Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమెకు పాఠం నేర్పిస్తానన్నాడు… తనే ఓ గుణపాఠం నేర్చుకున్నాడు…

March 12, 2025 by M S R

.

కులం… అవును, రాజకీయం పిచ్చి ప్రేలాపనలకు దిగితే, బెదిరిస్తే కులం అండగా వచ్చింది… కులం ఎదిరించేసరికి రాజకీయం వెనక్కి తగ్గింది, ఏదో విఫల సమర్థనకు దిగింది…

రష్మిక మంథాన… ప్రస్తుతం దేశంలో టాప్ రేటెడ్ హీరోయిన్… నేషనల్ క్రష్ అంటారా, ఇంకేమైనా పిలుస్తారా మీ ఇష్టం… కానీ హైలీ పెయిడ్, మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఆమె ప్రస్తుతం…

Ads

పుష్ప, యానిమల్, చావ్లా సినిమాలు ఆమెను ఎక్కడికో తీసుకుపోయాయి… ఆమెకు ఎందుకో శాండల్‌వుడ్‌తో ప్రాబ్లం ఉంది… ఆమెది కన్నడమే… ఆ శాండల్‌వుడ్ నుంచే కెరీర్ స్టార్టయింది… కానీ ఏదో ఆమెకు సరిపడటం లేదు…

ఆ రక్షిత్ శెట్టిలు, ఆ రిషబ్ శెట్టిలతో కొంత గ్యాప్ ఉంది… కనిపిస్తూనే ఉంది… పైగా తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి… తరువాత తమిళం… తను శాండల్‌వుడ్ అని చెప్పుకోకుండా టాలీవుడ్ అనీ చెప్పుకుంటుంది పలుసార్లు… (విజయ్ దేవరకొండ కోసమేమో…)

బెంగుళూరు ఫిలిమ్ ఫెస్టివల్‌కు పోలేదు ఆమె… ఏమో, తన కారణాలు తనకుండొచ్చు… కానీ మాండ్య ఎమ్మెల్యే రవికుమార్ గనిగ నోరుపారేసుకున్నాడు… ఆమె నిర్లక్ష్యం, కావాలనే అవాయిడ్ చేసిందనీ ఏదేదో వ్యాఖ్యానాలు చేయడమే గాకుండా… పాఠం నేర్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు…

దీనికితోడు కొందరు సినిమా సెలబ్రిటీల నట్లూ బోల్టులూ ఎలా బిగించాలో మాకు తెలుసు అంటూ కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా శాండల్‌వుడ్ పట్ల బెదిరింపు ధోరణి కనబరిచాడు… (తన వ్యాఖ్యలు రష్మిక గురించి కాదు)…

సోషల్ మీడియా రష్మిక పట్ల పాజిటివ్‌గా స్పందించింది… ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విరుచుకుపడింది… ఆమె ప్రాణాలకు హాని ఉందని గొంతెత్తింది… సరిగ్గా ఈ దశలో ఆమె కులం ఆమెకు అండగా వచ్చింది… ఆమెది కొడవ కులం… కొడగు ప్రాంతంలో బలమైన కమ్యూనిటీ… మిలిటరీ కులం… టెంపర్‌మెంట్ ఎక్కువే…

కొడవ హక్కుల పరిరక్షణ సంస్థ కొడవ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు నందినేర్వండ నాచప్ప ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని, కర్నాటక రాష్ట్ర హోం, కేంద్ర హోం మంత్రులు ఆమెకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశాడు…

‘‘తన కృషితో, తన ప్రతిభతో ఎదిగింది రష్మిక… ఆమె కొడవ కాబట్టి టార్గెట్ అవుతోంది… మానసికంగా వేధిస్తున్నారు కావాలనే… రాజకీయ రచ్చలోకి లాగుతున్నారు… క్రియేటివ్ లిబర్టీ అంటే ఏమిటో తెలియని వ్యక్తులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు…’’ అని విమర్శించాడు…

సదరు ఎమ్మెల్యేకు అర్థమైనట్టుంది… తన వ్యాఖ్యలు ఎటెటో దారితీస్తున్నాయని తెలిసి మాట మార్చాడు… రాజకీయ నాయకుడు కదా… ఆమె జీవిత పాఠాలు నేర్చుకోవాలని మాత్రమే తన మాటల ఉద్దేశం అనీ వివరన ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు…

రష్మిక మాత్రం జస్ట్ సైలెంట్… తను స్పందిస్తే మళ్లీ ఆ మాటలను పీకి లాగి మరింతగా వివాదాన్ని పెంచుతారనే భావనతో మౌనాన్ని పాటిస్తోంది… గుడ్… అదే శాండల్‌వుడ్ తలకాయలు కొన్ని పెట్రోల్ పోయడానికి ప్రయత్నిస్తారనీ ఆమె భావన కావచ్చు… అన్నట్టు, ఆమె కొడవ నేషనల్ కౌన్సిల్ సభ్యురాలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారీ సిక్స్ కొట్టాడు… అభినందనలు రాలేదు… చిలుం వదిలింది…
  • హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?
  • అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!
  • … ఇంతకీ కుందరదన అంటే తెలుగులో అర్థమేమిటి చిరంజీవీ…
  • మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…
  • బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మాస్త్రం… అది మన యుద్ధసామర్థ్య ప్రకటన…
  • ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
  • స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…
  • పక్కా కమర్షియల్ చట్రంలోనే ఓ ఫిలాసఫీ చెబుతాడు త్రివిక్రముడు…
  • …. ముఖ్య అతిథి సీఎం గారి పెళ్లాం అని తెలియకపోతే ఎలా మరి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions