Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాముళ్ల వరుస సినిమాల్లో ఇదొకటి… ఈసారి తన పేరు సర్కస్ రాముడు…

December 22, 2024 by M S R

.

.       (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..    .. సర్కస్ రాముడా సక్సెస్ రాముడా ! అంతమంది నిర్మాతలు , కధకులు , దర్శకులు యన్టీఆర్ మీద ఎన్నో రాముళ్ళని తీసారు . ఎందుకనో ఎవరూ సక్సెస్ రాముడు అని తీయలేదు . అయిననూ ఆయన సక్సెస్ రాముడే . ఆ సక్సెసుల్లో ఒక సక్సెస్ దాసరి , యన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సర్కస్ రాముడు .

1980 మార్చిలో వచ్చిన ఈ సినిమా రివెంజ్ కధే అయినా అన్ని రివెంజ్ సినిమాల్లో లాగా విలన్ మామని చంపటమో , జైలుకు పంపటమో ఉండదు . క్షమించి విలన్ మామ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు . సినిమా ఢాంఢాంలని ఉండకుండా సరదాగా , వినోదభరితంగా నడుస్తుంది .

Ads

యన్టీఆర్ ద్విపాత్రాభినయం . ఒక యన్టీఆర్ జమీందారు కొడుకుగా పెరిగితే మరొక యన్టీఆర్ సర్కస్ వాళ్ళ చేతిలో సర్కస్ రాముడుగా పెరుగుతాడు . మన తెలుగు సినిమాలలో సర్కస్ నేపధ్యంలో సినిమాలు తక్కువే . యన్టీఆర్ కెరీర్లో అదీ సఫలమయింది ఈ సినిమాతో .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హుషారుగానే ఉంటాయి . యన్టీఆర్ జయప్రదల మీద ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీ చవితెప్పుడో చెప్పవయ్యా పాటలో అడవిరాముడులోలాగా ఏనుగులు కూడా డాన్స్ చేస్తాయి . సూరీడు చుక్కెట్టుకుంది పాట యన్టీఆర్ , సుజాతల మీద అందంగా , ప్రశాంతంగా ఉంటుంది . బాగుంటుంది .

రాముడంటే రాముడు సర్కస్ రాముడు అంటూ యన్టీఆర్ సర్కసులో పాడే పాటలో కాసిన్ని ఫీట్లు కూడా చేస్తాడు . జయమాలినితో ఆకలి మీద ఆడపులి దీన్ని ఆపలేను భజరంగ భళీ పాట బాగుంటుంది . మిగిలిన పాటలు అక్కాచెల్లెలు పక్కన చేరి బాబయ్యా , అమావాస్యకు పున్నమికి రేగిందంటే మామో పంపరేగుతుంది , ఘల్ ఘల్ ఘల్ ఘల్లుమంది గజ్జెల గుర్రం కూడా హుషారుగా ఉంటాయి .

వేటూరిలో రెండు పార్శ్వాలు ఉన్నాయి . ఒక పార్శ్వంలో శంకరాభరణంలోని పాటల వంటివి ఉంటే , మరో పార్శ్వంలో గోలగోల పాటలు ఉంటాయి . ఈ సినిమాలోనివన్నీ గోలగోల పాటలే ఒక్క సూరీడు చుక్కెట్టుకుంది పాట తప్పితే .

బహుశా యన్టీఆర్ , సుజాత జోడీగా మొదటి సినిమా అనుకుంటాను . జయప్రద , రావు గోపాలరావు , ఝాన్సీ , అల్లు రామలింగయ్య , కె వి చలం , ప్రభాకరరెడ్డి , మహానటి సావిత్రి ప్రభృతులు నటించారు . అయిదు సెంటర్లలో వంద రోజులు ఆడింది . వాటిల్లో ఒకటి మా గుంటూరు కృష్ణా పిక్చర్ పేలస్ . ఇప్పుడు ఆ జంట సినిమా హాళ్ళు లేవు .

సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . యన్టీఆర్ అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడవచ్చు . A full entertaining movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
  • … బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…
  • ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!
  • ఆ దరిద్రుడి పాత్రలో మోహన్‌లాల్… ఆ డార్క్ షేడ్స్ కథ తెలుసా మీకు..?!
  • ’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’
  • అసలు కన్సల్టెన్సీ అనగానేమి..? నిజానికి అవి ఏమి చేయును..?
  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions