Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…

October 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. ANR , నాగార్జునల మొదటి సినిమా బాగా హిట్టయింది . అదీ తండ్రీకొడుకులుగానే . దుష్టశిక్షణ శిష్టరక్షణ కాన్సెప్ట్ చుట్టూ ముగ్గురు రచయితలు కలిసి నేసిన కలనేత ఈ కలెక్టర్ గారి అబ్బాయి .

కొమ్మనాపల్లి గణపతిరావు , ఆంజనేయ పుష్పానంద్ , రామమోహనరావు కలిసి తయారు చేసిన కధకు బి గోపాల్ దర్శకత్వం వహించారు . ఈయనకు తెలుగులో ఇది రెండవ సినిమా . అక్కినేని అల్లుడు , సుమంత్ తండ్రి యార్లగడ్డ సురేంద్ర నిర్మాత .

Ads

Collector vs Minister . ఓ సిన్సియర్ జిల్లా కలెక్టరుకు ఓ అవినీతి ప్రజాప్రతినిధి , అతని గేంగుకి జరిగే యుధ్ధం . అన్ని సినిమాల్లో లాగానే విలన్లు , వారి సుపుత్రులు , వారి ఆశ్రితులు అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరి మీద జనం మీద పడి హింసిస్తుంటారు . ఈ సినిమాలో కలెక్టరే హీరో కాబట్టి ఆయన అడ్డం పడుతుంటాడు .

ఆయన కొడుకు కూడా తండ్రి బాటలోనే . తండ్రికి అనుభవం , కొడుకుకి ఆవేశం . తండ్రితో సవాల్ విసిరి ఇనస్పెక్టర్ అయి వస్తాడు . ఇద్దరూ కలిసి విలన్లను వాయిస్తూ ఉంటారు . ఈ ఘర్షణ క్రమంలో కలెక్టర్ గారి అమ్మాయి ప్రాణాలను కోల్పోతుంది . రెచ్చిపోయిన అబ్బాయి విలన్లను చంపబోతుంటే కలెక్టర్ గారొచ్చి అడ్డం పడి పోలీసులకు అప్పచెప్పటంతో శుభం కార్డ్ పడుతుంది .‌

బిర్రయిన స్క్రీన్ ప్లేని అందించిన రచయితలలో ఒకరయిన ఆంజనేయ పుష్పానందుని అభినందించాలి . సినిమా ఎక్కడా బోరించకుండా సాగిపోతుంది . దర్శకుడు బి గోపాల్ కూడా మసాలాలను బాగానే వేసారు . ANR శారద , నాగార్జున రజని జంటలు బాగుంటాయి .

రామాయణంలో పిడకల వేట/ఆట లాగా సుత్తి వేలు , రమాప్రభ , శ్రీలక్ష్మిల 1+2 తిరణాల రంజుగానే ఉంటుంది . వీళ్ళ ముగ్గురి మీద డబుల్ , త్రిపుల్ మీనింగులతో ఓ పేరడీ రీమిక్స్ బూతు పాట జనాన్ని బాగా ఆకర్షించింది . సన్నాయి వాయించు బావా జోడు సన్నాయి వాయించు బావా పాటను వేటూరి వారు బాగానే వ్రాసారు . మా సత్తెనపల్లి కుర్రాడు నాగోర్ బాబు/మనో , సుశీలమ్మ , శైలజ పాడారు ఈ పాట రాజాన్ని .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . అందమా అంటుకోనీవే ముద్దుగా ముట్టుకోనీవే , మన్మధ మన్మధ లాహిరిలో కమ్మని మెత్తని కౌగిలిలో , నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మా డ్యూయెట్లు అన్నీ బాగా చిత్రీకరించారు బి గోపాల్ . నాగార్జున రజని జోడీ బాగుంటుంది .

సమకాలీన రాజకీయాల మీద , రాజకీయుల దురాగతాల మీద గణేష్ పాత్రో డైలాగులు పదునుగానే పడతాయి . 1984 నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో MLA ల కొనుగోళ్లపై చురకలు బాగానే పడుతుండేవి . ఈ సినిమాలో కూడా రానా సినిమా లీడర్లో లాగా ఏ MLA కి ఎంత ముట్టచెప్పాలో పేరుతో సహా పేకెట్లను రెడీ చేయటం బాగానే పేలింది .

ఈ సినిమాలో ఏయన్నార్ కూడా చాలా ఫ్రెష్ గా , అందంగా కనిపిస్తాడు . అలాగే శారద కూడా . ఇతర పాత్రల్లో వరలక్ష్మి , పి యల్ నారాయణ , కోట శ్రీనివాసరావు , నూతన్ ప్రసాద్ , సుధాకర్ , శుభలేఖ సుధాకర్ , నర్రా , తదితరులు నటించారు .

తెలుగులో సక్సెస్ అయిన ఈ స్టోరీని బి గోపాల్ హిందీ రీమేక్కుకి కూడా దర్శకత్వం వహించారు . కానూన్ అప్నా అప్నా సినిమా పేరు . దిలీప్ కుమార్ , సంజయ్ దత్ , మాధురీ దీక్షిత్ , నూతన్ లీడ్ రోల్సులో నటించారు .

1987 ఏప్రిల్లో వచ్చిన కలెక్టర్ గారి అబ్బాయి సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడవచ్చు . It’s a neat , commercial , action , feel good movie . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!
  • ఇదుగో గ్రహాంతర జీవులు… వస్తున్నాయి, పోతున్నాయి, గమనిస్తున్నాయి…
  • సో వాట్..? ఈ కెప్టెన్ కూడా ఆటలో పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది..!
  • ఎవల్యూషన్, ట్రాన్స్‌ఫార్మేషన్… ఓ psychological angle లో చూద్దాం…
  • లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటరా..? యాక్టరా..? ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ..!!
  • క్రికెట్‌లోకి ఈ ఆల్‌రౌండర్ ఎంట్రీకి దారివేసింది ఓ పర్‌ఫెక్ట్ థ్రో..!!
  • భారతీయ సివంగులు గెలిచాయి… తొలిసారి ప్రపంచకప్‌ ముద్దాడాయి….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions