దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుముఖ ప్రజ్ఙాశీలి, మిత్రుడు Prabhakar Jaini వేసిన ఒక ప్రశ్న రీజనబుల్… అదేమిటంటే..? ‘‘తెలుగు వాళ్ళ సినిమాలకు అవార్డులు రావడం ఆనందదాయకమే… RRR కీ Best Popular Film అవార్డు రావడం కూడా ఆనంద దాయకమే… కానీ, అవార్డులు ఇచ్చింది 2021 సంవత్సరానికి… సినిమా రిలీజయింది 25 మార్చ్ 2022 నాడు… సినిమా రిలీజ్ కాకముందే పాపులర్ అయిందని జ్యూరీ నిర్ణయించిందా?
ఇదే RRR కు 2022 సంవత్సరానికి జరిగిన పోటీల్లో పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది… అంటే జ్యూరీ ఎలా 2021 సంవత్సరానికి RRR ని బెస్ట్ పాపులర్ సినిమాగా నిర్ణయించింది?’’ విలువైన ప్రశ్న… దీనికి మరో మిత్రుడు ‘‘RRR Cinema 2021 లోనే సెన్సార్ జరుపుకుంది…. కానీ 3rd wave వల్ల Cinema 2022 మార్చిలో రిలీజైంది… గుర్తుండే ఉంటుంది… శతమానం భవతి కూడా 2017 సంక్రాంతికి విడుదలయినా కూడా 2016 కింద awards ఇచ్చారు…. అవార్డ్స్ కమిటీకి విడుదల తేదీతో సంబంధం లేదు.. సెన్సార్ అయిన దాన్ని బట్టే ఇయర్‌ని కన్సిడర్ చేస్తారు…’’ అని ఓ వివరణ కామెంట్ రూపంలో ఇచ్చాడు… ఇదొక కోణం…
ఇక్కడ ఓ అంశం… సినిమాను ఎప్పుడు ప్రారంభించారు..? ఎప్పుడు పూర్తి చేశారు..? ఎప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది అనేవి అప్రస్తుతం… సినిమా విడుదలైంది ఎప్పుడు..? అంటే ప్రేక్షకుల తీర్పు కోసం థియేటర్లకు లేదా ఓటీటీలకు వచ్చింది ఎప్పుడు..? అదే ప్రామాణికం కావాలి… పైగా 2021 సంవత్సరం అవార్డుల్లో 2022 లో పాపులరైన సినిమాగా ఎలా చూపిస్తారు..? అంతకుముందు శతమానంభవతికి కూడా ఇచ్చారు అనేది పరిగణనలోకి తీసుకోదగిన పాయింట్ మాత్రం కాదు… సో, నేషనల్ అవార్డుల జ్యూరీ చేసింది బ్లండరే…
Ads
నిజంగానే ఆర్ఆర్ఆర్ లాబీయింగ్ బలమైంది… అది ఆస్కార్‌నే కొట్టింది, ఈ జాతీయ అవార్డులు ఓ లెక్కా..? అందుకని వచ్చే ఏడాది ఎలాగూ 2022 అవార్డులు ప్రకటిస్తారు కదా… జాతీయ అవార్డులు అంటేనే ఒకటీరెండు సంవత్సరాలు లేట్ కదా… సో, వచ్చే ఏడాది ఆర్ఆర్ఆర్ అవార్డుల్ని ప్రకటిస్తే సరిపోయేది… పనిలోపనిగా రాజమౌళి ఉత్తమ పాపులర్ దర్శకుడిగా కూడా ఓ అవార్డును కొత్తగా క్రియేట్ చేసి ప్రకటిస్తే అయిపోయేది… లాబీ అడగాలే గానీ జ్యూరీ సమ్మతించదా ఏం..?
అసలు ఆస్కార్ అవార్డుల్లో నాటునాటు పాటకు ఉత్తమగీతంగా ఇవ్వడమే పెద్ద అబ్సర్డ్… అదొక దిక్కుమాలిన సంకర భాషాగీతం, వీసమెత్తు సాహితీవిలువలు లేవు అందులో… ఆస్కార్ వాడికి లాబీయింగ్ తప్ప ఇంకేమీ కనిపించనట్టుంది… సరే, ట్యూన్ కోసం కీరవాణికి ఇచ్చారు సరే… చంద్రబోస్ ఉద్దరించింది ఏముంది అందులో… ప్రతిభావంతంగా పాడిన రాహుల్ సిప్లిగంజ్‌కు, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు ఇవ్వాల్సింది… పోనీ, ఆస్కార్ అన్యాయాన్ని జాతీయ అవార్డుల్లో సరిదిద్దాల్సింది… అంటే, జస్ట్, ఇదొక ఉదాహరణ చెప్పుకుంటున్నాం…
అబ్బే, నేరచరితుల పాత్రలకు అవార్డులు ఇవ్వడం ఏమిటి..? సొసైటీకి నేషనల్ అవార్డుల జ్యూరీ ఏం సంకేతం ఇస్తోంది..? అనే ప్రశ్నలూ వస్తున్నయ్… అవీ పస లేని ప్రశ్నలే… ఆ పాత్రలకు అవార్డులు ఇవ్వడం లేదు… జస్ట్, ఆ పాత్రధారుల నటనకు ఇస్తున్నారు… అంతే… ఇవన్నీ సరే, ఆర్ఆర్ఆర్‌కు ఒక సంవత్సరం ముందు జాబితాలో అవార్డులు ఎలా ఇస్తారు అంటారా..?
అదే మరి… రాజమౌళి లాబీయింగ్ బలానికి నిజానికి ఆర్ఆర్ఆర్ టీంకు మరో పది దాకా అవార్డులు వచ్చి ఉండాలి… ప్చ్, రాజమౌళి టీంకు అన్యాయం జరిగింది… వాస్తవానికి ఆ సినిమాకు ఉత్తమ సినిమా అవార్డు (పాపులర్ సినిమా అని కాదు…) ఇచ్చి, నిర్మాతకు అవార్డు అందించే సీన్ వస్తే ఇంకా మజా వచ్చేది… ఎందుకంటే… ఆ నిర్మాతను రాజమౌళి పురుగులా తీసిపడేశాడు కదా…! తనకు ఉత్తమ దర్శకుడి అవార్డు రాకుండా, ఇప్పుడు తాను వెలివేసిన నిర్మాత అవార్డు అందుకుంటాడని రాజమౌళికి బహుశా ఏదేదోగా ఉండి ఉండవచ్చు… ఏమో, పాపులర్ సినిమా అవార్డు అయినా సరే, అందుకోవాల్సింది నిర్మాతే కదా… చూడాలిక…!! DVV Danaiah అంటే దారినబోయే దానయ్య అనుకున్నార్రా… ఫైర్… హహహ…!! పార్టీ లేదా దానయ్యా..!!
Share this Article