.
నేను వక్ఫ్ చట్టాన్ని నా రాష్ట్రంలో అమలు చేయను, ప్రాణం పోయినా సరే దాన్ని అంగీకరించను…. 25 వేల టీచర్ పోస్టుల నియామకం రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించను… మా మీద ఏదో కుట్ర జరుగుతోంది….. మమత బెనర్జీ గురించి తెలుసు కదా… ఇలా ఏదేదో మాట్లాడుతూనే ఉంది…
మరోవైపు పార్టీ ఎంపీలు మాత్రం ఢిల్లీ వీథుల్లో తన్నుకుంటున్నారు… ఎన్నికల సంఘంతో కుట్ర పన్ని బీజేపీ వచ్చే సంవత్సరం ఎన్నికల్లో తన కొంప ముంచబోతుందని ఆమెకు నిత్యశంక… అందుకని పార్టీ ఎంపీలందరూ కలిసి ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి తమ సందేహాలు చెప్పి, ఓ విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చి రావాలని ఆదేశించింది…
Ads
ఇది ఎవరిని ఆర్గనైజ్ చేయాలని చెప్పిందో గానీ… సీనియర్ లీడర్ కల్యాణ్ బెనర్జీతోపాటు ఎన్నికల సంఘం ఆఫీసు దగ్గర ఓ మార్నింగ్ జమయ్యారు… వారం అయ్యిందేమో… ఈయన పార్లమెంటులో పార్టీ విప్… తను అక్కడికి వెళ్లగానే పార్టీ మరో ఎంపీ మహువా మొయిత్రా ఈయన మీదకు ఫుల్లు ఫైరయిపోయింది…
ఈ మెమురాండంలో నా పేరు ఎందుకు లేదు, కావాలనే నా పేరు తీసేశారా అని నిలదీసింది… ఎహె, నాకేం తెలుసు, నీలాగే నేనూ వచ్చాను, ఎవరు పేరు ఉండాలో, ఎవరి పేరు ఉండకూడదో నాకూ ఎవరూ చెప్పలేదు అని ఈయన వాదన… గొడవ పెరిగింది… అరుచుకున్నారు… ఆమె ఆఫీసు దగ్గర కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ల వద్దకు వెళ్లి వెంటనే ఈ కల్యాణ్ బెనర్జీని అరెస్టు చేయండి అంటూ అరిచింది… డోరెక్ డోబ్రియల్ సర్దిచెప్పినా లొల్లి ఆగలేదు…
‘‘తనకెంత ధైర్యం..? 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీలతో పోరాడాను… ఈమె ఏమిటి…? ఒక్క మోడీతో తప్ప ఆమెకు ఏ బీజేపీ నేతతోనూ పోరాటం లేదు, నన్ను అరెస్టు చేయిస్తుందా..? అందంగా ఉండి, ఇంగ్లిషులో మాట్లాడగానే సరిపోయిందా..? రూడ్, అనాగరికం… వర్సటైల్ ఇంటర్నేషనల్ లేడీ…
పదే పదే పార్లమెంటులో నాకు ఎక్కువ మాట్లాడే సమయం ఇవ్వండి అని ఒత్తిడి చేస్తుంది… ఎందుకివ్వాలి..?’’ అని విరుచుకుపడ్డాడు… ఈ కల్యాణ్ బెనర్జీకి మరో సీనియర్ సౌగత్ రాయ్‌కూ పడదు… వీళ్లకు కీర్తి ఆజాద్ మద్దతు… నిన్న గాక మొన్న వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లు ఈమెకు మద్దతా… అని వాళ్లనూ కసురుకున్నాడు… సౌగత్ రాయ్‌నూ టార్గెట్ చేశాడు,..
2001లో ఎవరి దగ్గరో నగదు తీసుకుంటూ ఆపరేషన్ నారద అనే స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయాడు, తనూ చెప్పేవాడేనా, అసలు నాటి నుంచే నన్ను సహించడం లేదు అని విమర్శ… నిజానికి పార్టీ ఎంపీలకు సపరేటుగా ఓ వాట్సప్ గ్రూప్ ఉంది… అందులో చాట్లు, మెసేజులను కూడా బయటపెట్టి బీజేపీ లీడర్ అమిత్ మాలవ్య ఓ ట్వీట్ కొట్టాడు… ఈ పంచాయితీలన్నీ బయటపెట్టాడు…
కేవలం పార్టీ ఎంపీలే ఉండే గ్రూపు చాట్స్, ఫోటోలు, వీడియోల్ని ఎవరు బీజేపీకి లీక్ చేశారనేది మరో ప్రశ్న… ఈ మొత్తం గొడవలకు కేంద్రమైన కథానాయిక మహువా మొయిత్రా మాత్రం నోరు విప్పడం లేదు… ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు… అఫ్‌కోర్స్, మమతా బెనర్జీ కూడా..!! ఏం పార్టీరా బాబూ…!!
అవునూ… ఎలక్షన్ కమిషన్ ఆఫీసు కాపలాగా ఉండే బీఎస్ఎఫ్ జవాన్లు ఈమె చెప్పగానే ఓ పార్టీ ఎంపీని అరెస్టు చేస్తారా..? చేస్తారని అనుకుందా ఆమె..? తన పేరుతో ప్రశ్నలు అడగడానికి ఆమధ్య ఎవరికో తన క్రెడెన్షియల్స్ ఇస్తే అదీ పెద్ద గొడవైంది తెలుసు కదా…!!
Share this Article