Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతి జీవికి ఓ తోడు… సరైన సాహచర్యంలోనే జీవితానికి పరిపూర్ణత, పరిపుష్టత…

November 13, 2022 by M S R

హరి క్రిష్ణ ఎం. బి…..    ఈమధ్య చాలా ఎక్కువగా వినిపించే ధోరణి ఏంటంటే – మరీ ముఖ్యంగా యువతలో – పెళ్లి ఎందుకు? దాని బదులు సింగల్ గా లైఫ్ లీడ్ చేయడం, కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, – షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ తో బతికెయ్యొచ్చు కదా – అంటున్నారు… కొంత మంది పెద్దలు/పేరెంట్స్ కూడా – పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు? పెళ్లి అయిన ఆడా మగా ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు – ఏముంది దాని గొప్ప అంటుంటారు?

—
నాకెందుకో ఇది అంత సమ్మతంగా కనపడదు. పెళ్లి అని కాదు కానీ – ఒక companionship లో ఉన్న ఆనందం, సుఖం, contendedness, completeness వేరే దేంట్లోనూ ఉండదేమో..
—
యూట్యూబ్ లో ఆర్ నారాయణమూర్తి ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది – అతన్ని anchor అడుగుతారు.. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని . దానికి ఆయన – కుదరలేదు… కానీ చేసుకుని ఉంటే బాగుండేది అంటాడు.. ఒక పక్షి, పిచుక, ఒక కుక్క, ఒక పంది – ఒక companionship దొరకబుచ్చుకుంటుంది . ప్రకృతిలో అదొక పార్ట్… అలా మనిషి కూడా ఉంటేనే బాగుంటుంది – అంటాడు.. ఆయనేం గొప్ప ఫిలాసఫర్ కాదు అయినా అనుభవంలో చెప్పినప్పుడు బాగా నచ్చింది…
—
ఎమర్జింగ్ ఎకానమీ కాబట్టి, evolution లో భాగంగా ఇదొక (ఇలాంటి ఆలోచన ధోరణి) phase ఏమో… – వెస్ట్ లో కూడా ఇలాంటి ధోరణి ఉన్నా చాలా ఎక్కువ శాతం ఫైనల్ గా పెళ్లి అనే వ్యవస్థలోనే సెటిల్ అవుతారు.. హ్యాపీ ఫామిలీస్ లీడ్ చేస్తున్నవారే ఎక్కువ success కూడా పొందుతారు ఎక్కువ శాతం.. ప్రైమ్ లో what’s your number అనే మూవీ ఉంటుంది… చాలా బాగుంటుంది.. వీలైతే చూడండి.. పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఆబ్బె కల్చర్ ఎంత important role పోషిస్తుందో మనిషి ఆలోచనా విధానంలో, కొత్త విషయాలను స్వీకరించడంలో..
—
ఆఫీస్ కి వెళ్ళడానికి, బిజినెస్ చెయ్యడానికి, ఏదైనా పని చెయ్యడానికి డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది…. అదే బతుకుదెరువు – బతకడానికి డబ్బుల కోసం.. అదే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి డ్రైవింగ్ ఫోర్స్ ఏముంటుంది – ఇంట్లో మన కోసం ఎవరూ లేనప్పుడు, మన కోసం ఎవరూ ఎదురుచూడనప్పుడు – మనల్ని ఉత్సాహంగా నడిపే ఎనర్జీ ఏంటి? వారం అంతగా పని చేసి పడుకుంటాం.. నిద్ర రాదు… అప్పుడు పక్కనే ఒకరు కబుర్లు చెప్పడానికి ఉండడం ఎంత బాగుంటుంది?
ఎక్కడికైనా బిజినెస్ ట్రిప్ వెళ్తాము.. ఆరు ఏడు గంటల ఫ్లైట్ దిగేటప్పుడు మన కోసం ఇంట్లో ఒకరు ఎదురు చూస్తున్నారు అనే ఊహ (ఎవరూ లేకపోవడం ఎంత అగాథంగా తోస్తుంది!) సాయంత్రం భోజనం అయ్యాక అలా చల్ల గాలిలో నడకలో పక్కనే ఒకరు కలిసి నడవడం, తుంపర వానలో కార్ లో అలా ఒక వంద కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్ లో పక్క సీట్ లో ఒకరు ఉండడం – sweet nothings చెప్పుకోవడం…
జనవరి మంచులో సెలవు రోజు పొద్దున్నే దుప్పటిలో వెచ్చగా ఇంకొకరితో ఇంకొంతసేపు పడుకోవడం, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అనుభవంలో ఎంత బాగుంటాయి… జీవితం సినిమానా ఎప్పుడూ ఇలాగే ఉండడానికి అంటారేమో… కష్టాలు, speedbumps ఎప్పుడూ ఉండేవే… కానీ వాటిలోనే ఉండిపోవాలి అనుకోము కదా..
జీవితం అంటేనే చిన్న చిన్న అనుభూతుల సమ్మేళనం… రోజూ ఆ అనుభూతుల్ని అనుభవించని వారు కొన్ని ప్రత్యేక దినాల్లో అనుభవించలేరు…
పెద్దవాళ్ళు అంటూ ఉంటారు – ఆరోగ్యం బాగాలేనప్పుడు తెలుస్తుంది ఒక తోడు విలువ. తోడు ఉండడం, తోడు నిలవడం బాగా హాయినిచ్చే విషయాలు. అసలు ఏ inhibitions లేకుండా బాడీ అండ్ మైండ్ సంగమం ఎంత మధురంగా ఉంటుందో కదా..
—
నేను సింగల్ గా ఉంటాను, ఆరు నెలలు పని చేసి మిగతా ఆరు నెలలు ప్రపంచ యాత్రలు చేస్తూ ఉంటాను అని అనేవాడు నా ఫ్రెండ్ ఒకడు.. అలా రెండో ట్రిప్ లో కోస్టారికా వెళ్లి, అక్కడ లాటిన్ అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు..
—
చిన్న చిన్న సమస్యలను పెద్దగా ఊహించుకుని ఉన్న relationship ని చెడగొట్టుకోకుండా కొంత పట్టువిడుపులతో సహజీవనాన్ని ఆనందమయం చేసుకోవడం సాధ్యమే.. మరీ కలిసి ఉండలేని జంటలు ఎక్కువ కాలం కలిసి ఉండడం కూడా మంచిది కాదు – ఆ కోపద్వేషాల మధ్యే జీవితం కరిగిపోతుంది..
—
సహజీవనం అని ఎందుకు అన్నానంటే అందరూ చేసేది అదే… పెళ్లి అనేది ఒక సాంఘిక ఆచారం.. ప్రస్తుతానికి చట్టసమ్మతం … భవిష్యత్తులో చట్టాలు మారొచ్చు. సంఘనియామాలు మారొచ్చు… కానీ మారనిది ఆ సహజీవనమే.. ఈ సహజీవనం అనేది కేవలం రెండు opposite genders మధ్యే ఉండాల్సిన అవసరం లేదు.. ప్రపంచంలో ఇలాంటి ఆనందాన్ని ఒకే జెండర్ జంటలు కూడా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు..
—

పెళ్లి చేసుకుని ఆనందంగా లేని జంటల గురించి నేను చెప్పట్లేదు… కొంతమంది ఉండకపోవచ్చు.. జీవితంలో ఏం కావాలి అనే క్లారిటీ లేక అలా ఉండొచ్చు కొంత మంది… అన్నింటికంటే ఆ “క్లారిటీ” ముఖ్యం జీవితంలో… అది ఉంటే డబ్బు, ఆస్తి, అంతస్తు ఏవి ఉన్నా లేకున్నా మనిషికి ఆనందం ఉంటుంది.. ఆ క్లారిటీకి పరస్పర గౌరవం, ప్రేమ తోడైతే జీవితం మరింత joyful గా ఉంటుంది…

.

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions