.
మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నదే… కాంగ్రెస్ హరాకిరీ బ్యాచ్ గురించి… అనవసరంగా కేసీయార్, కేటీయార్, హరీష్ గొంతులు చించుకుంటున్నారు, ఏవేవో ప్రయాసలు పడుతున్నారు గానీ… కాంగ్రెస్ మంత్రులు, నేతలున్నారు కదా… కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టించడానికి..!!
ఒకటి కాకపోతే మరొకటి… కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ఓ రాహుల్ గాంధీయే కదా… కేసీయార్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మాత్రమే జనం మనల్ని ఎంచుకున్నారు, వోట్లేశారు, మన నిర్వాకాలతో మళ్లీ కేసీయారే బెటర్ అనే పరిస్థితిని తీసుకురావద్దు అనే సోయి చాలామంది నాయకుల్లో లోపించింది…
Ads
రేవంత్ రెడ్డి ఏదో కిందా మీదా పడుతూ… ప్రభుత్వం, పార్టీ అనే కోణంలో ఏవేవో తిప్పలు పడుతుంటే…. వాటికి గండికొడుతూ వోల్‌మొత్తంగా కాంగ్రెస్‌ను నష్టపరిచే నాయకులు బోలెడు మంది… లేకపోతే ఈ పొంగులేటి వర్సెస్ కొండా వివాదం ఏమిటి మరి..?
మేడారంలో కొన్ని అభివృద్ధి పనులు… 70 కోట్లు పనులు కావచ్చు… ఆ జిల్లాలో ఇద్దరు మంత్రులు … ఒకరు కొండా సురేఖ (అవును, నాగార్జున మీద, సమంత మీద అత్యంత మెచ్యూర్డ్ వ్యాఖ్యలతో అద్భుతమైన ఇమేజ్ సంపాదించుకున్న మహిళా మంత్రి ఫాఫం)… మరొకరు ఆ మేడారం జాతరకు నిజంగా ప్రభుత్వ ప్రాతినిధ్యం వహించాల్సిన సిసలైన మంత్రి సీతక్క…
దురదృష్టం కొద్దీ ఆ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి శ్రీమాన్ పొంగులేటి అనబడే కంట్రాక్టర్… ఆఫ్టరాల్ 70 కోట్ల పనులే కదా… అసలే కొండా మురళి కదా… ఆల్రెడీ భద్రకాళి టెంపుల్ ధర్మకర్తల నియామకం విషయంలో కొండా మురళి అలియాస్ సురేఖ వివాదం నడుస్తోంది కదా… మరి తను మేడారం పనుల్లో ఎందుకు వేళ్లు కాళ్లు పెట్టినట్టు..?
పైగా తన కంపెనీయే చేస్తుందట ఆ పనులు… అంటే ఎవ్వడికీ రూపాయి కమీషన్ ఇచ్చే పని లేెకుండా… ఓ ఇన్‌చార్జి మంత్రిగా తనే చక్రాలు గిరగిరా తిప్పి… రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పిని క్రియేట్ చేసేలా… దేవాదాయ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ పనులు చేపట్టడం..!
ప్రస్తుత రాజకీయాలు అంటే, చారిటీ కాదు కదా… పైగా కొండా మురళి… తుపాకీ ఎదుటపెట్టి యవ్వారాలు చక్కబెట్టుకునే బ్యాచ్… దీంతో ఆ చిల్లర పనుల పనులపై ఇగోస్ మంట అంటుకున్నాయి… వచ్చేదెంత అని కాదు… అహాలు…
నిజమే కదా… పొంగులేటికి మరీ ఈ పనులు అవసరమా..? తను దేవాదాయ శాఖ పనుల్లో… అంటే కొండా సురేఖ పరిధిలోకి ఎందుకు వెళ్లాలి..? అసలు ఈ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు అనే దిక్కుమాలిన సిస్టం ఎందుకు..? అందుకే సమ్మక్క నిజ ఆదివాసీ భక్తురాలిగా సీతక్కకు మండుతోంది… మరోవైపు సంబంధిత మంత్రిగా కొండా సురేఖకూ మండుతోంది…
ఈ మొత్తం వ్యవహారంలో తప్పు పొంగులేటి వైపే కనిపిస్తోంది… అందుకే అనేది… మీనాక్షి నటరాజన్‌లు, ఇతరత్రా నాయకులు కాదు… గతంలో వైఎస్‌కు ఇచ్చినంత స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి కూడా ఇస్తేనే… మంచో చెడో ఒకరికే పగ్గాలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ…
హైకమాండ్ అర్థం చేసుకోకపోతే… అది కాంగ్రెస్ పార్టీ ఖర్మ… అంతే…!! ఐనా, ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉన్నారు కదా… నేరుగా సురేఖ హైకమాండ్ దాకా వెళ్లడం ఏమిటి ..!! ఆల్రెడీ నాగార్జున- సమంత ఇష్యూలో పిచ్చి కూతలతో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పరువు తీసింది… అన్నట్టు... రేవంత్ రెడ్డికి ఓ సూచన... పొంగులేటి పక్కా జగన్ మనిషి...
Share this Article