CIA అనే అమెరికన్ గూఢచార సంస్థ ప్రపంచంలోకెల్లా నొటోరియస్ అంటారు కానీ… అబ్బే, నిజానికి దానికి అంత సీన్ లేదు… ఇజ్రాయిలీ మొసాద్ దానికి తాత… ఎహె, మన భారతీయ గూఢచార సంస్థ ‘రా’ వాటికన్నా ఇంటలిజెంట్… ఎందుకంటే..? మనవాళ్లకు బోలెడన్ని హత్యాపథకాల్ని… అదీ చేతికి తడి అంటకుండా ప్రత్యర్థులను కసుక్కుమనిపించే బోలెడు ప్లాన్లను చెప్పడానికి టీవీ సీరియళ్లున్నయ్… మన దేశీయ టెర్రరిస్టులకు, మర్డరర్లకు కూడా, డాన్లకు కూడా ఇంటలిజెన్స్ సోర్స్ మన సీరియళ్లే… ఎవరి ఎలా లేపేయాలో ఈమధ్య ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు కూడా… జస్ట్, నాలుగైదు సీరియళ్లు వరుసగా చూడటం, తమకు అనువైన ఏ బాంబు పథకమో, గుడిలో గంట పథకమో సెలెక్ట్ చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేసేయడం… ఈజీ పని… మన టీవీ సీరియళ్ల రైటర్ల క్రిమినల్ మైండ్లను మనం పట్టించుకోవడం లేదు గానీ… ఆపేసిన టీవీ అవార్డులను వెంటనే పునరుద్దరించేసి ప్రతి టీవీ సీరియల్ రైటర్‌కూ నందులో, సింహాలో, ఏనుగులో, ఎలుగుబంట్లో బహూకరించాల్సిందే…
నిజానికి ఆ సీఐఏ వాడు ఫిడెల్ క్యాస్ట్రోను చంపడానికి 638 మార్గాల్లో ప్రయత్నించి ఫెయిలయ్యారని పుస్తకాల్లో చదువుకున్నాం కదా… ప్చ్, ఈ టీవీ సీరియల్ రైటర్లు అప్పట్లోనే ఉండి ఉంటే… జస్ట్, సీఐఏ ఏజెంట్లు ఏదో రెండుమూడు సీరియళ్లు చూసి, క్యాస్ట్రోను ఈజీగా ఖతం చేసేవాళ్లు… చాన్స్ కోల్పోయారు… ఇప్పటికైనా దిగజారిపోతున్న తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి సీఐఏ టీవీ సీరియళ్ల దర్శకులను, రచయితలను ఔట్ సోర్సింగ్ ద్వారా వాడుకున్నా పర్లేదు…….. హహహ, ఏమిటీ వెక్కిరింపు అంటారా..? ఓ పదినిమిషాలు జీవాడి కల్యాణవైభోగం సీరియల్ చూడబడితిని… జీవాడి టాప్ టెన్ కార్యక్రమాల్లో ఇది కూడా ఉన్నందున, ఇదియునూ… టాప్ ప్లేసులో ఉన్న త్రినయనినీ కాసేపు చూసినంతనే కనువిప్పు కలిగినది… ప్రతి సీరియల్లోనూ బోలెడన్ని హత్యాపథకాలు… ఏక్‌సేఏక్… ఉదాహరణకు… మొదట ఈ కల్యాణ పైత్యం గురించి…
Ads
ఈ దర్శకుడికి ప్రపంచంలోని యావత్ క్రియేటివ్ సర్కిళ్లు దండం పెట్టుకోవాలి… ఇంట్లో ఉన్న బాంబును కనిపెట్టాలంటే ఎంత ఈజీ అంటే… అది బాంబ్ స్క్వాడ్‌కు, పోలీసులకు, ఆ వృత్తిలో నిపుణులకు కూడా అర్థం గాక జుత్తు పీక్కుంటూ ఉంటారు… మొహంలో చిత్రవిచిత్ర ఫీలింగ్స్, అదోమాదిరి డైలాగ్ డెలివరీతో హాశ్చర్యపరిచే హీరోయిన్ ఇట్టే బాంబును కనిపెట్టేస్తుంది… జస్ట్, లైట్లు బంద్ చేయండి అంటుంది… ఆ చీకట్లో అటూఇటూ పరికించి చూస్తుంది… పూజగదిలో ఫోటోల వెనుక బాంబు వెలిగిపోతూ కనిపిస్తుంది… ఎంత సింపుల్..? టైం బాంబు కదా, ఆమె కావల్సినంత టైం తీసుకుని, హాలులోకి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి, పోలీసులకు సైగ చేస్తుంది… వాళ్లు ఢామ్మని మూర్చపడబోయి, తేరుకుని, నువ్వెంత ఇంటలిజెంట్ మేడం అంటూ కంగ్రాట్స్ చెప్పి, తలలు దించుకుని, సిగ్గుతో వెళ్లిపోతారు… అసలు ప్రతి బాంబుకూ డయోడ్లు ఉంటాయా..? అవి లైట్ హౌజుల్లాగా బయటికే వెలుగుతూ ఉంటాయా..? వంటి పిచ్చి ప్రశ్నలు మనం వేయకూడదు… అసలు బాంబు స్క్వాడ్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియని దర్శకుడికి మొక్కి, ‘నువ్వు గొప్పోడివి బాసూ’ అని అభినందించడమే… చెప్పనేలేదు కదూ… బాంబు దొరకగానే చేత్తో పట్టుకుని, జేబు నుంచి కటింగ్ ప్లేయర్ తీసి, ఓ వైర్ చక్మని కత్తిరించేస్తాడు అక్కడే బాంబు నిపుణుడు… హహహహ…
త్రినయని విషయానికి వద్దాం… ప్రతి నెలా బోలెడన్ని హత్యాపథకాలను రచిస్తూ ఉంటాడు ఈ సీరియల్ రైటర్ ఎవరో గానీ… అఫ్ కోర్స్, ప్రేమ ఎంత మధురం సీరియల్ అయితే అచ్చంగా హత్యాపథకాల స్పెషల్… అది టాప్ రేంజ్… ఆ దర్శకుడిని జాతీయ అవార్డు ఇవ్వాలి… రాష్ట్ర స్థాయి అవార్డు ఇస్తే తనను అవమానించినట్టే… త్రినయనిని చంపేయడానికి ఓ విలన్ కమ్ సెకండ్ హీరోయిన్ ఒకావిడ ఉంటుంది… మర్డర్ల ప్లానింగే ఆమె పని… మొన్నామధ్య హఠాత్తుగా బాణాలు తీసుకుని, అడవిలోకి వెళ్లి, హీరోయిన్ ఫసాక్ చేద్దామని అనుకుంటుంది… వర్కవుట్ కాదు, ఈసారి ఓ గుళ్లో గంటకు కరెంటు కనెక్షన్ ఇచ్చేసి, గంట కొట్టగానే చచ్చిపోయేలా ప్లాన్ చేస్తుంది… పట్టపగలు గుడిలో అంత పెద్ద గంటకు నిచ్చెన వేసుకుని మరీ ఓ అందగత్తె కరెంటు కనెక్షన్ ఇస్తుంటే ఒక్కడంటే ఒక్కడూ కనిపెట్టడు తెలుసా..? అంత సూపర్ అన్నమాట… అన్ని సీరియళ్లలో ఉన్నట్టే ఇందులోనూ ఎదవాయిత్వం నిండుగా ఉన్న ఓ హీరో ఉంటాడు… థూ, ఏం సీరియళ్లు తీస్తున్నారుర భయ్… ఒక్క మాటీవీ వాడి కార్తీకదీపమే చెత్తా అనుకుంటే, దానికి తాతలు, బామ్మలు, మామ్మల్లాంటి సీరియళ్లను జీవాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు…!!
Share this Article