పార్ధసారధి పోట్లూరి ….. ISIS – కాంగ్రెస్ పార్టీ లింకు బయటపడ్డది ! తాజుద్దీన్ షేక్ – ISIS లింక్ ! జనవరి 5, గురువారం 2023 న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ [National Investigation Agency (NIA)] కర్ణాటకలోని మొత్తం 6 వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ,బెంగుళూరు, శివమొగ్గ, దావణగేరే లలో తనిఖీలు నిర్వహించింది NIA. తమకి దొరికిన సమాచారం మేరకు ISIS ఆపరేషన్స్ తో సంబంధాలు ఉన్నాయని ఇద్దరిని అరెస్ట్ చేసింది. NIA అరెస్ట్ చేసిన ఇద్దరిలో ఒకరు రేషన్ తాజుద్దీన్ షేక్ [Reshaan Thajuddin Sheikh] ఉడుపి జిల్లాకి చెందినవాడు కాగా రెండవ వ్యక్తి శివమొగ్గ జిల్లాకి చెందిన హుజైర్ ఫర్హాన్ బైగ్ [Huzair Farhan Baig].
కర్ణాటక కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్ కి చెందిన అధికారులు, NIA అరెస్ట్ చేసిన ISIS ఆపరేటివ్ రేషన్ తాజుద్దీన్ షేక్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన తాజుద్దీన్ షేక్ కొడుకుగా గుర్తించింది. NIA చెప్తున్న వివరాల ప్రకారం రేషన్ తాజుద్దీన్ షేక్ తన కాలేజ్ క్లాస్ మేట్ అయిన మాజ్ మునీర్ ద్వారా ప్రభావితం కాబడ్డాడు. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. మాజ్ మునీర్ ని 2022 సెప్టెంబర్ నెలలో NIA అరెస్ట్ చేసింది. రేషన్ తాజుద్దీన్ షేక్ మరియు హుజైర్ ఫర్హాన్ బైగ్ లకి ISIS కి సంబంధించి కార్యకలాపాలని నిర్వహించడానికి గాను మరో ISIS హాండ్లర్ కు క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు పంపిస్తున్నాడు.
వీళ్ళ ప్లాన్ ఏమిటంటే గృహదహనాలు, కిడ్నాపులు, ట్రాన్స్ఫార్మర్స్ ని తగులబెట్టడం, రోడ్ల మీద వెళ్ళే వాహనాలని అడ్డగించి దోచుకోవడం, లిక్కర్ షాపులని తగులబెట్టడం, గోడౌన్ల ని దోచుకోవడం తద్వారా దేశంలో అశాంతిని రేకెత్తించడం. రేషన్ తాజుద్దీన్ షేక్ తండ్రి తాజుద్దీన్ షేక్ ఉడిపి లోని బ్రహ్మవర్ బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి అత్యంత సన్నిహితుడు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ [KPCC] అధ్యక్షుడు DK శివకుమార్ కి కూడా నమ్మినబంటు. దక్షిణ కన్నడ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ తాజుద్దీన్ షేక్ వల్ల తరుచూ మత కలహాలు జరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు. మత పరమయిన హత్యలతో తాజుద్దీన్ షేక్ కి సంబంధం ఉంది.
Ads
ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే రేషన్ తాజుద్దీన్ షేక్ ని అరెస్ట్ NIA చేసిన మరుసటి రోజు నుండి అంటే జనవరి 6 తేదీ నుండి ఉడుపిలోని సోషల్ మీడియాలో తాజుద్దీన్ షేక్ DK శివకుమార్ తో కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతున్నది. ప్రస్తుతం NIA చేసిన తనిఖీలకి, అరెస్ట్ లకి మూలం సెప్టెంబర్ 19, 2022 న శివమొగ్గ రూరల్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసు… దీన్ని NIA నవంబర్ 15, 2022 లో మళ్ళీ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక్కో లింకు బయటికి రావడం, అలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి విచారణ చేసినప్పుడు అందరి లింకులు ISIS తో ఉన్నట్లు బయటపడ్డది.
సెప్టెంబర్ 2021 నెలలో NIA మాజ్ మునీర్ అహ్మద్ ని మంగుళూరులో అరెస్ట్ చేయగా, మరియు సయ్యద్ యాసీన్ ని ఉడుపి జిల్లాలో అరెస్ట్ చేసి విచారణ చేసినప్పుడు రేషన్ తాజుద్దీన్ షేక్ మరియు హుజైర్ ఫర్హాన్ బేగ్ ల పేర్లు బయటికి వచ్చాయి. మరో అనుమానితుడు అయిన మహమ్మద్ షరీక్ పరారీలో ఉన్నాడు.
మహమ్మద్ షరీక్ మరెవరో కాదు… 19 నవంబర్ 2022 న మంగుళూరులో ఆటో RDX పేలుడు పదార్ధం తీసుకెళుతూ, అది ప్రమాదవశాత్తూ పేలిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ మరుసటి రోజే మంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు మహమ్మద్ షరీక్ ని. బెయిల్ పైన బయటికి వచ్చిన తరువాత కూడా పరారీలో ఉన్నాడు. మహమ్మద్ షరీక్ దొరికితే మొత్తం లింకులు అన్నీ బయటపడతాయి.
అరేబియా సముద్ర తీరం ఆనుకొని ఉన్న తీర ప్రాంతం అటు కేరళ నుండి ఇటు కర్ణాటకలోని దక్షిణ కన్నడ రీజియన్ వరకు ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూపు కి సంబంధించిన కార్యకలాపాలు చురుకుగా ఉన్నాయి. అఫ్ కోర్స్ కాంగ్రెస్ తో పాటు పాకిస్థాన్ ISI వీళ్ళకి సహకరిస్తున్నది అన్నది నిజం !
బహుశా వచ్చే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్థాన్ ISI కి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న TPP మీద యుద్ధం చేయాల్సి రావడం వలన, మన దేశం మీద దృష్టి పెట్టె అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళకి సలహాలు, సూచనలు ఇచ్చే సమయం ఉండకపోవచ్చు. దాంతో అందరూ దొరికిపోతారు…
Share this Article