సజావుగా నడిచే ప్రోగ్రాం మీద ప్రయోగాలు చేయొద్దు… వికటించి ఎదురుతన్నే ప్రమాదం ఉంటుంది… అచ్చంగా ఈటీవీ ఢీ షో గతి అంతే… నిజానికి సర్కస్ ఫీట్లనే డాన్సులుగా చూపించే ఆ ప్రోగ్రాంలోకి సుడిగాలి సుధీర్ ఎంటరయ్యాక కామెడీ ప్రధానంగా మారింది… డాన్సుకూ డాన్సుకూ నడుమ కామెడీ బిట్లు భలే పేలేవి… యూట్యూబులో విపరీతమైన వ్యూస్ నమోదయ్యేవి…
మొదట్లో ఉదయభాను హోస్ట్ చేసేది… తరువాత జూనియర్స్ రెండు సీజన్లకు నాగబాబు బిడ్డ నీహారిక హోస్ట్… తొమ్మిదో సీజన్ నుంచి ప్రస్తుత 14వ సీజన్ వరకూ ప్రదీపే హోస్ట్… ఆస్థాన హోస్ట్ అయిపోయాడు… టీం లీడర్స్, జడ్జిలు వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు… ప్రదీప్ మాత్రం లోకల్…
తనతోపాటు సుడిగాలి సుధీర్, రష్మి టీంలీడర్స్‌గా వచ్చారు… అంతకుమందు రవి, లాస్య చేసేవాళ్లు… జడ్జిలుగా సదా, తరుణ్ మాస్టార్, శేఖర్ మాస్టర్… ఈ కామెడీని జొప్పించసాగారు… రష్మి, సుధీర్ కెమిస్ట్రీ బాగుంటుంది, ప్రదీప్ స్పాంటేనియస్ పంచులు బాగుంటయ్ కాబట్టి క్లిక్కయ్యాయి… తరువాత వర్షిణి, హేమంత్ వచ్చారు… ప్రియమణి జడ్జిగా వచ్చింది… అందరితో షో మధ్య కామెడీ బిట్లు సరదాగా, ఫన్నీగా ఉండేవి… రక్తికట్టేవి.,. కేవలం సుధీర్, రష్మి ఉన్నరోజులు కూడా షో రంజింపచేసేది…
Ads
కానీ హేమంత్‌ను పీకేసి, ఇక ప్రయోగాలు స్టార్ట్ చేశారు, హైపర్ ఆదిని తీసుకొచ్చారు… సుధీర్‌కు దీటుగా ఆదిని నిలబెట్టే ప్రయత్నాలతో కథ గాడితప్పింది… వర్షిణిని తీసేశారు… దీపికను పట్టుకొచ్చారు… నిజానికి ఈ షోలో ఎవరుపడితే వాళ్లు సెట్ కాలేరు… అది నిర్మాతలకు తెలిసినట్టు లేదు… దీపికను కూడా తీసేశారు…
జడ్జిగా ఉన్న నటి పూర్ణను తీసేశారు… శేఖర్ మాస్టర్ వెళ్లిపోయాడు… ఏమైందో ఏమో గానీ సుధీర్, రష్మి వెళ్లిపోయారు… ఒక్కసారిగా ఢీ కళతప్పింది… బిగ్‌బాస్ నుంచి నేరుగా అఖిల్ సార్థక్‌ను పట్టుకొచ్చారు… అనలా సుస్మితను తీసుకొచ్చారు… వీళ్లిద్దరూ ఈ షోకు ఫిట్ కారు, కాలేదు… ఆది నుంచి ఎదురయ్యే ర్యాగింగ్ తరహా పంచుల్ని తట్టుకోవాలంటే సుధీర్‌లాగా దులుపుకుని పోయేవాళ్లే కరెక్టు… ఈలోపు బిగ్‌బాస్ ఓటీటీ షో నుంచి పిలుపు రావడంతో అఖిల్ సార్థక్ జంప్… ఆ షో వాళ్లు కూడా హమ్మయ్య అనుకున్నారు…
మరి ఈటీవీ షోలు అంటేనే కంట్రాక్టుల బాగోతాలు కదా… కంట్రాక్టు పీరియడ్‌లో బయటికి వచ్చేస్తే 10 లక్షల పెనాల్టీ ఉంటుంది కదా… మొన్నటి బిగ్‌బాస్‌లోకి రావడానికి అవినాష్ 10 లక్షల్ని ముక్కుపిండి మరీ వసూలు చేశారు, అవినాష్ బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు… మరి అఖిల్ అంత వీజీగా ఎలా వెళ్లిపోయాడు అంటారా..? ఈ కంట్రాక్టు పద్ధతి, పెనాల్టీ, వెట్టిచాకిరీ పద్ధతి మీద విమర్శలు బాగా పెరగడంతో, రేపురేపు లీగల్ ఇష్యూస్ వస్తాయని భయపడ్డారో లేక కంట్రాక్టు పద్ధతికి భయపడి ఎవడూ రావడం లేదో తెలియదు గానీ ఆ పద్ధతినే తీసిపారేశారు…
సో, అఖిల్ సేఫ్… ఇప్పుడు ఆది ర్యాగింగ్ పంచులతో అనలా సుస్మిత కూడా వెళ్లిపోయే స్థితిలో ఉంది… త్వరలో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఉన్న రవి, నవ్య స్వామి కూడా అక్కడ ఇమడలేకపోతున్నారనే భావన టీవీ సర్కిళ్లలో వ్యాప్తిచెందింది… (వాళ్ల పెళ్లి కూడా జరక్కపోవచ్చుననేది వేరే కథ)… ఇక మిగిలేది ఎవరు..? ఆది, ప్రదీప్… ప్రదీప్ మీద ఆది తన మార్క్ పంచులు వేయలేడు, వేస్తే ప్రదీప్ రియాక్షన్ వేరేగా ఉంటుంది… సో, సజావుగా నడిచే బండి చక్రాల్లో కట్టెలు పెడితే ఇదుగో ఇలాగే ఉంటుంది… ప్రస్తుతం దాని రేటింగ్స్ కూడా ఘోరంగా పడిపోయాయ్… ప్రస్తుతం దాని టీఆర్పీలు కేవలం మూడు… కిట్టీపార్టీ వంటి క్యాష్‌కన్నా తక్కువ… ఫాఫం…!!
Share this Article