హరి క్రిష్ణ ఎం. బి….. ఈమధ్య చాలా ఎక్కువగా వినిపించే ధోరణి ఏంటంటే – మరీ ముఖ్యంగా యువతలో – పెళ్లి ఎందుకు? దాని బదులు సింగల్ గా లైఫ్ లీడ్ చేయడం, కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, – షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ తో బతికెయ్యొచ్చు కదా – అంటున్నారు… కొంత మంది పెద్దలు/పేరెంట్స్ కూడా – పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు? పెళ్లి అయిన ఆడా మగా ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు – ఏముంది దాని గొప్ప అంటుంటారు?
యూట్యూబ్ లో ఆర్ నారాయణమూర్తి ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది – అతన్ని anchor అడుగుతారు.. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని . దానికి ఆయన – కుదరలేదు… కానీ చేసుకుని ఉంటే బాగుండేది అంటాడు.. ఒక పక్షి, పిచుక, ఒక కుక్క, ఒక పంది – ఒక companionship దొరకబుచ్చుకుంటుంది . ప్రకృతిలో అదొక పార్ట్… అలా మనిషి కూడా ఉంటేనే బాగుంటుంది – అంటాడు.. ఆయనేం గొప్ప ఫిలాసఫర్ కాదు అయినా అనుభవంలో చెప్పినప్పుడు బాగా నచ్చింది…
పెళ్లి చేసుకుని ఆనందంగా లేని జంటల గురించి నేను చెప్పట్లేదు… కొంతమంది ఉండకపోవచ్చు.. జీవితంలో ఏం కావాలి అనే క్లారిటీ లేక అలా ఉండొచ్చు కొంత మంది… అన్నింటికంటే ఆ “క్లారిటీ” ముఖ్యం జీవితంలో… అది ఉంటే డబ్బు, ఆస్తి, అంతస్తు ఏవి ఉన్నా లేకున్నా మనిషికి ఆనందం ఉంటుంది.. ఆ క్లారిటీకి పరస్పర గౌరవం, ప్రేమ తోడైతే జీవితం మరింత joyful గా ఉంటుంది…
.
Ads
Share this Article