Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !

August 20, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మధ్యలో మోహన్ బాబు అల్లరి మొగుడు సినిమా గుర్తుకొస్తుంది . కానీ అంతలోనే దర్శకుడు ప్లేట్ మార్చి ఇంకో అల్లుడ్ని దింపేస్తాడు . చలసాని గోపి నిర్మాతగా శరత్ దర్శకత్వంలో 1993 అక్టోబరులో వచ్చిన సినిమా ఈ చిన్నల్లుడు సినిమా .

గిరీశం అనే మేరేజి బ్రోకర్ని ఆడపిల్లల తండ్రి కోట శ్రీనివాసరావు అవమానిస్తాడు . ఆ అవమానంతో అతనికి గుణపాఠం చెప్పాలని బస్ స్టాండులో మూటలు మోసే కూలివాడయిన సుమన్ని అమెరికా కుర్రాడు అని చెప్పి మోసంతో పెద్ద కూతురు ఆమనితో పెళ్లి జరిపిస్తాడు .

Ads

మాయమాటలు చెప్పి మామూలు ఇంట్లో పట్నంలో కాపురం పెట్టిస్తాడు . చిన్న కూతురు రంభ కూడా సుమన్ని ప్రేమిస్తుంది . ఇద్దరు సుమన్లు ఉన్నట్లు కాసేపు నాటకం జరుగుతుంది . క్లైమాక్సులో రంభ గర్భవతి అని తెలుస్తుంది . ఆమె గర్భానికి కారణం మరో ధనవంతుడి కొడుకు అయిన శ్రీకాంత్ అని తెలుస్తుంది .‌

శ్రీకాంత్ కు రంభకు పెళ్ళి చేయటానికి సుమన్ , మేరేజి బ్రోకర్ గిరీశం పాత్రలో దాసరి నారాయణరావు తిప్పలు పడతారు . మొత్తం మీద పెళ్లి జరిపించటంతో సినిమా ముగుస్తుంది .

కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి పాటలు బాగుంటాయి . ముఖ్యంగా కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బాగా హిట్టయిన పాట . సుమన్ రంభ మీద ఉంటుంది . ఎక్కడో కాస్త ట్యూన్ 1967 భక్త ప్రహ్లాద సినిమాలో పాములోళ్ళమయ్య మా పెగ్గె చూడరయ్య గుర్తుకొస్తుంది . ఈ చిన్నల్లుడు సినిమాలోని ఈ పాటను F3 సినిమాలో రీమిక్స్ చేసారు .

మరో రీమిక్స్ పాట అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం . 1953 లో వచ్చిన బ్రతుకు తెరువు సినిమాలోనిది . సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది . యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడు ఆ సినిమాకు . సి ఆర్ సుబ్బరామన్ లిరిక్స్ వ్రాసారు . ఏయన్నార్ , సావిత్రి లీడ్ రోల్సులో నటించారు . అయితే ఈ పాట సుమన్ , దాసరి మీద సాగుతుంది సినిమాలో .

ప్రేక్షకులను ఊపే పాట సిల్కో సింగారి కన్నే . సిల్క్ స్మిత , సుమన్ల మీద . సుమన్ , ఆమని మీద రెండు డ్యూయెట్లు ఉంటాయి . ఒకటి మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం . ఇంకొకటి ఓలమ్మీ వడ్డాణంగా . కులుకులు కులుకులు కులుకులు కులు అంటూ సాగే వాన పాట సుమన్ , రంభ మీద ఉంటుంది .

అన్యాయం ఏమిటంటే డ్యూయెట్లేమో రంభతో సుమన్ పాడుతాడు . పెళ్ళేమో శ్రీకాంత్ తో జరుగుతుంది .
ప్రధాన పాత్రల్లో సుమన్ , ఆమని , రంభ , శ్రీకాంత్ , దాసరి , కోట శ్రీనివాసరావు , బాబూమోహన్ , వై విజయ , సిల్క్ స్మిత , సుధాకర్ , గిరిబాబు , చలపతిరావు , ఆలీ , కల్పనారాయ్  ప్రభృతులు నటించారు .‌

సినిమా చూడబులే . హాస్యం , అల్లరి , చిన్న చిన్న మలుపులతో బాగుంటుంది . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు ట్రై చేయవచ్చు . ఖాళీ టైం ఉన్నవారు వాచ్ లిస్టులో పడేసుకోవచ్చు….

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions