Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?

November 15, 2026 by M S R

.

రకరకాల కాన్స్పిరసీ థియరీలు (Conspiracy Theories) రావడం పరిపాటే. అదుగో వినాశనం.. ఇదిగో విధ్వంసం అంటూ భయపెట్టే కథనాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వాటిని ఏదో ఒక కుట్రకు ముడిపెట్టడం కూడా కొత్తేమీ కాదు. అయితే, ఈసారి అమెరికాలో వరుసగా చోటుచేసుకున్న రెండు పరిణామాలు అలాంటి అనుమానాలకు తావిస్తున్నాయి.

ఒకటి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం.. మరొకటి అమెరికా విమానయాన వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక వ్యవస్థలు మొరాయించడం యాదృచ్ఛికమేనా? లేక దీని వెనుక ఏదైనా పెద్ద ప్రణాళిక ఉందా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ కుట్ర సిద్ధాంతం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నిజానిజాలు పెరుమాళ్లకెరుక.. చదవండి. నమ్మాలని ఏమీ లేదు. నమ్మితే మీ ఇష్టం!

Ads

రెండు రోజులు.. రెండు వ్యవస్థలు.. ఒకటే అనుమానం! దీపేష్ దివాకరన్ అనే వ్యక్తి చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంతరాయం ఏర్పడింది. మరుసటి రోజే, నవంబర్ 13న అమెరికా విమానయాన వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తి దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయి.

రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వెనుక ఏదైనా సంబంధం ఉందా? అనేది ఆయన సంధిస్తున్న ప్రశ్న. ప్రభుత్వాలు మాత్రం సైబర్ దాడికి సంబంధించిన ఆధారాలేవీ లేవని చెబుతున్నాయి. సాంకేతిక సమస్యలే ఈ అంతరాయాలకు కారణమని వివరిస్తున్నాయి. అయినా కుట్ర సిద్ధాంతాలను నమ్మేవారికి ఈ వివరణలు అంతగా నచ్చడం లేదు.

దీపేష్ వాదన ప్రకారం.. ఎవరో అమెరికా కీలక మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో పరీక్షించి చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్, విమానయాన వ్యవస్థల్లో అంతరాయాలు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక రంగాలు ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.

తదుపరి లక్ష్యం ఎవరు? ఆయన అనుమానాల జాబితా చిన్నదేమీ కాదు. బ్యాంకింగ్, చెల్లింపుల వ్యవస్థలు, విద్యుత్ సరఫరా, ఇంధన రంగం, మొబైల్ నెట్‌వర్కులు, ఇంటర్నెట్ సేవలు, ఓడరేవులు, రైల్వేలు, లాజిస్టిక్స్, సూపర్ మార్కెట్లు, ఆసుపత్రులు, చివరకు నీటి సరఫరా వ్యవస్థలు కూడా లక్ష్యంగా మారవచ్చన్నది ఆయన అంచనా.

వీటిలో ఏ ఒక్క వ్యవస్థ నిలిచిపోయినా దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేయకపోతే ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిశ్రమల నుంచి ఆసుపత్రుల వరకు అన్నీ ప్రభావితమవుతాయి. ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్కులు పనిచేయకపోతే సమాచార వ్యవస్థే స్తంభించిపోతుంది. కాదు, అమెరికాయే స్తంభించిపోతుంది…

ఇవన్నీ ఒకేసారి లేదా వరుసగా దెబ్బతింటే అది ఒక్క అమెరికా సమస్యగా మిగలదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే సంక్షోభంగా మారుతుంది.

లాక్‌డౌన్ 2.0.. అసలు కుట్ర ఇదేనా? ఈ కుట్ర సిద్ధాంతంలో అత్యంత భయపెట్టే అంశం లాక్‌డౌన్ 2.0. అమెరికాలో కీలక వ్యవస్థలు వరుసగా విఫలమైతే, ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ ప్రకటించే పరిస్థితి రావచ్చని దీపేష్ అంచనా వేస్తున్నారు.

అప్పుడు అమెరికా మీడియా రష్యా, చైనా, ఇరాన్ లేదా ఉత్తర కొరియా వంటి దేశాలను ఈ సంక్షోభానికి కారణంగా చూపించే అవకాశం ఉందని ఆయన అనుమానం. సైబర్ యుద్ధం నుంచి ప్రజలను రక్షించాలనే పేరుతో కఠినమైన నియంత్రణలు అమలు చేయవచ్చని చెబుతున్నారు.

ఇక్కడే ఆయన మరో అడుగు ముందుకేస్తున్నారు. టెక్నాలజీ దిగ్గజాలు తమ ఏఐ వ్యవస్థలను విస్తృతంగా అమలు చేయడానికి ఇలాంటి సంక్షోభం ఒక అవకాశంగా మారుతుందన్నది ఆయన వాదన. భద్రత పేరుతో ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయడం, ప్రతి వ్యవస్థను అల్గారిథమ్‌ల పర్యవేక్షణలోకి తీసుకురావడం ఈ పరిణామాల అంతిమ లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు.

 

  • టెక్నోక్రసీ.. అల్గారిథమ్‌ల చేతుల్లో ప్రపంచం! దీపేష్ పోస్టులో చివరగా ప్రస్తావించిన పదం టెక్నోక్రసీ (Technocracy). అంటే సాంకేతిక నిపుణులు, సాంకేతిక వ్యవస్థల ఆధారంగా పాలన సాగించడం. ఆయన చెబుతున్న భవిష్యత్ ప్రపంచంలో బ్యాంకింగ్ నుంచి విద్యుత్ వరకు, రవాణా నుంచి ఆరోగ్యం వరకు ప్రతిదీ అల్గారిథమ్‌ల పర్యవేక్షణలో ఉంటుంది.

భద్రత కోసం ప్రజలు తమ స్వేచ్ఛను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది ఈ కుట్ర సిద్ధాంతంలోని ప్రధాన ఆందోళన. దేశాలను ఆక్రమించడం కోసం కాకుండా, ప్రజల జీవితాలను నియంత్రించడం కోసం భవిష్యత్ యుద్ధాలు సాగుతాయన్నది ఆయన అభిప్రాయం.

అయితే ఈ వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. మైక్రోసాఫ్ట్ అంతరాయం, అమెరికా విమానయాన వ్యవస్థలో సమస్యలు సాంకేతిక కారణాలతోనే తలెత్తినట్లు అధికారిక వివరణలు ఉన్నాయి. ఈ రెండు ఘటనల వెనుక ఉమ్మడి కుట్ర ఉందని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. లాక్‌డౌన్ 2.0 వస్తుందన్న అంచనాకూ ఆధారం లేదు.

conspiracy theory

కుట్ర కాకపోయినా.. ప్రమాదం మాత్రం ఉందా? ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం విస్మరించలేం. ఆధునిక ప్రపంచం టెక్నాలజీపై ఎంతగా ఆధారపడిపోయిందో ఈ రెండు ఘటనలు మరోసారి గుర్తుచేశాయి. ఒక టెక్నాలజీ సంస్థలో సాంకేతిక సమస్య ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిచిపోతున్నాయి. విమానయాన కమ్యూనికేషన్ వ్యవస్థలో చిన్న అంతరాయం ఏర్పడితే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరి ఒకవేళ ఇలాంటి సమస్యలు మరింత పెద్ద స్థాయిలో తలెత్తితే? ఒకేసారి బ్యాంకింగ్, విద్యుత్, ఇంటర్నెట్, రవాణా వ్యవస్థలు పనిచేయకపోతే? ప్రపంచం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది?

కుట్ర సిద్ధాంతాలు భయపెట్టవచ్చు. వాటిలో కొన్ని పూర్తిగా కల్పితాలు కావచ్చు. కానీ అవి లేవనెత్తే ప్రతి ప్రశ్ననూ కొట్టిపారేయలేం. సాంకేతికత మనిషి జీవితాన్ని సులభతరం చేస్తున్న కొద్దీ, దానిపైనే అతిగా ఆధారపడటం మరో ప్రమాదంగా మారుతోంది.

హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే ప్రపంచవ్యాప్త వ్యవస్థల విధ్వంసం నిజ జీవితంలోనూ సాధ్యమేనా? కుట్ర ఉందో లేదో తెలియదు. కానీ అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే సంసిద్ధత ప్రపంచానికి ఉందా? అన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన అసలు ప్రశ్న!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?
  • రాజరికపు వైభవాన్ని వదిలేసిన తొలి జమిందారు! చదవాల్సిన చరిత్ర!!
  • నాటి యండమూరి నవల – రికార్డుల ‘వాయేజర్‌’పై నా గాఢాసక్తికి కారణం…
  • ఈతరం పిల్లలకు మైసూరు ‘కాస్మోస్’ ఎందుకు చూపించాలి..?
  • ఎక్కడ రాకెట్ వదిలాడో, అక్కడే పట్టేసుకున్నాడు… మస్క్, నువ్వు తోపు..!!
  • కింగ్ ఆఫ్ స్లో మోషన్ – ఈ ‘క్రాక్రోయాక్స్’ ఇప్పుడు మేఘనాథుడు..!!
  • సినిమాల ‘నరుకుడు’ రోగానికి సెన్సార్ చికిత్స..! భోగితో స్టార్ట్..?!
  • ‘కుర్చీ’ విలువ – అధికారాంతమున చూడవలె అయ్యవారి అవస్థలు!
  • Never Lose Your Core Engineering Team… మనిషిని మించిన యంత్రం ఇంకా రాలేదు! 
  • మణిరత్నం ఏమైనా తక్కువా..? ఆ ‘రావణన్’ సినిమా మాటేమిటి మరి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions