Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

60 వేల కొలువు – కొడుకును అమెరికాలో చదివించడం ఏమంత కష్టం?

August 3, 2026 by M S R

.

Murali Buddha …. జెన్ జీ ఉద్యమం కొందరి అహంకారంపై తీవ్రంగా దెబ్బ కొట్టింది . 60- 65 వేల జీతం వచ్చే ఇంజనీర్ తమ కుమారుడిని అమెరికాలో ఎలా చదివించాడో విచారణ జరిపాలట …

…
బైక్ మీద ఇద్దరు వ్యక్తులు… ఒకరిది 60 ఇంకొకరిది 25 వయస్సు … కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు . 60 ఏళ్లతను భవన నిర్మాణానికి ఇసుక వంటివి సప్లై చేస్తాడు . కుర్రాడితో కబుర్లు చెబుతూ ఒక కూతురు ఆస్ట్రేలియాలో చదువుతుంది, ఇంకో కూతురు కెనడా అని చెబుతుంటే కుర్రాడికి చిరాకేసింది .

Ads

పేరుకు సప్లయర్ అయినా దినసరి కూలీకన్నా కొద్దిగా బెటర్, పెద్దగా సంపాదించింది ఏమీ లేదు … అలాంటి వ్యక్తి ముగ్గురు కూతుళ్లు, ఒక కూతురు ఆస్ట్రేలియా , ఇంకో కూతురు కెనడాలో చదువుతుంది అని చెబితే కుర్రాడికి చిరాకేసి ‘‘అన్నా వినే వాడుంటే మూడవ కూతురు అమెరికాలో చదువుతుంది అని చెబుతావు’’ అని చిరాగ్గా పలికాడు . ఆ 60 ఏళ్లతను నిజమే, మా మూడవ అమ్మాయి అమెరికాలోనే చదువుతుంది అని చెబితే, కుర్రాడు అతన్ని దించేసి వెళ్లి పోయాడు .

అతని ముగ్గురు కుమార్తెలు మూడు దేశాల్లో చదువుతున్నది నిజమే , అతను బైక్ పై వెళుతున్న ఈ సంభాషణ, సంఘటన నిజమే …నాకెలా తెలుసు అంటే… 60 అతను ఒకటో తరగతి ఫ్రెండ్ . ఏడవ తరగతిలో తండ్రి చనిపోవడంతో తంటాలు పడి జీవితం సాగించినా పిల్లలను చదివించాడు .

తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 20 లక్షలు ఇతర ఖర్చులు ఇచ్చింది . దరఖాస్తు చేయి, బీసీ కాబట్టి వస్తుంది అంటే మొదట నమ్మలేదు అంత డబ్బు ఎందుకు ఇస్తారని , తిట్టి దరఖాస్తు చేయి, నీకు పైసా ఖర్చు లేదు అంటే చేశాడు . వచ్చింది . ఒక్క కూతురు విదేశీ చదువు, ఆమె సహాయంతో రెండవ కూతురు , ఆ ఇద్దరి సహాయంతో మూడవ అమ్మాయి ఇప్పుడు ముగ్గురూ విదేశాల్లోనే …

సీజేపీ అభిజిత్

….
Hsbc బ్యాంకులో నాకు హోమ్ లోన్… ఏటా ఐదు లక్షల ఆదాయం ఉంటే విదేశీ విద్యకు లోన్ ఇస్తారు… అంటే ఎప్పుడూ ఆదాయం ఏటా ఐదు లక్షలు అవుతుందా అని ఎదురు చూపులు. తీరా ఆ సమయానికి బ్యాంకు ఏదో కుంభకోణంలో ఇరికితే, నానా తంటాలు పడి idbi నుంచి ఋణం .

ఆ టైంలో దాదాపు 40 – 45 వేల జీతం . ఇక్కడ 20 వేల జీతంకన్నా ఎలాగోలా ఇబ్బంది పడి విదేశాలకు పంపండి… బ్యాంకు లోన్ , అక్కడికి వెళ్ళాక స్కాలర్ షిప్, ఎలాగోలా ఐదూ పదేళ్లు కష్టపడితే ఒక తరం కష్టాలకు దూరం అవుతుంది అని ప్రోత్సహించి, కనీసం అలా ఓ పది మంది విదేశాలకు వెళ్ళడానికి నేను కారణం .

ఐతే కాక్రోచ్ ఉద్యమకారుడి తండ్రి ప్రభుత్వ ఇంజనీర్ 60- 65 వేల జీతం, ఐనా అమెరికా చదువుకు నిధులు ఎక్కడివి … అమెరికా కుట్ర విచారణ జరపాలి అని ఫిర్యాదు అట… ఆ వార్త చూసి ఇదంతా గుర్తుకు వచ్చింది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
  • Viral Mansi Sherni – ‘మోనాలిసాతో పోల్చితే మర్యాద దక్కదు సుమా’
  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!
  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…
  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !
  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions