వీర్యదానం ఈరోజుల్లో చాలా కామన్… పైగా చాలామంది వాళ్ల వాస్తవ వివరాలు ఇవ్వరు… ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు… ఒకవేళ నిజమైన వివరాలే సదరు వీర్యదాత ఇచ్చినా అవి బయటపెట్టకూడదు… ఇలా చాలా లెక్కలుంటయ్… అలాంటిది ఎప్పుడో ఓసారి వీర్యదానం చేస్తే, దాంతో సరోగసీ ద్వారా ఓ బిడ్డ పుడితే… ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొచ్చి, పెళ్లి వేళ, ఇదుగో నీ బిడ్డ అని చేతిలో పెడితే..? బేసిక్ స్టోరీ పాయింట్ బాగుంది కదా…
ఎస్… ఓ భిన్నమైన స్టోరీ లైన్…. ఈ చెత్తహీరోల డిష్యూం డిష్యూం యాక్షన్ సీన్లు, బొమ్మ తుపాకుల గర్జనలు, బిల్డప్పులు… (గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ బైక్ మీద నుంచి మిసైల్ ప్రయోగిస్తాడు…) ప్రేక్షకుల్ని ఎడ్డి ఎదవల్ని చేసే మూసీ మురికి వాసనలకు భిన్నంగా… ఓ ప్లజెంట్ స్టోరీ లైన్… డిఫరెంట్ లైన్… దాని ఆధారంగా కామెడీ, ఫన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ సీన్లు రాసుకోవడం, అల్లుకోవడం… బాగుంది… అయితే…
బెల్లంకొండ గణేష్ అంటే మస్తు బ్యాక్ గ్రౌండ్… నేపథ్యం ఉంది కదాని డిష్యూం డిష్యూంలు, ఐటమ్ సాంగులతో ప్రేక్షకుల్ని చావదొబ్బి, మాస్ హీరో అనుకోవాలని కోరుకోలేదు… ప్రస్తుతం ఆ సీన్ లేదు కూడా… ఈ పిచ్చి గెంతులు, ఎడ్డి ఫైట్లను ఎవడూ దేకడం లేదు… కాకపోతే సరదాగా, సున్నితంగా, ఓ డిఫరెంట్ కంటెంటును ఎలా డీల్ చేశారనేదే ముఖ్యం… ఈ స్వాతిముత్యం సినిమా అదే…
Ads
నిజానికి బెల్లంకొండకు అనుభవం లేదు… ఎంత సీరియస్ ఎఫర్ట్ పెట్టినా సరే, ఆ కొత్తదనపు తడబాటు గట్రా కనిపిస్తూనే ఉంటయ్… సో, వర్ష బొల్లమ్మ పూర్తిగా సినిమాను మోసే బాధ్యతను తనపై వేసుకుంది… సమర్థంగా నెరవేర్చింది… ఆమె కనబడినంత సేపూ ప్లజెంటుగా ఉంటుంది… పైగా బెల్లంకొండ కొడుకు కదా… తనను కష్టపెట్టే సీన్లను ఏమీ క్రియేట్ చేయలేదు దర్శకుడు…
మిగతా చాలామంది నటులు ఉన్నారు… ఎవరికి తగిన పాత్రలు వాళ్లకు… నిజానికి ఇలాంటి సినిమాలకు కలిసి రావల్సింది మ్యూజిక్… అందులో సినిమా ఫ్లాప్… ఒక్కటంటే ఒక్క మంచి ట్యూన్ లేదు, గుర్తుండదు… కంటెంట్ మాట దేవుడెరుగు… కాకపోతే పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే..? సినిమా లెంత్ తక్కువగా ఉండటం కూడా రిలీఫ్… మరి ఈమాత్రం దానికి థియేటర్ దాకా ఎందుకు వెళ్లడం, ఓటీటీలో రాదా..? టీవీలో రాదా అంటారా..? ఏమంటాం… మీరు తెలివైనవాళ్లు అని అభినందిస్తాం…
Share this Article