.
రాజకీయ ప్రసంగాలు వేరు… ముఖ్యమంత్రి కూడా ఓ పార్టీ నాయకుడే కదా… ప్రతిపక్షాల విమర్శల్ని కౌంటర్ చేయాల్సిందే, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిందే… అది వేరు… ఆ సమావేశాలు వేరు…
కానీ కొన్ని వేదికల మీద చేయాల్సిన ప్రసంగాలు వేరు… వాటికి వేరే గ్రామర్ ఉండాలి… ప్రత్యేకించి క్రెడాయ్ ప్రాపర్టీ షోల వంటి పెట్టుబడుల వేదికలపై ఒక ముఖ్యమంత్రి ప్రసంగం అల్లాటప్పాగా ఉండకూడదు…
Ads
ఆహుతులు నిశ్శబ్దంగా, సావధానంగా వింటారు ప్రసంగాన్ని… వాళ్లకు రాజకీయాలు కావు కావల్సింది… ఒక ముఖ్యమంత్రి విజన్ ఏమిటో వివరంగా తెలియాలి… పెట్టుబడులకు రక్షణపై భరోసా కావాలి… ఫ్యూచర్ పెట్టుబడులు భద్రమే అనే నమ్మకం కలగాలి… ప్రభుత్వ ప్రోత్సాహం మీద విశ్వాసం పెరగాలి…
ప్రభుత్వం వెళ్తున్న దిశ వాళ్లకు ఉత్తేజాన్ని కలిగించాలి… అదే సమయంలో ప్రభుత్వ కార్యాచరణ, పాలసీలు స్టేట్ ఓవరాల్ డెవలప్‌మెంట్‌కు ఎలా ఉపయుక్తమో ముఖ్యమంత్రి తన ప్రసంగంలో చెప్పగలగాలి…
ఎస్, రేవంత్ రెడ్డి క్రెడాయ్ ప్రసంగం పరిణతితో ఉంది… అవసరమైన పాజిటివ్ దిశలోనే ఉంది… తన ఆలోచనల్ని, తన అడుగుల్ని పర్‌ఫెక్ట్‌గా ప్రొజెక్ట్ చేయగలిగాడు… ఇలాంటి ప్రసంగాల్లో రకరకాల అపోహల్ని తొలగించాలి… కౌంటర్ చేయాలి, రాజకీయ దురుద్దేశాలతో సాగే ప్రయత్నాల్ని వివరించి, ఖండించి… ఓ స్పష్టీకరణ ఇవ్వగలగాలి…
అవన్నీ ఉన్నయ్ ఈ ప్రసంగంలో… చివరకు నాకు ఇంకా వయస్సుంది, ఓపిక ఉంది, కామన్ సెన్స్ ఉంది… ఎవరేం సలహా ఇచ్చినా పాజిటివ్‌గా తీసుకునే తత్వమూ ఉంది… అనడమే కాదు… ‘‘నాది సగటు మధ్యతరగతి మనస్తత్వం…, సొసైటీ పట్ల భయం, గౌరవం ఉంది, సొసైటీ మన గురించి ఏమనుకుంటుందో అనే అప్రమత్తత కూడా ఉంది…
ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఇది నాణ్యమైంది… గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, ఇన్నాళ్లు తను సాధించిన అనుమతులు, కేంద్రం వద్ద తను పోరాడుతున్న అంశాలు, భవిష్యత్తు ప్రాజెక్టులు, వాటి దశలను సరిగ్గా వివరించాడు… అదేసమయంలో ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండానే కేసీయార్ గత పదేళ్ల పాలనపైనా అక్కడక్కడా చురకలు తగిలించాడు…
ఇక్కడ సొమ్ము కొల్లగొట్టి విదేశాలను తరలించేవాడిని కాను (ఈ విమర్శ ఎవరిని ఉద్దేశించో అక్కడికి వచ్చిన అందరికీ అర్థమైంది…) ఢిల్లీలో సీఎం బంగళాను ఫామ్‌హౌజులా దావత్‌లకు వినియోగించేవాడిని కాను… 80 వేల పుస్తకాలు చదివినోళ్లకు ఆమాత్రం ఆలోచన, సోయి లేదా వంటి వ్యాఖ్యలు అవే…
అదేసమయంలో ఎవరైనా రాజకీయ దురుద్దేశాలతో ఏవేవో అపోహల్ని క్రియేట్ చేస్తుంటారు… మీరు వాటిని వ్యాప్తి చేయకండి, అది అందరికీ నష్టం అని సుతిమెత్తగా రియల్ ఎస్టేట్ ప్రతినిధులకు చురకలు కూడా వేశాడు… గుడ్…
కులీకుతుబ్ షా నుంచి వైఎస్ఆర్ వరకు ఎవరెవరు హైదరాబాదుకు ఏమేం చేశారో చెప్పాడు… చంద్రబాబు పేరుతో సహా… నిజాం, బ్రిటిషర్ల దాకా… పాలసీ పెరాలిసిస్ లేకుండా చూశారు… ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు తలెత్తడం సహజం… అపోహలు కూడా… ఎవరికైనా ఏమైనా అపోహలు, అభ్యంతరాలు, ప్రతీకారాలు ఉంటే నామీద చూపించండి, నేను ఫేస్ చేస్తాను, కానీ ఆ ప్రచారాల ప్రభావం సిటీ డెవలప్‌మెంట్ మీద పడనివ్వను… అంటూనే తన విజన్-2047 ను సూటిగా, సంక్షిప్తంగా చెప్పుకొచ్చాడు…
కొన్ని చాలా ఆసక్తికరం… కాళేశ్వరం కోసం కేవలం 12 ఏళ్ల పరిమితిలో వేల కోట్లను ఏకంగా 11.5 శాతం వడ్డీతో రుణాలు చేశారు… 26 వేల కోట్లను 35 ఏళ్లకు గాను 7.5 శాతానికి రీస్ట్రక్చర్ చేయించాను… 2 లక్షల కోట్లకూ ఇదే అడుగుతున్నా… ఒక వెసులుబాటు… గత తప్పిదాలను నేను సరిదిద్దుతున్నా… ఇలాంటి విషయాలు…
ఎక్కడెక్కడికో వెళ్లి, విదేశాల నుంచీ పెట్టుబడులను అడుగుతున్నాం, మరి మనవాళ్లను మేమెందుకు ప్రోత్సహించం..? మీరు పోటీపడండి, ఏం కావాలో అడగండి, ఏం పాలసీ కావాలి, అందరినీ వ్యక్తిగతంగా మెప్పించకపోవచ్చు, కానీ స్థూలంగా మొత్తం సరైన పాలసీతో అందరికీ లాభం వచ్చేలా చేస్తాను అనే ఓ హామీ కూడా ఇచ్చాడు…
ఫ్యూచర్ సిటీ ఏముంది..? ఆ ఫోర్ బ్రదర్స్ కోసమే కదా అనే విమర్శలనూ ప్రస్తావించి, మీరే కదా నా బ్రదర్స్, అపోహల్ని వ్యాప్తి చేయకండి అని కోరాడు… పదేళ్ల తరువాత క్రెడాయ్ ప్రాపర్టీ షోకు ఓ ముఖ్యమంత్రి రావడం మళ్లీ ఇదే… దాన్ని క్రెడాయ్ ప్రతినిధులు కూడా ప్రస్తావించారు…
హైదరాబాద్ ప్లస్ తెలంగాణ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ మీద తను ఏకరువు పెట్టిన పలు ముఖ్యాంశాలు…
– మెట్రోను ఇంకా విస్తరిస్తాం… లాస్ట్ మైల్ కనెక్టివిటీకి మా ప్రాధాన్యం… జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యుటిలిటీ ట్రాన్స్‌పోర్టేషన్ అవసరం…
– రీజనల్ రింగ్ రోడ్ మాత్రమే కాదు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు సాధించాం… అంతేకాదు, ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు 11 కొత్త రేడియల్ రోడ్లు వేస్తాం…
– కోర్ అర్బన్ ఏరియా, అంటే ఓఆర్ఆర్ వరకు సర్వీస్… ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు సెమీ అర్బన్ ఏరియా, ఇది ఇండస్ట్రియల్… ఆర్ఆర్ఆర్ తరువాత రూరల్ తెలంగాణ, ఇది అగ్రికల్చర్, ఇదీ మా విజన్…
– ఏ కంపెనీని రమ్మని అడిగినా పోర్టు కనెక్టివిటీ అడుగుతున్నారు… ఒక డ్రైపోర్టు ఏర్పాటు చేసి, 8 లేన్ల రోడ్డుతో బందరు దాకా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం…
– కృష్ణా నుంచి గోదావరి… నగరానికి మంచినీళ్లిచ్చే ప్రతిదీ ఇంటర్ లింక్ చేస్తున్నాం… అలాగే 800 కేవీ అల్ట్రా మోడరన్ పవర్ లైన్లు ప్లాన్ చేస్తున్నాం… నాలాలకు అడ్డంగా ఉన్న ఆక్రమణల్ని తొలగిస్తూనే, చెరువుల్ని సంరక్షిస్తాం…
– ప్రసిద్ధ గ్లోబల్ కంపెనీల హెడ్స్… హెచ్ పీఎస్ స్టూడెంట్స్… నలుగురు వందల కోట్లు డొనేట్ చేయడానికి రెడీ అయ్యారు…….. బహుశా గతంలో ఎక్కడా రేవంత్ రెడ్డి తన విజన్-2047 మీద గానీ, చేపట్టబోయే ప్రాజెక్టుల మీద గానీ, తన కార్యాచరణ గురించి గానీ ఇంత విపులంగా చెప్పినట్టు లేదు… గుణాత్మక మార్పు..!!
Share this Article