Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వంటలే కదా, అదెంత పని… పెంట పెంట చేసేస్తారు ఈ జాతిరత్నాలు…

June 26, 2025 by M S R

.

మన టీవీ నిర్మాతలు, చానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దేన్నయినా కామెడీ చేయగలవు… అనగా ఏ సబ్జెక్టయినా సరే కామెడీ షోగా మార్చేయగలవు… కామెడీ ఉంటే పర్లేదు., కానీ కాస్త వినోదం సరే… కానీ మొత్తం ఏ సబ్జెక్టు షో అయినా సరే, నలుగురు టీవీ సెలబ్రిటీలను తీసుకొచ్చి, పిచ్చి పిచ్చి ఆటలు, మాటలు, చేష్టలతో కామెడీ చేసిపారేయడమే సమస్య…

ఈటీవీలో ఢీ అనే డాన్స్ షోను సర్కస్ షోగా చేశారు… గతంలో ప్రదీప్, సుధీర్, రష్మి, హేమంత్ తదితరుల కామెడీ బిట్స్ బాగా రక్తికట్టాయి… యూట్యూబులో ఆ స్కిట్లకే కోట్లాది వ్యూస్… తరువాత హోస్టులు మారిపోయి చెడిపోయింది…

Ads

జీతెలుగులో మ్యూజిక్ షోలో ప్రదీప్ కామెడీ హోస్టింగ్ ప్లస్ కంటెస్టెంట్లతో కామెడీ స్కిట్లతో మ్యూజిక్ తెర వెనక్కి వెళ్లిపోయి, కామెడీ షోగా మారిపోయింది… తరువాత మరీ కంటెస్టెంట్లు పాడుతుంటే గ్రూపు డాన్సులు యాడ్ చేసి మరింత దెబ్బతీశారు… అఫ్‌కోర్స్, ఇండియన్ ఐడల్‌నూ అలాగే మార్చేశారు…

దాదాపుగా టీవీ రియాలిటీ షోల ధోరణి మొత్తం ఇదే… నలుగురు పాపులర్ సెలబ్రిటీలను పట్టుకురావడం, ఏదో చిట్‌చాట్, గేమ్స్, జోక్స్… లేదంటే సినిమాల ప్రమోషన్లు… ఈ ప్రమోషన్లు చేసీ చేసీ తన సుమ అడ్డా షో ఎవరూ చూడకుండా చేసింది సుమ… ఇవి జస్ట్, ఉదాహరణలు…

ఈమధ్య మాటీవీలో వచ్చే కిరాక్ బాయ్స్, కిలాడీ గాల్స్ క్లైమాక్స్ వచ్చేసింది కదా… ఇక ఆ షో వంటలను కామెడీ చేసే పనిలో పడింది… ఆహాలో సుమ, మరికొందరు పార్టిసిపేట్ చేసిన మాస్టర్ చెఫ్‌ షోలాగే… కుకూ విత్ జాతిరత్నాలు అనే ఓ కొత్త షోకు తెరతీస్తోంది… ప్రోమో చూస్తే ఆశ్చర్యం…

ఆహాలోనే దాన్ని పెద్దగా ఎవరూ చూడలేదు, మరి స్టార్ మా వాడికి దీనిపై, అంటే, ఇలాంటి షో మీద కన్నెందుకు పడిందో… పేరుకు వంటల ప్రోగ్రామ్, కానీ జస్ట్, ఓ కామెడీ షో అది… అదేదో సినిమాలో నటించి, టీవీ తెరకు చాన్నాళ్లుగా దూరమైన ప్రదీప్, ఇక అన్నీ చాలించుకుని, తనకు సేఫ్ వేదిక టీవీ మాత్రమేనని గ్రహించినవాడై మళ్లీ అరుదెంచినాడు…

తనే దీనికి హోస్ట్… థాంక్ గాడ్, శ్రీముఖిని పెట్టలేదు… జడ్జిలుగా ఆశిష్ విద్యార్థి, వెటరన్ స్టార్ రాధ, చెఫ్ తుమ్మ సంజయ్… ఆశిష్ పలు వీడియోలు చేశాడు, వంటలు చేస్తూ కాదు, తింటూ… ఏవో ఫుడ్ వీడియోలు… మరీ టేస్టీ తేజ టైపులో… తను ఈ జాతిరత్నాల వంటల్ని జడ్జి చేస్తాడట… సరే, చెఫ్ సంజయ్ వోకే.., తను కూడా ఓ జాతిరత్నం టైపే కాబట్టి కామెడీలో వేళ్లు, కాళ్లు పెట్టగలడు…

సరే, రాధదేముంది..? ఈటీవీలో ఇంద్రజ తరహాలో…! మగాళ్లు ఎనిమిది మంది, ఆడాళ్లు ఎనిమిది మంది… ఆడ, మగ పోటీలా..? జంటలుగా చేసి పోటీలు పెడతారో తెలియదు గానీ ప్రోమో చూస్తుంటే మొత్తానికి వంటల పేరిట సాగే ఏదో కామెడీ షో అని అర్థమవుతూనే ఉంది…

నటి విద్యుల్లేఖ, నటి సుహాసిని, టీవీ నటి సుజిత, టీవీ నటి రీతూ చౌదరి, బిగ్‌బాస్ ఫేమ్ యష్మి గౌడ, దీక్ష, బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ విష్ణుప్రియ, గోమతి ప్రియ కనిపిస్తున్నారు… మరోవైపు ఆర్జే హేమంత్, బిగ్‌బాస్ అవినాష్, వీజే సన్నీ, విష్ణుకాంత్, బిత్తిరి సత్తి, ఈటీవీ ప్రభాకర్, బాబా భాస్కర్, వాసు ఇంటూరి కనిపిస్తున్నారు…

హేమంత్ ఢీ తరువాత మళ్లీ ఇదేనేమో… ఇమాన్యుయెల్, హరి కూడా కనిపించారు… లాంచింగ్ షోలో ఎవరెవరు, తరువాత పోటీలో ఎవరెవరు ఉంటారో తెలియదు… విజే సన్నీ సినిమాల కథ ముగిసినట్టుంది… అవినాష్ సరే, స్టార్ మా ఆస్థాన కమెడియనే కదా… సో, వోకే, కుమ్మేయండి… పెంట పెంట చేసేయండిక వంటల్ని..!! జాతిరత్నాలు అంటేనే అర్థమవుతోంది కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ చివరి బాల్ అలాగే మిగిలి ఉంది… 22 పరుగులు వచ్చి గెలిచేశారు…
  • ప్రియమైన భార్యామణి గారికి… నాకు ఓ ‘పర్‌ఫెక్ట్ మ్యాచ్’ దొరికింది సుమా…
  • ఉడకని అమెరికా పప్పులు…. ట్రంపరికి ఇండియా సైలెంట్ వాతలు…
  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…
  • నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….
  • సాహసమే కృష్ణ ఊపిరి..! తెలుగు రాజకీయాల్లో పెద్ద రచ్చ ఆనాడు..!!
  • చమురుపై అమెరికా గ్రిప్… తద్వారా ప్రపంచంపై గ్రిప్… పార్ట్ 5
  • మదురో భవనం సెట్ వేసి… అమెరికా ఎడారిలో నెల రిహార్సల్… పార్ట్-4 …
  • వెనెజులా కొంప ముంచిన చైనా… చేతులెత్తేసిన నాసి రాడార్లు… పార్ట్-3
  • S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions