.
ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కోర్టు విధించిన గడువు సమీపిస్తోంది… తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ సంతకం చేయలేదు… కారణం… ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు…
నిజానికి స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే… కానీ స్థూలంగా ఇవ్వదలిచిన, అంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగులో ఉంది… ఇది క్లియర్ చేస్తే, దానిమీద కూడా ప్రభావం పడుతుంది… అందుకే ఇదీ ఆగిపోయింది…
Ads
కానీ ఆ 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ విముఖంగా ఉంది… కారణాలు… 1) అది మత రిజర్వేషన్లకు వ్యతిరేకం… 2) సుప్రీంకోర్టు విధించిన పరిమితి దాటిపోతాయి రిజర్వేషన్లు… 3) 9వ షెడ్యూల్‌లో పెడితే తప్ప ఈ రిజర్వేషన్లకు న్యాయసమీక్ష నుంచి రక్షణ ఉండదు… (ఐనాసరే, న్యాయసమీక్ష చేయవచ్చు అంటుంది న్యాయవ్యవస్థ, అది వేరే సంగతి)…
ఒకవైపు కాళేశ్వరంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది… కారణం, కేసీయార్, హరీష్ రావులపై ఘోష్ కమిషన్ రిపోర్టు కత్తులు వేలాడదీసింది కాబట్టి… క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం పూనుకుంటే ఈ అంశం ఇంకా సీరియస్ అవుతుంది కాబట్టి… కాళేశ్వరం మీదే బీఆర్ఎస్ కాన్సంట్రేషన్…
బీసీ రిజర్వేషన్లను గతంలో కుదించిన పాపం మోస్తున్న బీఆర్ఎస్ ఈ 42 శాతం రిజర్వేషన్లపై ఏమీ చేయలేక నిర్లిప్తంగా చూస్తోంది… అప్పుడప్పుడూ ఒకటీరెండు ప్రెస్‌మీట్లు తప్ప… చివరకు కవిత చేస్తున్న హడావుడి కూడా బీఆర్ఎస్ ముఖ్యుల వల్ల కావడం లేదు… పెద్ద పట్టింపూ లేదు…
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కేంద్ర ప్రభుత్వంపైనే తన అస్త్రాలను ఎక్కుబెడుతోంది… ఒకవేళ ఈ రిజర్వేషన్లను అమలు చేయలేకపోతే, ఆ వైఫల్యాన్ని బీజేపీ మెడలో వేయాలని భావన… ఢిల్లీలోనే నిరసనలకు పూనుకుంది… ఆల్రెడీ ఢిల్లీలో మీటింగులు పెట్టి కులగణన మీద, రిజర్వేషన్ల మీద యాంటీ బీజేపీ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేసింది… ఇప్పుడిక ధర్నాలతో దేశం దృష్టిని ఈ అంశం మీదకు మళ్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులంతా ఢిల్లీని చేరారు…
కాంగ్రెస్ తన వైపు సాకు చూపిస్తుండేసరికి… ఇక రాష్ట్ర బీజేపీకి తన వాదనను గట్టిగా డిఫెండ్ చేసుకోవల్సిన అవసరం ఏర్పడింది… మిగతా నాయకులేమో గానీ రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్ మాత్రం పార్టీ వాదనను గట్టిగా వినిపిస్తున్నాడు… తను కేంద్ర మంత్రి కాబట్టి, తన వాదనను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాదనలుగానే చూడాలి…
- తను ఏమంటాడంటే..? ‘‘కాంగ్రెస్ ఢిల్లీ ధర్నాలు ముస్లిం రిజర్వేషన్ల కోసమే… ఇప్పటికే బీసీలకు ఉన్న 27 శాతానికి కేవలం 5 శాతం పెంచి, ముస్లింలకు మాత్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం ఇది… అంటే బీసీల ముసుగులో 100 శాతం రిజర్వేషన్లు… మరి వీటిని బీసీ రిజర్వేషన్లు అనాలా..? ముస్లిం రిజర్వేషన్లు అనాలా..?’’మైనారిటీ వోట్ల కోసం ఈ ధర్నాలు, ఈ ఆందోళనలు..? కామారెడ్డి డిక్లరేషన్ స్పిరిట్ ఏమిటి..? మీరు చేస్తున్నదేమిటి..? మేం మతరిజర్వేషన్లకు వ్యతిరేకం… అవి రాజ్యాంగ విరుద్ధం… మొత్తం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి, మేం మద్దతునిస్తాం…’’
సో, బండి సంజయ్ మాటలు క్లియర్‌గా చెబుతున్నాయి… ఈ రిజర్వేషన్లకు కేంద్రం, బీజేపీ వ్యతిరేకం అని… కారణాలూ స్పష్టంగా చెబుతున్నాడు… కేంద్రం సరే అనకపోతే ఈ రిజర్వేషన్లు సాధ్యం కావు.,. ‘‘అసలు బీసీలు సగభాగముంటే మీ కేబినెట్‌లో ఉన్న బీసీ మంత్రులు ఎందరు’’ అనడుగుతున్నాడు బండి సంజయ్…
సో, అటు కాళేశ్వరం, ఇటు బీసీ రిజర్వేషన్లు… తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి… బీజేపీ ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై గురిపెడుతున్నదనే వార్తలతో… ఈ హీట్ ఇంకాస్త పెరుగుతోంది..!!
Share this Article