జానారెడ్డి… ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పదే పదే వినిపిస్తున్న పేరు… సాగర్ ఎమ్మెల్యే నర్సింహయ్య మరణంతో… అక్కడి రాజకీయాల్లో మళ్లీ కాస్త కుదుపు… మళ్లీ తెర మీదకు జానారెడ్డి పేరు……. చాలా దూరం వెళ్లిపోయింది చర్చ… తను పార్టీ మారుతున్నాడు, టీఆర్ఎస్, బీజేపీ తనను చేర్చుకోవడానికి రెడీ అయిపోయాయి… బీజేపీ అయితే ఏకంగా తనకు గవర్నర్ పోస్టు ఇవ్వడానికి, తన కొడుకు రఘువీర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి కూడా రెడీ అయిపోయిందని ఒక వార్త… ఎలాగూ నర్సింహయ్య కుటుంబసభ్యులు పోటీకి విముఖంగా ఉన్నారు గనుక ఇదే జానారెడ్డిని లాగేసి నిలబెడితే బెటరని కేసీయార్ ఆలోచిస్తున్నాడని మరో వార్త… తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం జానారెడ్డి దగ్గరకు వెళ్లి పార్టీ మారకుండా ప్రయత్నాలు చేశాడని ఇంకో వార్త…
నిజాలే… మాణిక్యం వెళ్లి ‘బాబ్బాబూ, ఈ స్థితిలో పార్టీ మారితే కాంగ్రెస్‌కు చాలా నష్టం’ అని నచ్చజెప్పడానికి ట్రై చేశాడనేది నిజమే… తనను కాంగ్రెస్ నుంచి లాగేసి, తనకు గనుక ఆసక్తి ఉంటే సాగర్ నుంచి పోటీచేయించాలని బీజేపీ ఆలోచించిన మాట కూడా నిజమే… ఆయన కొడుకును బరిలోకి దింపినా సరేనన్నది… గవర్నర్‌గా ఆఫర్ ఇవ్వడం అనేది నమ్మశక్యంగా లేకపోయినా… బీజేపీ సీరియస్ ఎఫర్ట్ పెట్టిన మాట నిజం…
Ads
జానారెడ్డి గెలుస్తాడా, ఓడతాడా, తనతో పార్టీకి వచ్చే ఫాయిదా ఏమిటి అనేది ముఖ్యం కాదు బీజేపీకి…. జానారెడ్డి వంటి సీనియర్ కూడా కాంగ్రెస్‌కు దూరమైపోతే… అది కాంగ్రెస్ కేడర్ మీద బాగా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందనీ, ఇంకా కాంగ్రెస్ నుంచి సీనియర్లు తమ పార్టీ వైపు రావడానికి ఓ బాట వేసినట్టు అవుతుందని బీజేపీ అనుకుంది… కానీ వర్కవుట్ కాలేదు ఇప్పటికైతే.., బీజేపీ తన ఆఫర్‌ను ఇప్పటికీ లైవ్‌గా ఉంచి, మీరే తేల్చుకుని చెప్పండి అని జానారెడ్డికే వదిలేసింది…
టీఆర్ఎస్ కూడా జానారెడ్డి కోసం ట్రై చేసింది… నిజానికి ‘పెద్దలు జానారెడ్డి గారు’ తను సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు కేసీయార్‌కు పరోక్షంగా బాగా సహకరించాడనే కోపం, అసహనం కాంగ్రెస్ నేతల్లోనే ఉండేది… కేసీయార్ కూడా జానారెడ్డి మీద పల్లెత్తుమాట విసిరేవాడు కాదు… ఇద్దరూ మంచి దోస్తులు అనే టాక్ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో వినిపించేది…
ఇక మొన్నటి ఎన్నికల అనంతరం జానారెడ్డి తెర వెనక్కి వెళ్లిపోయాడు… అసలు పొలిటికల్ తెరమీద కనిపించనేలేదు… కాంగ్రెస్ వ్యవహారాలతో కూడా అంటీముట్టనట్టుగానే ఉన్నాడు… ఇన్నేళ్లూ జానారెడ్డి ఎవరికీ గుర్తుకురాలేదు… ఇప్పుడు జానారెడ్డి కావాలి అందరికీ… టీఆర్ఎస్లోకి వెళ్తే తన స్థితి నాలుగు రోజులకే ఎలా మారిపోతుందో జానారెడ్డికి తెలుసు… టీఆర్ఎస్ బయట ఉంటేనే తనకు గౌరవం… టీఆర్ఎస్లో డీఎస్, కేకే స్థితి ఏమిటో జానారెడ్డి చూస్తూనే ఉన్నాడు… అంతెందుకు తుమ్మల, కడియం వంటి సీనియర్ల పరిస్థితి ఏమిటి..?
అందుకే నేను సీఎం లెవల్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం… నేను పార్టీ మారడం ఏమిటి అంటూ జానారెడ్డి తోసిపుచ్చుతున్నాడు… ఇప్పటికైతే తను కాంగ్రెస్‌లోనే ఉన్నాడు… కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లను అంటున్నాడు… రాజకీయాల్లో అదేమీ ఉండదు… ఒక లీడర్ పదే పదే నేను పార్టీ మారను అని చెబుతున్నాడూ అంటేనే కొత్తగా సందేహించాల్సిన స్థితి… మాణిక్యం వెళ్లి సంప్రదింపులు జరిపాడు అంటేనే ఏదో ఉంది అని అర్థం…
తను డైలమాలో ఉన్నట్టున్నాడు… టీఆర్ఎస్లోకి వెళ్లినా ఇమడలేడు… బీజేపీలోకి వెళ్తే, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కాస్త నయమే… కానీ బీజేపీ బలం ఎంత రాష్ట్రంలో..? తొందరపడ్డట్టు అవుతుందా..? పోనీ, కాంగ్రెస్‌లో కొనసాగినా పెద్ద ఫాయిదా ఏముంది..? అందుకే ఎటూ తేల్చుకోలేక పోతున్నట్టున్నాడు…!!
Share this Article