.
మయసభ… సోనీ లివ్‌లో ఉన్న వెబ్ సీరీస్… పేరుకు ఇది కల్పితకథ అని ఓ పే-ద్ద డిస్‌క్లయిమర్ వేసి,… చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల రాజకీయాల చరిత్రగా అందరికీ అర్థమయ్యేట్టు తీశాడు దర్శకుడు దేవ కట్ట…
అందులో పాత్రలు ఏవి ఎవరివో ప్రేక్షుకులు ఇట్టే పోల్చుకుంటారు… ఎలాగూ కల్పితం అని డిస్‌క్లయిమర్ వేసేశాం కదాని క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని ఏదో కులసమరంలా కథను, ఆ ఇద్దరి పాత్రలనూ రాసుకున్నాడు…
Ads
సరే, ఏదో రాశాడు, ఏదో తీశాడు సరేగానీ… ఒక పాత్రను చిత్రీకరించిన విధానం మీద మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి… సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి… పాత్రికేయ మిత్రులు కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు… బీసీ రాజకీయాలు చేసే నాయకులు మాత్రం స్పందించకపోవడం ఒకింత విచిత్రమే, ఆశ్చర్యమే… అసలే ఇప్పుడు బీసీ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తున్న రోజుల్లో..!
1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, నాలుగుసార్లు బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన వెనుకబడిన వర్గాల నాయకుడు, ఒకసారి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డం రాజారాంను ఉద్దేశించి తీసిన సీన్ వెనుకబడిన వర్గాల ఆత్మాభిమానాన్ని తీవ్రంగా గాయపరిచడమే… సీఎం పదవి ఇస్తానంటే ఇందిరాగాంధీ కాళ్లు పట్టుకున్నాడని చూపించిన సీన్ ఆయా వర్గాలపై విషం కక్కడమే అనేది ఈ విమర్శల సారాంశం…
చంద్రబాబు నాయుడు, వైఎస్. రాజశేఖర్‌రెడ్డి లాంటి వాళ్లేమో ఈ సిరీస్‌లో హీరోలు… వెనుకబడినవర్గాల నాయకుడిని మాత్రం నేలబారుగా చిత్రీకరించడం ఏమిటి…? పోనీ ఆ వైఎస్, చంద్రబాబు కథల్లోని అనేక విషయాల్ని నిజాయితీగా చిత్రీకరించాడా అంటే అదీ లేదు…
సోషల్ మీడియాలో కనిపిస్తున్న మరికొన్ని సమీక్షల సారాంశం ఏమిటంటే..?
‘‘ఇది చిత్తూరు , కడప , అనంతపురం జిల్లాలలో కమ్మ vs రెడ్డి యుధ్ధంపై.., విజయవాడలో కమ్మ vs కాపు యుధ్ధంపై తీసిన సీరీస్… ఇందులో కెవిపి రామచంద్రరావు , చెన్నారెడ్డి , నేదురుమల్లి , విజయభాస్కరరెడ్డి లేరు, అంజయ్య పాత్ర మాత్రం ఉంది …
CBN , YSR మొదటి ప్రమాణ స్వీకారాలకు యన్టీఆర్ అసలు హాజరు కాలేదు . ఆయన వచ్చింది భవనం ప్రమాణ స్వీకారానికే … అలాగే చంద్రబాబు నాయుడికి యూనివర్సిటీ రోజుల్లో ఒక ప్రేయసి ఉన్నట్టుగా ఎప్పుడూ ప్రచారంలో కూడా లేదు . ఇదేంటయ్యా అని అంటే ఇది ఫిక్షన్ అంటారు …
బహుశా 1984 నాదెండ్ల ముఖ్యమంత్రి కావటం , యన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం , వెంకయ్యనాయుడు , 1988 లో రంగా హత్య , అల్లర్లు , కాపునాడు సభలు , లక్ష్మీ పార్వతి యన్టీఆర్ల వివాహం , 1994 యన్టీఆర్ మూడవ ప్రభంజనం వంటివి సీజన్-2 లో చూపిస్తారేమో… చాలా మిస్సింగ్ లింకులు…
రాజకీయాలు ఈమధ్యవే కాబట్టి చాలామందికి ఐడియా ఉంది . ఏవో కొన్ని కావాలని దాచిపెడుతున్నారని అనిపిస్తుంది . నిజాయితీగా లేదేమో అనిపించింది . ఈమధ్య కాలంలో స్టోరీలు , ఫైల్స్ పేరుతో అవాస్తవాలు , కల్పితాలు చూపటం , ప్రజల్ని తప్పు దారి పట్టించటం , నిలదీస్తే కల్పితాలు అని తప్పించుకోవటం సాధారణం అయిపోయింది …
Share this Article