Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

CM Ramesh … అద్భుత వశీకరణ శక్తిమంతుడు… జై పాతాళ భైరవీ…

June 15, 2026 by M S R

.

నాకెప్పటి నుంచో పే-ద్ద డౌటనుమానం… ఈ సీఎం రమేష్ అనబడు పక్కా వ్యాపారవేత్తను బీజేపీ ఎందుకు ఎంటర్‌టెయిన్ చేసింది అని..! ఏమో, బ్యాంకు రుణాలో, పన్ను ఎగవేతలో, ఇంకేమైనా ఆర్థిక యవ్వారాలో ఉండటం వల్ల, పవిత్ర తీర్థం తీసుకుని నిష్కళంకుడు అయిపోవాలని తను అనుకున్నాడా..? అలవాటైన రీతిలో తను అడగ్గానే బీజేపీ వోకే అనేసిందా అని..!

తను రెగ్యులర్ పొలిటిషియన్ కాదు… బహుశా తనకు అంత టైమ్ కూడా ఉండదు… బిజీ వ్యాపారి… మరి బీజేపీకి తనతో ఏం ఉపయోగం అనే అనుమానసందేహం కూడా కలిగిన మాట వాస్తవం… కానీ తను పార్టీకి ఉపయోగపడుతూనే ఉన్నాడుట… కాకపోతే తెర వెనుక పార్టీ పని… పరులకు ఎరుక లేని పని… బీజేపీలోకి ఎవరినైనా లాగేయాలని షా అనుకుంటే చాలు, సీఎం రమేష్ ప్రత్యక్షమవుతాడట…

Ads

20 ప్లస్ టీఎంసీ ఎంపీలను మమతకు వ్యతిరేకంగా మార్చి, అదేదో త్రిపుర అనామక NCPI పార్టీలో విలీనం చేయించడంలో సీఎం రమేష్ బాగా వర్క్ చేశాడట… వాళ్లను ఎన్‌డీయే మద్దతుదారులుగా మార్చాడట… ఎవరో అడిగితే… ఓసోస్, అదెంత పని… ఎవరినైనా అలా చూపించండి, రెండు గంటలు టైమివ్వండి, ఇలా బీజేపీలో చేరేలా ఒప్పిస్తాను అని అంత ధీమాగా చెబుతున్నాడు…

సీఎం రమేష్

గతంలో ఓ అస్సాం ఎంపీని ఇలాగే పట్టుకొచ్చాడట, అదేదో హైప్రొఫైల్ క్లబ్ ఎన్నికల్లో చక్రం తిప్పాడట… అందరూ ఏవేవో రాస్తున్నారు సరేగానీ… అతి పెద్ద క్వశ్చన్ ప్రశ్నేమిటంటే..? టీఎంసీ ఎంపీలు ఓ కలగూరగంప… వాళ్ల వృత్తులు వేరు, తత్వాలు వేరు, అవసరాలు వేరు, రాజకీయాల తీరు వేరు, అందులో చాలామంది ఫీల్డ్ పొలిటిషియన్స్ కారు, సీఎం రమేష్‌లాగే…

మరి వాళ్లందరినీ ఎలా ఒప్పించాడు, ఎలా డీల్ చేశాడు..? అందరితోనూ కామన్ స్నేహబంధం ఎలా ఏర్పడింది..? మా కొడుకు పెళ్లికి కూడా వచ్చారు అంటున్నాడు, ఏ ఎంపీనైనా చిటికెలో మార్చేస్తాన్ అంటున్నాడు… అంత వశీకరణ శక్తి ఎలా వచ్చింది..? పైగా డబ్బుల్లేవు, ప్రలోభాల్లేవు, నాతోడు, నన్ను నమ్మండి అని కూడా అంటున్నాడు అమాయకంగా…

సరే గానీ… ఇలా పనిచేసే నేతల్లో ఇంకా ఎవరెవరున్నారో… సర్లెండి, ఎవరుంటేనేం గానీ… వాళ్లకు, ప్రత్యేకించి సీఎం రమేష్‌కు రెండు తక్షణ ఛాలెంజులు… ఆ ఠాక్రే పార్టీ ఎంపీలను ఫస్ట్ పట్టుకురండి, మీకు ఆ పార్టీ శల్యుడు సంజయ్ రౌత్ సహకరిస్తాడు… నెక్స్ట్ డీఎంకే పార్టీ ఎంపీలను పట్టుకురండి… పర్లేదు, స్టాలిన్ మెత్తబడ్డాడు… దారికొస్తాడు… కమాన్, జాతికి ఇప్పుడు ఆ అవసరం ఉంది… రెయిజ్ టు అకేషన్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • CM Ramesh … అద్భుత వశీకరణ శక్తిమంతుడు… జై పాతాళ భైరవీ…
  • NCPI … త్రిపురలోని ఓ విఫల పార్టీ హఠాత్తుగా జాతీయ తెరపై… ‘షా’లిటిక్స్..!!
  • ఎవరి ఊహకూ అందలేదు ..! బెంగాల్ రాజకీయాల్లో ‘మోటా భాయ్’ మాస్టర్ స్ట్రోక్ ..!!
  • యుద్ధం ఒక డ్రామా… ఒక వ్యాపారం… అసలు చేదు నిజాలు ఇవీ…!
  • Peddi Anantha Sriram … రాతలే కాదు, కూతలూ అలాగే ఉన్నయ్…
  • ఏం చేయాలో ఎటూ తేల్చరు… ఏటా కోట్ల మెయింటెనెన్స్ ఖర్చు…
  • కుట్రతో సంబంధం లేకపోతే… కుట్రదారులను కలిసే పనేముంది..?!
  • ఒక విలనీ అత్త… ఒక హీరో అల్లుడు… ఓ మాస్ మసాలా పల్లీ బఠానీ…
  • తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ సీటు..? నో వే…!!
  • కాలా హిరణ్..! పాపం, సల్మాన్ వ్యక్తిత్వ హక్కులకు విఘాతం అట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions