Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమా రిజల్ట్‌పై వెక్కివెక్కి ఏడ్చానని చిరంజీవే చెప్పాడు..!!

August 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టరయింది ఖైదీ . భారీ ఖర్చుతో నిర్మించబడి అతి భారీ అంచనాలతో వచ్చి అత్యంత భారీ ఓపెనింగ్సుతో ఓపెన్ అయి కుదేలయింది ఈ వేట సినిమా . ఓ టాక్ షోలో ఈ సినిమా ఫ్లాపయిందని వెక్కివెక్కి ఏడ్చానని చిరంజీవే చెప్పారు .

అందరూ చెత్త అన్నా చాలా సినిమాలు నాకు నచ్చుతాయి . I am a liberal evaluator as a teacher also . అలాంటి నాకూ నిరుత్సాహం కలిగింది ఈ సినిమాతో . ఏం బాగా లేదు అంటే అన్నీ బాగానే ఉంటాయి .

Ads

ఏం బాగా లేదంటే… జయప్రద చిరంజీవి కోసం నిరీక్షించకుండా , మోహన్ శర్మ మాటలు నమ్మి , తల్లి బలవంతం మీద , చిరంజీవి గుర్తును కడుపులో ఉంచుకొని పెళ్ళి చేసుకోవటం . కధకు ఇదంతా తప్పదనుకుంటే జయప్రద పాత్రలో సుమలతని , సుమలత పాత్రలో జయప్రదని వేసేసినా జనం కాస్త జీర్ణించుకునే వారేమో !

అటుచేసి ఇటుచేసి చిరంజీవి , జయప్రదల కాంబినేషన్ని ఐరన్ కాంబినేషన్ని చేసారు . ఇద్దరూ కలిసి నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావటంతో మూడో సినిమా రాలేదు .

1844 లో అలెగ్జాండ్రి డ్యూమాస్ రచించిన The Count of Monte Cristo ఈ వేట సినిమాకు మూలం . ఈ నవల ఆధారంగా పలు భాషల్లో చాలా సినిమాలు తీయబడ్డాయి . మళయాళంలో పదయొట్టం అనే టైటిలుతో కూడా ఒక సినిమా వచ్చింది . ప్రేం నజీర్ , ముమ్ముట్టి , మోహన్లాల్ , లక్ష్మి , పూర్ణిమ నటించారు . హిట్టయింది కూడా .

చాలా సినిమాల్లాగే వేట సినిమా కూడా ప్రతీకారం తీర్చుకునే సినిమాయే . అయితే రొటీన్ సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది . బ్రిటిష్ కాలంలోని సినిమా . ఒక నిర్దోషికి స్వార్ధంతో జీవిత ఖైదుని వేసి అండమాన్ జైలుకు పంపుతాడు ప్రాసిక్యూటర్ . అక్కడ ఓ మాజీ మహారాజుని కలిసి ఆయన దాచిపెట్టిన నిధి వివరాలు తెలుసుకుని చనిపోయిన ఆయన బదులు జైల్లో నుంచి బయటపడి స్వేఛ్ఛా ప్రపంచంలోకి వస్తాడు హీరో . ఇదంతా రొటీనుకు కాస్త భిన్నం . బాగుంటుంది .

బయటపడ్డ హీరో నిధి వేటలో నరభక్షకుల బారి నుండి బయటపడే ఫైట్లు బాగుంటాయి . విలన్లను వేటాడటం కూడా చిరంజీవి అభిమానులకు బాగుంటుంది . మోహన్ శర్మను లేపేసే క్లైమాక్స్ ఖైదీ సినిమా చూస్తున్నట్లుగా ఉంటుంది . సక్సెసులకు ఎలా అయితే స్టోరీలు ఉంటాయో ఫెయిల్యూర్సుకూ స్టోరీలు ఉంటాయి . ఇదీ ఈ వేట ఫెయిల్యూర్ స్టోరీ .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి , రాజశ్రీ , సీతారామశాస్త్రులు వ్రాసిన పాటలు జేసుదాస్ , బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు శ్రావ్యంగా పాడారు . తార , రఘు నృత్య దర్శకత్వంలో డాన్సులు కూడా బాగుంటాయి .

ఓ రాణీ మహరాణీ ప్రియదర్శిని రసవర్షిణి రావే , ఊరేవిటమ్మా పేరేమిటమ్మా , ఎదురు చూసిన జాబిలి నిదుర లేచిన రాత్రి , సింగారి ఈడు డ్యూయెట్లు కోదండరామిరెడ్డి మార్కులో బాగుంటాయి . జేసుదాస్ పాడిన ఓ లేడి కూనా ఈ వేటలోన అలిసేవు పరుగులోన చాలా బాగుంటుంది .

ప్రధాన పాత్రల్లో నూతన్ ప్రసాద్ , జగ్గయ్య , రంగనాధ్ , సి యస్ రావు , రాజ్ వర్మ , హేమ సుందర్ , డబ్బింగ్ జానకి , మాడా , మిక్కిలినేని , ప్రభృతులు నటించారు . 1986 మే 28న రిలీజయింది .

ఈ సినిమాకు కధను నిర్మాత తిరుపతి రెడ్డి గారే సెలెక్ట్ చేసుకుని సినిమాకు అనుగుణంగా మలచమని పరుచూరి బ్రదర్సుకి అప్పచెప్పారు . డైలాగ్స్ కూడా పరుచూరి బ్రదర్స్ లెవెల్లో ఉండవు ఎందుకనో ! ఖైదీలో హీరోయినుగా నటించిన మాధవిని ఎందుకు తీసుకొనలేదు అని ఓ ఇంటర్వ్యూలో నిర్మాతని ఏంకరయ్య అడిగితే ఎందుకులెండి అని ఆయన సమాధానం చెప్పకుండా ఎవాయిడ్ చేసారు .

ఏది ఏమయినా సినిమా చూడతగ్గ సినిమాయే . ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు బాగానే నచ్చుతుంది . అంచనాలు ఎక్కువ అయినప్పుడే ఇలాంటి విపత్కర ఫలితాలు ఉంటాయి . బహుశా ఇదే జరిగి ఉండాలి ఈ సినిమాకు కూడా . యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . నేను టివిలో చాలాసార్లు చూసా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా నడుం తాకుతావా..? నాన్సెన్స్, ఇక మీ భాషాసినిమాల్లోనే నటించను…
  • పారాసెటమాల్, ఐబుప్రొఫెన్‌లతో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్..!!
  • ఫాఫం మోడీ భాయ్… నువ్వూ కాళేశ్వరం కుట్రలో భాగస్వామివేనట..!!
  • రేవంత్‌రెడ్డి సైలెంట్ ర్యాగింగ్… కేసీయార్ క్యాంపు పరుగులు, ఆపసోపాలు…
  • సంకేతాలు అవేనా..? తదుపరి అగ్రదేశ అధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు..?
  • కురిసిన ఈ సిరివెన్నెల వెలుగుల్లో తడవని ప్రేక్షకుడు లేడు అప్పట్లో…
  • ఇల్యూమినాటి..! ప్రపంచాన్ని శాసించే ఈ గ్రూపు టార్గెట్ మోడీ..?!
  • ఖంగుమనే ఆ గొంతు నుంచి జాలువారిన తీయని పాటలూ ఎన్నో
  • ఈ సినిమా రిజల్ట్‌పై వెక్కివెక్కి ఏడ్చానని చిరంజీవే చెప్పాడు..!!
  • బిట్‌కాయిన్ కేసు..! ఇండియాలో ఓ క్రిప్టో సెన్సేషన్… శిక్షలు ఖరారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions