ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైపర్ ఆది టీవీ పాపులర్ స్టార్లలో ఒకడు.., తను సొంతంగా స్క్రిప్ట్ రాసుకుంటాడు, నటిస్తాడు, స్పాంటేనియస్‌గా పంచులు వేస్తాడు, డాన్సులు ప్రయత్నిస్తుంటాడు… అన్నీ ఫన్ కోసమే… నాగబాబు మనసుకు తగినట్టు ఆయనకు నచ్చని వ్యక్తుల మీద కొన్ని వివాదాస్పద పంచులు వేస్తూ గతంలో వివాదాల్లో ఇరుక్కున్నాడు… అవన్నీ ఒక కోణం… అంతేకాదు, మాట్లాడితే చాలు, జబర్దస్త్ స్కిట్లలో తను ‘అదిరె అభి’కి వెన్నుపోటు పొడిచాడనే వ్యాఖ్యలు, జోకులు వినిపిస్తుంటయ్… అవీ ఫన్ కోసమే… అసలు అది పెద్ద విషయమే కాదు, ఫీల్డులో ఎవరి అవకాశాలు వాళ్లవి… తను సినిమాల్లో కూడా అడపాదడపా కనిపిస్తుంటాడు… ఇవన్నీ ఒకవైపు… కానీ ఆది మరో కోణం కనిపించింది తాజాగా… మెచ్చుకోవాలి… భేష్ ఆది… నీలోని మానవీయ కోణానికి హేట్సాఫ్…
పేరుకు జబర్దస్త్‌లో హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం అని కనిపిస్తూ ఉంటుంది… రైజింగ్ రాజు ఏజ్ బార్… ఐనా సరే, ఈ వయస్సులో కూడా అందరికీ దీటుగా అదే ఎనర్జీతో స్కిట్స్ పర్‌ఫామ్ చేస్తుంటాడు… తన వయస్సు మీద చెణుకులు వేస్తూ ఫన్ పండిస్తున్నా సరే, ఎక్కడా ఫీల్ కాడు, ఆడ వేషాలు వేస్తాడు, ఆది ఏది చెబితే అది చేస్తాడు… పేరుకు ఇద్దరి టీం… కానీ ఆది ఆల్ ఇన్ వన్… రాజు లేకపోయినా సరే, ఎవరో వైజాగ్ బూతు కేసుల్లో నిందితులను పట్టుకుని ఎలాగోలా స్కిట్ రన్ చేస్తుంటాడు… సరే, స్కిట్ మరియు ఫన్ కోసం… కొత్త వాళ్లను తీసుకొచ్చి స్కిట్‌లో ఇన్వాల్వ్ చేస్తాడు… జబర్దస్త్‌కు ఒక అసెట్ తను…
Ads
తాజాగా ఈటీవీ వాళ్ల ఓ ప్రోమో ఆకర్షించింది… అసలు రాజు ఈమధ్య ఎందుకు స్కిట్లలో కనిపించడం లేదు అనేది ప్రశ్న… ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్నాడు… ఏమైంది తనకు..? ఈ ప్రశ్నకు సమాధానంగా రాజే స్వయంగా సమాధానం ఇస్తూ… ‘‘కరోనా పీరియడ్, మనవరాలు పుట్టింది, సెన్సిటివ్ సిట్యుయేషన్, నేను బయటికి వచ్చి అటూఇటూ తిరిగితే, ఇంటికి వెళ్లాక పాపకు ఏమైనా అంటుకుంటే ఎలా..? అందుకని ఆ భయంతోనే ఇంట్లోనే ఉండిపోయాను… కానీ ఆది ఈ గ్యాప్‌లో కూడా నా నెలవారీ పేమెంట్ ఇంటికి పంపించాడు, చిన్నవాడైపోయాడు వయస్సులో, లేకపోతే కాళ్లు మొక్కాలి’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు…
నిజమే… ఒక వాతావరణంలో పనిచేస్తున్నవాళ్లు ఒకరికొకరు తోడుగా ఉండాలి, కాస్త హ్యూమన్ ఫేస్ కనిపించాలి… ఆది నుంచి కనిపించింది అదే… రాజు చెబుతున్నదాంట్లో ఆర్టిఫిషియాలిటీ, ఫేక్ కూడా ఏమీ కనిపించలేదు, నిజాయితీగా ఆది పట్ల కృతజ్ఞత చెబుతున్నట్టుగానే ఉంది… గ్రేట్… ఎవడైనా సరే, వాడుకుని వదిలేసే టీవీ, సినిమా ఇండస్ట్రీల్లో ఈమాత్రం మానవీయ కోణం కనిపించడం అరుదు, అదే నచ్చింది… పైగా రాజు వంటి ఏజ్ బార్ కమెడియన్‌ను ఆదరంగా కాపాడుకోవడం బాగనిపించింది…!!
Share this Article