విమర్శించడానికి ‘ఈనాడు’ మీద బోలెడు అంశాలు దొరుకుతాయి… రోజురోజుకూ పతనమవుతున్న ప్రొఫెషనల్ ప్రమాణాలు, నాన్-ప్రొఫెషనల్ అంశాలు ఎట్సెట్రా… కానీ కొన్ని ప్రొఫెషనల్ టాస్కులు కూడా ఈనాడు మాత్రమే చేయగలదు… ఈనాడును చూసి వాతలు పెట్టుకునే ఆంధ్రజ్యోతికి, సాక్షికి అస్సలు చేతకావు అలాంటి టాస్కులు… మిగతా వాటికి పత్రికల లక్షణాలే లేవు… (తెలుగు మీడియాకు సంబంధించి…)
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని దేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఘనంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే కదా… అదేదో బీజేపీ కార్యక్రమమనో, ప్రభుత్వ కార్యక్రమమనో తీసిపారేయకుండా… ఇది మనందరి కార్యక్రమం అనే భావనతో ఈనాడు ప్రతిరోజూ ఓ మరుపురాని స్వాతంత్య్ర ఘట్టం మీద ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది… వరుసగా… నిరంతరాయంగా… అవీ ఎప్పుడూ చదివేసినవి కావు, కొత్త కొత్తవి… చరిత్ర గతిలో ఎక్కడో మరుగునపడినవీ వెతికి మరీ పబ్లిష్ చేసింది…
నిజంగా అభినందనీయమైన ప్రయాస… ఇందులో మెచ్చుకోదగినంత శ్రమ ఏముందని వెక్కిరింపుగా నవ్వేవాళ్ల అజ్ఞానాన్ని అలా వదిలేస్తే… మరి ఆ ప్రయత్నాన్ని సింపుల్‌గా ముగించదు కదా ఈనాడు… అవన్నీ ఇమ్మోర్టల్ సాగా/ అమృతగాథ పేరిట ఓ సంకలనంగా అచ్చేసింది… నేరుగా ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ, రామోజీ ఫిలిమ్ సిటీ ఎండీ విజయేశ్వరి వెళ్లి మోడీని కలిశారు… ఆయనతో ఆవిష్కరింపచేశారు…
Ads
మోడీ ఇతరత్రా ఎంత బిజీగా ఉన్నా సరే… ఈనాడే అడిగాక టైమ్ ఇవ్వడా ఏం..? ఆ పుస్తకాల్ని ఆవిష్కరించాడు, ఆ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడాడు… రామోజీరావుతో తన స్నేహబంధం గురించి తలుచుకున్నాడు… ఈనాడు ప్రయత్నాన్ని మెచ్చుకున్నాడు… (ఒక్కసారి ఊహించండి, ఇలాంటి ప్రొఫెషనల్ ప్రయత్నం సాక్షి చేస్తే.., జగన్-భారతి వెళ్లి మోడీ దగ్గర ఆ పుస్తకాల్ని ఆవిష్కరించడం… నెవ్వర్…) మోడీ టైమ్ ఇవ్వడని కాదు, సాక్షికి అంత సీన్ లేదని..!
(అవునూ, నిజానికి ఇలాంటి భేటీల్లో నిజానికి రామోజీరావే తెర మీద కనిపిస్తాడు సాధారణంగా… కిరణ్, శైలజ, విజయేశ్వరి పాల్గొనడం అత్యంత అరుదు… మరి ఢిల్లీ వెళ్లడానికి రామోజీరావు ఆరోగ్యం సహకరించడం లేదా..? పాపం శమించుగాక, సందర్భం ఏదైనా సరే, గెస్టు ఎవరైనా సరే, తన దగ్గరకే రావాలని రామోజీరావు అనుకోలేదు కదా కొంపదీసి…)
ఈ పుస్తకాల సంగతి పక్కన పెడితే…. ఈమధ్య విజయసాయిరెడ్డి ఈనాడు మీద నిప్పులు కక్కుతున్నాడు… ఈనాడు కూడా జగన్ మీద ఫుల్ అఫెన్స్ స్టాండ్ తీసుకుంది… ధర్మాన, సాయిరెడ్డి వంటి నేతలపై విరుచుకుపడుతోంది… నా ప్రత్యర్థి చంద్రబాబు కాదు, ఈనాడు మాత్రమే అని జగన్ అంటున్నాడు… ఈ స్థితిలో ప్రధాని మోడీతో రామోజీ కుటుంబసభ్యుల ఈ భేటీ రాజకీయంగా సాయిరెడ్డికి ఈనాడు ఏం సమాధానం ఇస్తున్నట్టు..?
ఈనాడు, ప్రధాని స్థాయిలో ఏదైనా సరే, కాజువల్‌గా చూడలేం… ప్రతి భేటీ వెనుక ఏదో మర్మముంటుంది… ఉద్దేశాలుంటయ్, ఎదుటివాళ్లకు ఏదో సంకేతాలు ఇస్తుంటయ్… మార్గదర్శి ఫైనాన్స్ కేసులో విచారణ వేగం పెరగబోతోంది… కేసీయార్ సైలెంటుగా ఉన్నాడు గానీ, జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇన్‌ప్లీడ్ అయ్యింది… మరి ఈ భేటీ ఏం చెబుతోంది..? !
Share this Article