Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుమ కాబట్టి… చిరంజీవి కాబట్టి… ఈటీవీ షో కాబట్టి… ప్రమోషన్ అవసరం కాబట్టి…

January 6, 2023 by M S R

సుమ కాబట్టి..! టీవీ, సినిమా వార్తల రిపోర్టింగులో తరచూ ఈ పదం వింటున్నదే… మొన్న నయనతార పదేళ్ల తరువాత బుల్లి తెర మీద కనిపిస్తూ సుమ ఇంటర్వ్యూ కాబట్టి వచ్చాను అని చెప్పుకుంది… సేమ్, అలాంటిదే ఆమె సుమ కాబట్టి చిరంజీవి ఆ షోకు వస్తున్నాడు అనేది టాపిక్, ఎస్.. టీవీ షోల హోస్టింగ్, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్ల యాంకరింగులో సుమ అంటే సుమ… అంతే… ఆమె రేంజుకు వెళ్లేవారు ఎవరూ ఉండరు… ఆమె టీవీషోలలో కూడా వివాదాల జోలికి వెళ్లదు… సరదా, అల్లరి…

ఆమె క్యాష్ అనే టీవీ షో ఆపేసి, రీసెంటుగా సుమ అడ్డా అనే కొత్త షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే… అందులో చిరంజీవి, బాబీ కూడా ఓ ఎపిసోడ్‌లో కనిపించబోతున్నారు… దాన్ని సంక్రాంతి సందర్భంగా ప్రసారం చేయనుంది ఈటీవీ… వార్త పాతదే… ఆమె సుమ కాబట్టి చిరంజీవి ఆ షోకు ఓ సాధారణ సెలబ్రిటీలా రావడానికి అంగీకరించాడు అనేదే ఓ చిరు చర్చ… అంతటి మెగాస్టార్ ఓ మామూలు అల్లరి టీవీషోకు రావడం తన సింప్లిసిటీకి నిదర్శనం అని మహాశ్చర్యపోయేవాళ్లు కూడా ఉన్నారు… సో, ఆయన చిరంజీవి కాబట్టి, తను కూడా ఈ సరదా షోలను ఇష్టపడతాడు కాబట్టి, సుమ షోకు హాజరవుతున్నాడనేది వాళ్ల భావన…

ఇలాంటి టీవీ షోల నిర్మాత మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి చిరంజీవికి సన్నిహితుడు కాబట్టి, ఆయన అడిగాడు కాబట్టి, చిరంజీవి మొహమాటంతో అంగీకరించాడు అని మరికొందరు తేల్చిపడేస్తున్నారు… తప్పు… ఆయన అడిగాడు కాబట్టి చిరంజీవి చేయడు, తన లెక్కల్లో ఫిట్టయితేనే చేస్తాడు చిరంజీవి… పైగా బాబ్బాబు, ఈ షోకు ఒక్కసారి వచ్చిపోవా ప్లీజ్ అని చిరంజీవిని ఆయన అడిగాడనేది అబ్సర్డ్… నిజానికి సుమ, చిరంజీవి అనే కోణాలు లేవు ఇక్కడ… సిట్యుయేషన్ డిమాండ్ చేస్తోంది కాబట్టి అనేదే అసలు పాయింట్…

Ads

suma

సినిమాల ప్రమోషన్ అంటే ప్రెస్ మీట్ పెట్టేసి, వాళ్లు అడిగిన ఏవో నాలుగు ప్రశ్నలకు జవాబులు చెప్పేసి వెళ్లిపోయే రోజులు కావు ఇవి… ఓ భారీ ప్రిరిలీజ్ ఫంక్షన్ పెట్టేస్తే కూడా సరిపోదు… టీవీషోలకు వెళ్లాలి, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వాలి, సోషల్ మీడియాను వాడేసుకోవాలి, చివరకు చిన్నాచితకా యూట్యూబర్ల పిచ్చి ఇంటర్వ్యూలకూ సిద్దపడాలి… అయితే మన తెలుగుకు సంబంధించి ఫస్ట్ గ్రేడ్ వరుసలో ఉండే హీరోలు ఇంకా ఇలాంటి కొత్త తరహా ప్రమోషన్ వర్క్‌కు ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్నారు… పడాలి…

నిజానికి తాము కూడా జనంలోకి వెళ్లాలంటే ఇప్పుడిలాంటివే బెటర్… చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు ప్రమోషన్ కావాలి… ఇటు సుమ అడ్డా షోను పాపులర్ చేసుకోవాలి… సో, ఆమె అడిగింది, ఈయన సరేనన్నాడు… అంతే… టీవీకి అడాప్టయ్యే విషయంలో బాలయ్యను మెచ్చుకోవచ్చు… ఆఫ్టరాల్ అన్‌స్టాపబుల్ అనే ఓటీటీ షో ద్వారా విస్తృతంగా జనానికి రీచయ్యాడు ఇటీవల కాలంలో… పెద్ద పెద్ద టీవీ చానెళ్లలో గాకుండా ఒక ఓటీటీ కోసం ఈ షో చేయడం గ్రేటే… పైగా దాన్ని అల్లాటప్పాగా గాకుండా తనను తాను మార్చుకుంటూ, బుల్లితెరకు తనను అడాప్ట్ చేసుకుంటూ ఓ కొత్త బాలయ్య కనిపిస్తున్నాడు…

బాలయ్య కాబట్టి… చంద్రబాబులు, ప్రభాస్‌లు, పవన్ కల్యాణ్‌లు వస్తున్నారు తప్ప, వేరేవాళ్లు అడిగితే వాళ్లు ఇలాంటి షోలకు వస్తారా..? రారు, ఇక్కడా రేంజ్ చూసుకుంటారు… అది అల్లు అరవింద్ ఓటీటీ కాబట్టి బాలయ్య ఆ షో చేస్తున్నాడు తప్ప వేరేవాళ్లు అడిగితే చేస్తాడా..? చేయడు…! అల్లు అరవింద్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే మెగా క్యాంపు, మెగా క్యాంపు అంటే పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అంటే యాంటీ వైసీపీ, అంటే చంద్రబాబు క్యాంపు, చంద్రబాబు అంటే బాలయ్య… సో, బాలయ్య కాబట్టి పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ షోకు వస్తాడు… వేరేవాళ్లయితే రాడు… సో, ఇలా ప్రతి దానికీ లెక్కలుంటాయి… సో, సుమ కాబట్టి, చిరంజీవి కాబట్టి, బాలయ్య కాబట్టి, పవన్ కాబట్టి, అల్లు అరవింద్ కాబట్టి, శ్యాంప్రసాదరెడ్డి కాబట్టి… ఇలాంటి అనేకానేక కాబట్టుల నడుమ… అసలు ‘కాబట్టి’ ఏమిటంటే… ఎవరి లెక్కలు వాళ్లకు ఉంటాయి కాబట్టి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions