.
( పొట్లూరి పార్థసారథి ) …. భారత్ లో చేస్తున్న ఆందోళనకి నేను నాయకుడిని కాదు.. అభిజిత్ చిప్కే!
‘‘సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఎలా చెప్తే ఆలా చేస్తున్నాను. వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నాను. నిజానికి బొద్దింకల ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తున్నాను అని అందరూ అనుకుంటున్నారు కానీ దీనిలో నా పాత్ర ఏమిటంటే సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా చెప్పినట్లు చేయడమే!’’
Ads
మొదటి వికెట్ పడినట్టేనా? కోర్టులో అఫిడవిట్ ఇచ్చే సమయంలో సౌరవ్ దాస్ తన తండ్రి పేరు వ్రాయడం లేదు కాగా అశుతోష్ రాంకా తన తల్లి పేరు వ్రాయడం లేదు!
వీళ్ళకి డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేయిస్తున్నది ఎవరో వీళ్ళే బయటపెట్టాలి! త్వరలోనే వీళ్ళు బయటపెడతారు!
రాజకీయ నాయకులతో అంటకాగితే వచ్చేది ఏమీ ఉండదు. సదరు నేతలకి తమతో ఎక్కువమంది అనుచరులు ఉన్నారని ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుంది తప్పితే వెంట తిరిగినవారికి పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం అనేది అడగకుండా వచ్చేస్తుంది.
భయం!
సౌరవ్ దాస్ తండ్రి పేరు చెప్పడు కానీ, అతను ఎవరో ఇంటెలిజెన్స్ అధికారులకి తెలుసు, కానీ ఇంతవరకూ బయటకి చెప్పలేదు…. సౌరవ్ కి భయం గొలిపే విషయం ఇదే! సౌరవ్ దాస్ మాటలు కొండలు దాటుతాయి కానీ లోలోపల భయం!
అశుతోష్ రాంకా తల్లి పేరు చెప్పలేడు, కానీ ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళు బయటపెట్టడంలేదు. ఇదంతా సైకలాజికల్ వార్ ఫేర్!
ఎలా చెపితే, ఏం చెపితే దారిలోకి వస్తాడో అదే చెప్పారు ధృవ్ రాఠీకి ఢిల్లీ పోలీసులు… లండన్ వెళ్ళిపోయాడు. ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా ( OCI ) కార్డు రద్దు చేస్తే ఇండియాకి విదేశీయులు వచ్చినట్లుగా రావాల్సి ఉంటుంది కాబట్టి లండన్ వెళ్ళిపోయాడు!
మీకెందుకు మేం చెప్పినట్లు చెయ్యండి, మిగతాది మేము చూసుకుంటాము అని హామీ ఇచ్చినవారు ఇప్పుడు సైలెంట్ అయిపోయేసరికి అభిజిత్ కి జ్ఞానోదయం అయింది!
జ్ఞానేష్ కుమార్ ని CEC గా తొలగించమని కోరుతూ సుప్రీం కోర్టుకి ఊరేగింపుగా వెళ్లిన రాహుల్ తీరా పిటిషన్ వేయడానికి కోర్టు ఫీజు కట్టాల్సిఉండగా 220/- రూపాయలు తక్కువగా కట్టారు! పిటిషన్ తో అఫిడవిట్ ని సమర్పించాల్సి ఉండగా అఫిడవిట్ అయితే జత చేశారు కానీ దాని మీద రాహుల్ సంతకం లేదు.
అఫిడవిట్ మీద సంతకం పెట్టి కోర్టు ఫీజు పూర్తిగా చెల్లించమని రిజిస్ట్రార్ అడిగితే నేను లోకసభలో ప్రతిపక్ష నాయకుడిని, సంతకం పార్లమెంట్ లో పెట్టేసాను కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదని రాహుల్ జవాబు ఇచ్చాడు.
మీకెందుకు మీరు చేయాల్సింది చేయండి, మిగతాది మేము చూసుకుంటాము అని అంటే దానర్ధం ఏమిటి అంటే కోర్టు ఫీజు పూర్తిగా చెల్లించకపోవడం, అఫిడవిట్ మీద సంతకం పెట్టకుండా ఉండడం అని! అఫిడవిట్ మీద సంతకం పెట్టి, కోర్టు ఫీజు కడితే రిజిస్ట్రార్ కేసు నంబర్ ఇస్తాడు. రేపొద్దున కేసు హియరింగ్ కి వచ్చి ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఆరోపణలకి ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
కానీ సుప్రీంకోర్టు కేసు విచారణకి తీసుకొని CEC కి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు అసలు సంగతి బయటపడుతుంది కానీ అప్పటికే S I R విషయం మరుగున పడిపోతుంది.
రాహుల్ సుప్రీం కోర్టుకి ర్యాలీగా వెళ్ళినప్పుడు ఓ యాభై మంది అడ్వకేట్లు గుంపులో కనపడ్డారు కెమెరా కళ్ళకి. కానీ ఒక్కొక్కరికి 6 వేలు ఇచ్చి అద్దెకు తీసుకొచ్చారు.
నల్ల కోటు మీరే తెచ్చుకొని రాహుల్ వెంట కోర్టు వరకూ నడిస్తే చాలు 6 వేలు ఇస్తామని సమాన్యులని మభ్యపెట్టి తెచ్చారు. ఫోటోలకి, వీడియోలకి నిండుగా కనపడ్డారు, విదేశాలలో ఉంటూ భారత్ లో ఈ కధ నడిపిస్తున్న వారికి OK మనోడు బాగానే రక్తి కట్టిస్తున్నాడు అని అనిపించేలా! న్యూయర్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, THE HINDU, ఆల్ జజీరాలలో కధనాలు వండబడ్డాయి.

రాహుల్ వెంట నల్లకోట్లు వేసుకొని వచ్చిన వాళ్ళు అసలు న్యాయవాదులు కానే కారని సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదుల దగ్గర పనిచేసే జూనియర్ న్యాయవాదులు కెమెరా సాక్షిగా అసలు విషయం బయటపెట్టారు!
CEC, S I R లు అనేవి పాత పడిపోయాయి! ఇక ఈ చిల్లర బొద్దింకలని ఎవరు పట్టించుకుంటారు?
చాలా ప్లాన్డ్ గా ముందుగానే ఓ కోటి రూపాయలు చెక్ ద్వారా బొద్దింకలకి విరాళం ఇచ్చి కపిల్ సిబల్ తెలివిగా తప్పుకున్నాడు!
ఢిల్లీ కాంటోన్మెంట్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో సొరవ్ దాస్, అశుతోష్ రాంకాలకి బెయిల్ ఇప్పించలేకపోయారు అంటే అసలు సీన్ అభిజిత్ కి అర్ధమైపోయింది మేము ఇరుక్కుపోయాము అని.
అఫ్కోర్స్! జూడిషియల్ రిమాండ్ లో ఉన్న సౌరవ్, అశుతోష్ లకి కూడా అర్ధమయే ఉంటుంది!
ఇక వీళ్ళ కేసుని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కి అప్పచెప్పారు అంటే విషయం లోతుగా దర్యాప్తు చేయడానికే!
ప్రశాంత్ భూషణ్ ఇష్యూ!
ప్రశాంత్ భూషణ్ ది అని చెప్పబడుతున్న వాయిస్ ( ఇది ధ్రువీకరించనిది ) లీక్ లో బీజేపీ పారా మిలిటరీ లేదా సైన్యాన్ని రంగంలోకి దించుతుంది కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చింది అని అన్నట్లుగా ఉంది. అయితే ఆ గొంతు ప్రశాంత్ భూషణ్ దా కదా అన్నది కంఫర్మ్ అవలేదు, కానీ అది నిజమే అయితే ప్రశాంత్ భూషణ్ పొరపాటు పడ్డాడు!
ఇంతోసి కల్పిత ఉద్యమానికి సైన్యం అవసరం ఏర్పడదు!
ప్రతీ ఒక్క బొద్దింకకి బదులుగా RSS, VHP, భజరంగ్ దళ్ లతో పాటు బీజేపీ అభిమానులు రోడ్ల మీదకి వస్తారు. 1:20 రేషియోలో ఉంటారు రోడ్ల మీద!
మూడు గంటలకి మూడు వేలు ఇచ్చి అద్దెకు తెస్తున్నారు బొద్దింకలు మనుషులని, కానీ బీజేపీకి ఆ అవసరం ఉండదు, స్వచ్చందంగా వచ్చేస్తారు!
భారత్ Gen Z లు ఎవరూ కూడా ఆందోళనలో పాల్గొనరు ముందు ముందు.
ఇండియన్ Gen Z లు ఆల్కహాల్ కి దూరంగా ఉంటున్నారు! ఇది ప్లస్ పాయింట్!
రాహుల్ థాయిలాండ్ వెళ్ళిపోయాడు! నేహా బోరా ఇక కనపడదు. ఇక ఏక్ దిన్ కా సుల్తాన్ లలాగా మిగిలిపోయారు ప్రకాష్ రాజ్, md జుబేర్, ధృవ్ రాఠీలు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటంటే బొద్దింకల తరుపున వాదిస్తున్న cjp లీగల్ సెల్ అడ్వకేట్ రత్న సింగ్ కి కోర్టులో పిటిషన్ వేయడం కూడా రాదు, ఖర్మ! బెయిల్ వచ్చే కేసులో రాంగ్ పిటిషన్ వేయడం వలన అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లకి మరో మూడు రోజుల రిమాండ్ పొడిగించింది కాంటోన్మెంట్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్ట్!
కనీసం మేజిస్ట్రేట్ కోర్టులో బెయిలబుల్ కేసులో పిటిషన్ ఎలా వేయాలో కపిల్ సిబల్ ఎందుకు చెప్పలేదు రత్న సింగ్ కి?
ఒరేయ్ పిచ్చోళ్లారా, మీరు మొదలుపెట్టారు, మేము హైజాక్ చేసాము అని చెప్పకనే చెప్పినట్లయింది.
తీహార్ జైలు నుండి బయటికి వచ్చిన తరువాత సౌరవ్, అశుతోష్ ఏం మాట్లాడుతారో చూడాలి!
Share this Article