Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో కంపెనీ లెంపలేసుకుంది..! తినిపారేసే చాక్లెట్ ర్యాపర్ల మీద దేవుళ్లు..!!

January 22, 2022 by M S R

అమెజాన్ వాడు ఫలానా ఉత్పత్తి మీద గణేషుడి బొమ్మ ముద్రించాడు… ఒక వివాదం… ఇంకెవడో పాదరక్షల మీద హిందూ దేవతల బొమ్మలు వేశాడు… ఇంకొక పంచాయితీ… ఆ విదేశీ కంపెనీ హిందూ దేవుడి బొమ్మను నీచంగా చిత్రించింది… మరొక ఆరోపణ… ఎక్కడిదాకో ఎందుకు..? తెల్లారిలేస్తే మనం నెస్లే వాడివి ఎన్నో ఉత్పత్తులు కొంటూనే ఉంటాం కదా… వాడు కిట్‌కాట్ చాక్లెట్ రేపర్ మీద పూరీ జగన్నాథుడి బొమ్మను ముద్రించి మార్కెట్‌లోకి వదిలాడు… సో వాట్, చాక్లెట్ రేపర్ మీద ముద్రిస్తే తప్పేమిటి అంటారా..? నో… చాలామంది నెటిజన్లు అలా అనుకోవడం లేదు…

మొన్నటివారం హఠాత్తుగా ఈ వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది… ఒకాయన ట్వీట్ చూడండి… ‘‘జగన్నాథుడు, మాతా సుభద్ర, బలభద్రుల బొమ్మలను దయచేసి ఆ రేపర్ల మీద నుంచి రిమూవ్ చేయండి… దీనివల్ల ఏమవుతుందంటే… చాక్లెట్లను తినేసి, ఆ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తారు… తొక్కుతారు, డ్రెయిన్లలో చేరతాయి… రోడ్ల మీద పడేస్తారు… ఇది దేవుడిని అవమానించడమే…’’ చాలామంది ఇలాగే ట్వీట్లు పెట్టడం మొదలెట్టారు…

Please remove the Lord Jagannath, Balabhadra and Mata Subhadra Photos In Your @kitkat Chocolate Cover . When People Are Finished The Chocolate They Are Through The Cover On Road, Drain, Dustbin, Etc . So Please Remove The Photos . @Nestle @NestleIndiaCare #Odisha#JayJagannath pic.twitter.com/9vFy0trazw

— Biswadeep Pradhan (@B4Biswadeep) January 17, 2022

Ads

ఈ ట్వీట్లకు నెట్‌లో బలమైన మద్దతు దొరికింది… నెస్లేను, నెస్లే ఇండియా కేర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెట్టసాగారు… ఇంకా మధ్యప్రదేశ్ హోం మంత్రి దాకా పోనట్టుంది… లేకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టేయించి, బులావో నెస్లే చైర్మన్ అని హుకుం జారీచేసేవాడేమో… ఈలోపు నెస్లే వాడే సోయి తెచ్చుకున్నాడు… హడావుడిగా ఓ ట్విట్టర్ ప్రకటనను జారీచేశాడు… ‘‘అయ్యయ్యో, మాకెవరి మనోభావాల్ని దెబ్బతీసే ఉద్దేశం లేదు… ఇందులో సున్నితత్వం మాకు తెలుసు… కిట్‌క్యాట్ ట్రావెల్ బ్రేక్ ప్యాక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం, లోకల్ టూరిజం డెస్టినేషన్లను, ఆర్ట్ ఫామ్స్‌ను హైలైట్ చేయాలనే మా ప్రయత్నం… పట్టాచిత్ర కళను, ఆ కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలనే భావనతోనే సెలబ్రేట్ కల్చర్ పేరిట వాటిని ముద్రించాం..’’ అని వివరణ జారీ అయ్యింది…

‘‘నిజానికి ఇవన్నీ మేం గత ఏడాది మార్కెట్‌లోకి వదిలిన చాక్లెట్ బార్స్… ఎప్పుడైతే మేం ఇందులోని సున్నితమైన ఇష్యూను గమనించామో, వెంటనే ఆ స్టాక్‌ను మార్కెట్ నుంచి వాపస్ తీసుకున్నాం..’’ అని చెప్పుకొచ్చింది కంపెనీ… నిజానికి అలా ప్రకటించింది గానీ, ఈ బొమ్మల చాక్లెట్ బార్లను ప్రధానంగా డంప్ చేసిన ఒడిశా మార్కెట్ నుంచి మొత్తం స్టాక్‌ను వాపస్ తీసుకోలేదు… అందుకే ఇంకా ఆ బొమ్మల చాక్లెట్స్ మార్కెట్‌లో దొరుకుతున్నయ్… ఏదో లెంపలేసుకున్నట్టు కనిపించడం, తమ పని తాము కొనసాగించడం… మల్టీ నేషనల్ కంపెనీల యవ్వారం ఇలాగే ఉంటుంది తెలుసు కదా… తనిష్క్ జుయెల్లరీ, జొమాటో, యూనీలివర్, మాన్యవార్ తదితర బ్రాండ్లు కూడా ఈమధ్య కాలంలో హిందూ కల్చర్‌ను, దేవుళ్లను అవమానించే యాడ్స్ చేసి, తరువాత లెంపలేసుకున్న సంగతి తెలిసిందే కదా… నెస్లే కిట్‌క్యాట్ తాజాది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions