Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్టార్‌ టీవీ బీబీజోడీ ఈటీవీ షోను కొట్టేసింది… జంటలు తెగ రెచ్చిపోతున్నయ్…

February 8, 2023 by M S R

ఈటీవీ డాన్స్ షో నానాటికీ పలుచన అయిపోతూ… పిచ్చి సర్కస్ ఫీట్లు, ఆది ర్యాగింగ్ డైలాగుల షో అయిపోయాక… ఆహా టీవీ ఓ డాన్స్ షోను హిట్ చేసుకుంది… ఆ షోలో నాణ్యత కనిపించింది… ఏదో కామెడీ షోగా, పంచుల ప్రోగ్రాంగా మార్చకుండా డాన్స్ మీద కాన్సంట్రేట్ చేశారు ఆ షోలో… ఇప్పుడు మాటీవీ ప్రొఫెషనల్ డాన్సర్స్‌ను గాకుండా బిగ్‌బాస్ వివిధ సీజన్ల కంటెస్టెంట్లతో జోడీలు కూర్చి, వాళ్లతో డాన్స్ షో చేసింది… ఇప్పుడు అది హిట్… ఈటీవీ ఢీ షోలో ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా ఇప్పుడు వెలవెలబోతున్నారంటే ఆశ్చర్యం లేదు…

ఢీ షోలో కంటెస్టెంట్లు మస్తు సర్కస్ ఫీట్లు చేస్తరు… పాటకు తగిన ఫీలింగ్స్ ప్రదర్శించే అవసరమే లేదు… పైకి ఎగిరి దూకావా..? హిప్ మూమెంట్ ఎలా ఇచ్చావు..? ఫ్లిప్ కొట్టావా..? జిమ్నాస్టిక్స్ చూపించాలా..? ఇదే లెక్క… దాన్ని డాన్స్ అనుకోవాలని దబాయిస్తుంది ఈటీవీ… ఇక జెస్సీ, ఆది నాసిరకం కామెడీ సరేసరి… ఒక్కసారి అక్కడ కట్ చేసి, మాటీవీలో వచ్చే బీబీ జోడికి రండి… అసలు ఈ షో మొదలయ్యే ముందు ఎవరూ అనుకోలేదు, ఈ రేంజులో క్లిక్ అవుతుందని…

bbjodi

Ads

ఎందుకంటే, వాళ్లకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు… కాళ్లు, కీళ్లు ఆ స్టెప్పులకు పెద్దగా సహకరించవు… అయితేనేం… కష్టపడ్డారు, నేర్చుకున్నారు, చెమటోడ్చారు… ఒళ్లు వంచారు, కొన్ని పాటల్లో ప్రొఫెషనల్ డాన్సర్లకు దీటుగా చేశారు… వీళ్ల స్టెప్పులకు మరో అడ్వాంటేజ్ ఏమిటంటే… వీళ్లు ఫీలింగ్స్ ప్రదర్శించగలరు… దాంతో పాటలు కాస్త రక్తికడుతున్నయ్…

గత వారం బార్క్ మైదరాబాద్ రేటింగ్స్ చూస్తే ఢీ కేవలం 3.33 జీఆర్పీలు కాగా, ఈ బీబీ జోడీ రేటింగ్స్ 3.98 జీఆర్పీలు… ఇంకా పెరిగే చాన్సుంది… మొదట్లో ఈ కంటెస్టెంట్లు కాస్త తడబడినా ఇప్పుడు రెచ్చిపోయి చేస్తున్నారు… ఇక జీతెలుగులో మొన్న ఫినాలే అయిపోయిన డాన్స్ ఇండియా డాన్స్ షో అట్టర్ ఫ్లాప్… ఇందులో సంగీత, బాబా మాస్టర్, ఆనందిని జడ్జిలుగా కూర్చోబెట్టారు… మొత్తానికి బోర్ షో… దాని రేటింగ్స్, అందులోనూ గ్రాండ్ ఫినాలేకు వచ్చిన జీఆర్పీలు జస్ట్ 1.33… అంటే అట్టర్ ఫ్లాప్ షో అన్నమాట…

jodi

ఈ బీబీ జోడీలో జతలుగా మొదట పాల్గొన్నది…

1- Mukku Avinash & Ariyana Glory. …

2- Akhil & Tejaswi. …

3- Mehaboob & Ashu Reddy. …

4- Ravi Krishna & Bhanu Shree. …

5- Roll Rida & Inaya Sultana. …

6- Arjun Kalyan & Vasanthi Krishnan. …

7- RJ Surya & Faima Patas. …

8- RJ Chaitu & RJ Kajal.

jodi

వీళ్లే గాకుండా కౌశల్, అభినయ వచ్చి చేరారు… మొదట్లో కనిపించిన వారిలో రోల్ రైడా, ఇనయ సుల్తానా ప్రస్తుతం లేరు… మిగిలిన జంటల్లో ఆర్జే చైతు పూర్ పర్‌ఫామెన్స్… తనకు ఈజ్ లేదు… కాకపోతే తనకు జంటగా చేస్తున్న కాజల్ పర్లేదు… ఇక ఆర్జే సూర్య, ఫైమా శక్తికి మించి కష్టపడుతున్నారు… ప్రత్యేకించి ఫైమాలో ఎనర్జీ లెవల్స్ ఆశ్చర్యపరుస్తాయి… కౌశల్, అభినయ జంటలో కౌశల్ పూర్ పర్‌ఫామెన్స్… మాటలెక్కువ… అందరికీ కొర్రీలు పెడుతున్నాడు కానీ తనలో దమ్ము తక్కువ…

చెప్పుకోదగిన జంటల్లో అర్జున్ కల్యాణ్, వాసంతి… రవికృష్ణ, భానుశ్రీ… అఖిల్, తేజస్వి… అవినాష్, అరియానా బాగా చేస్తున్నారు… మెహబూబ్ మొదట్లో ఆషురెడ్డితో చేసినా ఇప్పుడు శ్రీసత్య వచ్చి చేరాక ఆ జంట కూడా బాగా చేస్తోంది… అఖిల్, తేజస్వి ప్రస్తుతానికి టాప్ అనిపిస్తోంది… అలనాటి హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్, నటి సదా జడ్జిలు… కీపిటప్ కంటెస్టెంట్స్… బాగా కష్టపడుతున్నారు… మీకు కాంప్లిమెంట్స్…!! కాస్త జంటల నడుమ రొమాన్స్, కెమిస్ట్రీ అదుపు తప్పుతోందనే విమర్శ అక్కడక్కడా వినివస్తున్నా, మరీ అశ్లీలంగా ఏమీ లేదు… చూడబుల్ మూవ్‌మెంట్సే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions