైడెడ్ మిసైల్ సమకూర్చుకున్నారు. కొర్నేట్ ని రష్యా ఇరాన్ కి సప్లయ్ చేస్తే అది వాటిని హెజ్బొల్లాకి ఇచ్చింది.
******************
హెజ్బొల్లాకి ప్రస్తుతం 50 వేల మంది పూర్తి స్థాయిలో మిలటరీ శిక్షణ పొందిన ఫైటర్స్ ఉన్నారు. వీళ్ళకి రష్యన్, ఇరానియన్ సైన్యాలు శిక్షణ ఇచ్చాయి. ఇక ఇరాన్ అయితే యెమెన్ లోని హుతీ తీవ్రవాదులకి ఇచ్చిన రాకెట్స్, మిసైల్స్, RPG లతో పాటు కొర్నేట్ లు కూడా ఇచ్చింది. ఇరాన్ ఇప్పటి వరకు 1,50,000 రాకెట్లు, మిసైల్స్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. లేబనాన్ లో ఉన్న హెజ్బొల్లా మీద తీవ్ర స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నది IDF…

*********************

ఇక రెండు రోజుల క్రితమే పుతిన్ తన ఎయిర్ ఫోర్స్ కి ఆదేశాలు ఇచ్చాడు… MIG-31 లని కింఝాల్ (Kizjhal) హైపర్ సానిక్ యాంటీ షిప్ మిసైళ్లతో అనుసంధానం చేసి నల్ల సముద్రం మీద పహారా కాయమని… ప్రస్తుతం రష్యా దగ్గర ఉన్నది, నాటో దేశాల దగ్గర లేనిదీ ప్రభావవంతమయిన Mig-31 మరియు కింఝాల్ హైపర్ సానిక్ మిసైల్ . కింఝాల్ హైపర్ సానిక్ మిసైల్ పరిధి 2 వేల కిలోమీటర్లు. MIG-31 నల్ల సముద్రం మీద పహారా కాయడం అనేది పెద్దగా ఉపయోగం లేదు కానీ సిరియా తీరంలో Khmeimim airbase రష్యాకి ఉంది. అక్కడ S-400 తో పాటు రష్యన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికా కనుక వీటి మీద దాడి చేస్తే ఎదుర్కోవడానికి 24 గంటల పహారా పనికి వస్తుంది, కానీ కింఝాల్ ని అమెరికా కూల్చివేయగలదు.

Ads

*******************

So! మొత్తానికి చైనా ధైర్యం చేసిందా? పుతిన్ అడిగాడు కాబట్టి తన నేవీని పంపించాడు కానీ నిన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇజ్రాయెల్ కి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది, కానీ పౌరులకి ప్రాణహాని కలగకుండా చూడాలి అని ప్రకటించాడు!

******************

చైనా U టర్న్?

అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా రావాల్సిందిగా వాంగ్ లీ ని కోరిన వెంటనే ఒప్పుకున్నాడు! 26, 27 తేదీలలో అంటే నేడు, రేపు చైనా విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనలో ఉండి బ్లింకెన్, జో బిడెన్ లతో చర్చలు జరపబోతున్నాడు అన్నమాట! వెరసి పుతిన్ పిచ్చోడు అయ్యాడు. చైనాకి తన అవసరాలు ముఖ్యం కానీ రష్యా, పుతిన్ లు కాదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions