Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీ బోయింగ్ కేబినెట్ 3.0 …. ఏ మంత్రుల ఎంపిక దేనికి..? ఎవరేమిటి..?

June 9, 2024 by M S R

మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం ఖచ్చితంగా ఓ రికార్డు… నెహ్రూ కుటుంబేతరుడి ఈ ప్రస్థానం ఖచ్చితంగా దేశ రికార్డుల్లో పేర్కొనదగిందే… కాకపోతే ఈసారి మెజారిటీ తగ్గింది… అనివార్యంగా చంచల మనస్కులైన చంద్రబాబు, నితిశ్‌ల మీద ఆధారపడాల్సిన దుస్థితి కాబట్టి మోడీ మీద హఠాత్తుగా కాస్త సానుభూతి కూడా మొదలైంది…

ఈ నేపథ్యంలో తన మంత్రివర్గం ఎంపిక ఎలా ఉంది..? ఎవరెవరు..? వాళ్ల నేపథ్యాలేమిటి..? ఎందుకు మంత్రులుగా తీసుకోక తప్పలేదు..? అన్నీ సమీకరణాలే… మాజీ ముఖమంత్రులు, పాత మంత్రులు, పొలిటిషియన్లు కాని మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారేమో అనే పాపులర్ లీడర్లు… రకరకాల కూడికలు, తీసివేతల లెక్క ఇది… 72 మంది బోయింగ్ ఎయిర్ డబుల్ డెక్కర్ ఫ్లయిట్ ఇది… లైవ్ చూద్దాం…

నిర్మలా సీతారామన్… హోప్ లెస్, మోడీ ఎందుకామెను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడో అర్థం కాదు… పైగా మొగుడు పక్కా మోడీ వ్యతిరేకి… కరోనా పీరియడ్‌లో ప్రజలకు వీసమెత్తు ఉపయోగపడలేదు… ప్రజాజీవితంలో ఆమె ఉనికి ప్రయోజనరహితం…

Ads

రాజనాథ్ సింగ్… తప్పదు, అనివార్యం, అన్ని విధేయతలూ పక్కనబెట్టి, మోడీకి అనుకూలంగా మారిపోయాక ఈ యూపీ సీనియర్ నేత మోడీ క్యాంపులో సుస్థిరం అయిపోయాడు…

అమిత్ షా… తను మోడీ టీంలో లేకపోతేనే ప్రపంచ వార్త… ఉంటే అది ఆశ్చర్యమూ కాదు, వార్త కూడా కాదు నిజానికి… సెకండ్ లెఫ్టినెంట్ ఆఫ్ దిస్ కంట్రీ నవ్…

నితిన్ గడ్కరీ… ఎప్పటికైనా ఈ ఆర్ఎస్ఎస్ వీర విధేయుడిదే ప్రధాని పీఠం అని సంఘ్ అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా ఆయనకు అంత సీన్ లేదు, మోడీ స్ట్రాటజిక్‌గా అలా కేబినెట్‌లో కట్టేస్తాడు తనను…

జేపీ నడ్డా… క్లియర్ ఇండికేషన్… తనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తీసేయబోతున్నారని అర్థం… నిజంగానే ఫెయిల్యూర్ పర్సనాలిటీ… బహుశా ఎవరైనా సౌత్ లేడీకి ఆ పగ్గాలు దక్కుతాయేమో…

శివరాజ్‌సింగ్ చౌహాన్… మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…. మోడీ ఫాలోయర్… పార్టీ ఏది చెబితే అది ఖచ్చితంగా పాటించే కార్యకర్త… సరైన ఎంపిక… మధ్యప్రదేశ్‌లో కొత్త రక్తాన్ని ఇండక్ట్ చేయడానికి వీలు…

సుబ్రహ్మణ్యం జైశంకర్…. నాకు నచ్చిన ఎంపిక… తను పొలిటిషియన్ కాదు, కానీ కేబినెట్‌లో ఉండాల్సిన వ్యక్తి… సూపర్ ఎంపిక… మళ్లీ విదేశాంగమే పక్కా… ఇంతకుమించిన ఆప్షన్ వేరే లేదు… ఐ కంగ్రాట్స్ జైశంకర్ సర్…

మనోహర్ లాల్ ఖట్టర్… హర్యానా మాజీ ముఖ్యమంత్రి… అక్కడ కొద్దిగా ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి… తీసుకొచ్చి కేబినెట్‌లో అకామిడేట్ చేశారు, పొలిటికల్‌గా స్ట్రాటజిక్ మూవ్… పర్లేదు…

కుమారస్వామి… సంకీర్ణ ధర్మంలో తప్పలేదు… పెద్దగా దేశానికి ఉపయోగమూ లేదు… మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆటగాళ్లే… తనూ ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి… ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు…

పీయూష్ గోయల్… మహారాష్ట్ర, ఆల్రెడీ కేంద్ర మంత్రి… పర్లేదు, మహారాష్ట్రంలో ఇంకా డెవలప్ కావల్సిన స్థితిలో బీజేపీ కోణంలో సరైన ఎంపికే…

ధర్మేంద్ర ప్రదాన్.. నిజానికి ఇంతకుమించిన గుర్తింపు దక్కాల్సిన కేరక్టర్… ఒడిశాలో బీజేపీ ఎదుగుదల వెనుక ప్రధాన వ్యక్తి… ఒడిశా ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నారందరూ, మరేమైందో గానీ మోడీ తనను తన కేబినెట్‌లో తీసుకున్నాడు…

జితన్ రామ్ మాంజీ… హిందుస్థాన్ అవామీ మోర్చా (సెక్యులర్) పార్టీ అధినేత… తన గురించి పెద్దగా తెలియదు గానీ, సంకీర్ణ ధర్మంలో భాగంగా కేబినెట్‌లో చోటు కల్పించాడు మోడీ… కల్పించాల్సి వచ్చింది…

రాజీవ్ రంజన్ (లలన్ సింగ్)… తప్పదు, అసలే చంచలమైన తత్వమున్న జేడీయూ నితిశ్… సంకీర్ణ ధర్మం పాటించకతప్పదు… అందుకని నితిశ్ సూచించిన ఈ పేరుపై మోడీ టిక్ పెట్టక తప్పలేదు… ఫాఫం మోడీ…

సర్బానంద సోనావాల్… అస్సోం బీజేపీ లీడర్… కాంగ్రెస్ నుంచి హిమంత విశ్వ శర్మ సీఎంగా వచ్చాక, లేదా తనను సీఎంగా ప్రొజెక్ట్ చేశాక, సోనావాల్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోక తప్పని అనివార్యత, హామీ… సరైన ఎంపికే…

కింజరపు రామ్మోహన్ నాయుడు… సంకీర్ణ ధర్మంలో భాగంగా తెలుగుదేశం నుంచి ఈ ఎంపిక… ఎర్రంనాయుడు కొడుకు… మంచి ప్రజెంటర్… టీడీపీ కోణంలోనే కాదు, బీజేపీకి కూడా యూజ్ ఫుల్ యంగ్ టర్క్… ఐ అప్రిషియేట్…

డాక్టర్ వీరేంద్ర కుమార్… మధ్యప్రదేశ్… కొన్నేళ్లుగా హార్డ్ కోర్ బీజేపీ లీడర్… పొలిటికల్ ఫ్యామిలీ…

జుయల్ ఓరమ్… ఒడిశా బీజేపీలో చాలా సీనియర్… పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా చేశాడు… రాబోయే రోజుల్లో ఒడిశా పాలిటిక్సులో కీలకం…

ప్రహ్లాద్ జోషి… కర్నాటక… పాత కాపే… మాజీ కేంద్ర మంత్రి కూడా… పెద్దగా మైనస్, ప్లస్సులు లేని ఎంపిక…

అశ్విని వైష్ణవ్… మాజీ బ్యూరోక్రాట్… కానీ రాజకీయాల స్పూర్తి తెలియదు… రైల్వే మంత్రి గత మోడీ ప్రభుత్వంలో… అది ప్రజారవాణా సంస్థ అనే సోయి ఏమాత్రం లేని టిపికల్ ఫూలిష్ బ్యూరోక్రాట్… నాకు సదభిప్రాయం లేదు…

గిరిరాజ్ సింగ్… బీహార్… బీజేపీ… ఆల్రెడీ కేంద్ర మంత్రి… మళ్లీ ఎంపిక… మోడీ నితిశ్‌ను నమ్మకుండా బీహార్‌లో తన కేడర్‌ను స్ట్రెంతెన్ చేస్తున్నాడు… ఇదీ ఈ తరహా ఎంపిక… పొలిటికల్, స్ట్రాటజిక్ ఎంపిక…

జ్యోతిరాదిత్య సింథియా… తప్పదు, కాంగ్రెస్‌ నుంచి వచ్చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు… ప్రభావవంతమైన రాజకుటుంబ నాయకుడు… గత ఫేమస్ నాయకుడు మాధవరావు సింథియా వారసుడు… పర్లేదు…

భూపేంద్ర యాదవ్… రాజస్థాన్, బీజేపీ హార్డకోర్ లీడర్… అక్కడ రాణి వసుంధరరాణే సింధియాను మరింత బలహీనం చేయడానికి ఈ ఎంపిక బెటర్… పర్లేదు…

గజేంద్ర సింగ్ షెకావత్… రాజస్థాన్, బీజేపీ, హార్డ్ కోర్ లీడర్… ప్రస్తుత మంత్రి కూడా… సరైన ఎంపికే… పర్లేదు…

అన్నపూర్ణాదేవి… జార్ఖండ్… బీజేపీయే… ఈ రాష్ట్రంలో మెల్లిగా జేఎంఎంను బలహీనం చేసే ప్రక్రియలో ఎంపిక ఇది… ఆల్రెడీ మంత్రి కూడా…

కిరణ్ రిజిజు… తను కేంద్ర కేబినెట్‌లో లేకపోతేనే ఆశ్చర్యపడాలి… అరుణాచల్‌ప్రదేశ్… హార్డ్ కోర్ బీజేపీ… కమిటెడ్… సరైన ఎంపిక…

మాన్‌సుఖ్ మాండవీయా… గుజరాత్… హోప్‌లెస్… ప్రస్తుతం కూడా కేంద్ర మంత్రే… ఫార్మసీ విషయంలో, ఆ రేట్ల విషయంలో, నియంత్రణ విషయంలో డిజాస్టర్ మినిస్టర్… ఐ అపోజ్ దిస్…

హరిదీప్ సింగ్ పూరి… ఖలిస్థానీ శక్తులు విజృంభిస్తున్న తరుణంలో ఈ అమృత్‌సర్ బీజేపీ నాయకుడి ఎంపిక సరైనదే… కానీ తనతో పంజాబ్‌లో పెద్దగా ఒరిగిన రాజకీయ ప్రయోజనమేమీ లేదు బీజేపికి… ఆల్రెడీ మోడీ కేబినెట్‌లో మంత్రే తను…

జి. కిషన్‌రెడ్డి… ఈ పునఃఎంపిక కేసీయార్‌కు భలే ఖుషీ… తెలంగాణలో తనతో బాగా ప్రయోజనం వచ్చిందనే పార్టీ రాంగ్ నోషన్… నిజానికి కేసీయార్ వ్యతిరేక వోటు తప్ప బీజేపీ స్వయంకృషి పెద్దగా ఏమీ లేదు ఎదుగుదలలో…

చిరాగ్ పాశ్వాన్… హీరో ఆఫ్ ది డే… నిన్న ఎన్డీయే మీటింగులో తనను హత్తుకుని లాలించిన మోడీ అంతరంగం అర్థమైంది.., ఎన్ని ఇబ్బందుల్లో కూడా పార్టీని కాపాడుకుని, ఎన్డీయేకు బలమైన సపోర్టర్‌గా నిలిచిన గోయల్‌ సరైన ఎంపిక… ఐ అప్రిషియేట్ ఇట్… మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు…

సీఆర్ పాటిల్… గుజరాత్… మోడీ విధేయుడు… పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు… కమిటెడ్… ఆల్రెడీ కేంద్ర మంత్రే… మళ్లీ ఎంపిక…

modi(టేబుల్ ది హిందూ సౌజన్యంతో…)

వీళ్లు గాకుండా… కీర్తి వర్ధన్ సింగ్, సురేష్ గోపీ, మురుగన్, అజయ్ తంతా, గణపతిరావు జాదవ్… ఇందర్ జిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జన్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావు జాదవ్, జయంత్ చౌదరి… జితిన్ ప్రసాద, శ్రీపాద నాయక్, పంకజ్ చౌదరి, క్రిష్ణ పాల్ గుర్జార్, రాందాస్ అథవాలే, నిత్యానంద రాయ్, అనుప్రియ పాటిల్, వి.సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బాఘెల్, శోభా కరంద్లాజే, కీర్తి వర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శంతను ఠాకూర్, కృష్ణ పాల్, బండి సంజయ్, కమలేష్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేఠ్, రవనీత్ సింగ్ బిట్టూ, దుర్గాదాస్ ఉయికె, రక్షా నిఖిల్ కాడ్సే, సుకంత మజుందార్, సావిత్రి ఠాకూర్, తోఖన్ సాహూ, రాజభూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, హర్షా మల్‌హోత్రా, నిముబెన్ బంబానియా, మురళీధర్ మోహోల్, జార్జి కురియన్, పవిత్ర మార్గరెట్…. ఒకటోె రెండో పేర్లు మిస్సింగ్, లేదా కొన్ని రాంగ్ … పర్లేదు… కొన్ని పార్టీ ఆబ్లిగేషన్స్, కొన్ని సంఘ్ సూచనలు, కొన్ని సంకీర్ణ ధర్మ బాధ్యతలు, కొన్ని మోడీ వ్యక్తిగత సమీకరణాలు, కొన్ని రాష్ట్రాల ప్రాధాన్యతలు… మొత్తానికి మోడీ 3.0 ఎంపికలు ఇంట్రస్టింగ్…

modi

ఇంకా చాలా పేర్లు వినిపించాయి గానీ… ఏమో ఏమైందో… స్పీకర్ పోస్టుకు ఏకంగా పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది… పర్లేదు, అదే నిజమైతే మంచి ఎంపికే… వేచి చూడాల్సిందే… మిగతా పేర్ల గురించీ చెప్పుకుందాం… సౌత్‌లో పాతుకుపోవాలని భావిస్తున్న దశలో… టీడీపీ, జేడీఎస్‌లతో పాటు సొంత పార్టీ నుంచీ 8 మంది ఎంపిక… పర్లేదు… తెలుగు రాష్ట్రాల నుంచే అయిదుగురు… టీడీపీ నుంచి ఇద్దరు, ఏపీబీజేపీ నుంచి ఒకరు, టీబీజేపీ నుంచి ఇద్దరు… జనసేన నుంచి జీరో…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions