.
అటు తిరిగి ఇటు తిరిగి… డర్టీ శివాజీ సామాన్ల వివాదం కాస్తా ఈమధ్య బాగా హిట్టయిన చికిరి పాట మీదకు మళ్లింది… ప్రస్తుతం రీల్స్, షార్ట్స్‌లలో ఆ పాట హవా… అయితే అందులో కూడా ‘సరుకు సామాను’ అనే పదాలు యథేచ్ఛగా వాడాడు రచయిత ఎవరో గానీ…
శివాజీ కాబట్టి విరుచుకుపడ్డారు గానీ, రామ్‌చరణ్ పెద్ద హీరో కాబట్టి ఎవరూ ఏమీ అనరు అని కొందరి వ్యాఖ్య… నిజంగానే ఆ పాటలోని చికిరి అంటే అర్థమేమిటో రాసిన కలానికీ తెలియదేమో… ఏదో రాసేశాడు… సహజమైన సినిమా ఇండస్ట్రీ భావజాలంతోనే సరుకు సామాను అని రాసిపారేశాడు… ఇండస్ట్రీలో ఎవరేం తక్కువ..?
Ads

- పైగా ఈ పాటలో దీనక్క అని రాశాడు ఏదో ప్రాసప్రయాసలో కాదు, అదే సేమ్, సరుకు సామాను భావజాలం… దీనక్క అంటే తెలుసా అనడక్కండి, తెలిసే రాస్తారు… పైగా సరుకు సామాను చూసి మీసం మెలేసి కేక పెట్టిందట…
- ఆమధ్య నాని కూడా ఏదో సినిమాలో బాంచెత్ అని పేలాపన… పైగా ఏదో టీవీ షోకు వచ్చి, ఆ పదం అంటే గొప్ప విశేషణం అనుకున్నాడేమో.,. శెభాష్, సూపర్ అనే వ్యక్తీకరణకు గాను బాంచెత్ అన్నాడు…
ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క.. దీనేషాలో తిక్క.. నా గుండెల్లో పోత్తాందే ఉక్కా
ఓ.. చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ… పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక…
అంతెందుకు..? రవితేజ కూడా మొన్న ఏదో పిచ్చి పాటలో నీయమ్మను, నీయక్కను, నీచెల్లెను అని కారుకూతలు కూయలేదా..? పైగా అది కరెక్టేనని సమర్థన ఏదో ప్రమోషన్ ఇంటర్వ్యూలో… ఇలాంటి చర్చ జోరుగా సాగుతోంది శివాజీ వివాదం తరువాత సోషల్ మీడియాలో…!
- శివాజీ చిన్న నటుడు కాబట్టి అలుసా అని కొందరు సమర్థన తనకు… కుర్చీ మడతబెట్టిన మహేష్‌బాబు, దబిడి దిబిడి అని పిరుదులపై మద్దెల దరువేసే బాలకృష్ణ… అమ్మడూ కుమ్ముడూ అనే చిరంజీవి… మరి వాళ్లను ఎవరూ అనరేం అని ప్రశ్నిస్తున్నాడు ఒకాయన… బూతు పదాలు రాయని రచయిత, తీయని దర్శకుడు, ఎగరని హీరో ఎవరు అంటాడు…
ఈమధ్యే రాధికా ఆప్టే మళ్లీ వ్యాఖ్యలు చేసింది… ‘‘ఒక దశలో తెలుగు ప్రముఖులతోపాటు ఓ సినిమా షూటింగులో నేనొక్కతినే మహిళను… ఆ వాతావరణమంతా మహిళను ఓ సరుకుగా చూసే బ్యాచే… ఆ సంభాషణలు, ఆ పోకడ చూసి ఇక తెలుగు వైపు రావడమే మానేశాను’’ అంటోంది…
- అవును, సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, టాలీవుడ్డే కాదు… టీవీ, సినిమా, ఫ్యాషన్ అన్ని ప్రపంచాల్లోనూ మగాడు మగాడే… ఇప్పుడు కూడా శివాజీ సమర్థకులు తన భాష బాగాలేదు గానీ అన్నదాంట్లో తప్పేముంది అంటున్నారు..? చీర సమర్థకులు… తప్పులేదు… కానీ తప్పు శివాజీ పదాల గురించి కాదు… మోరల్ పోలీసింగు గురించి…
రేప్పొద్దున జాకెట్ చేతుల నిడివి, చీర ఎంత ఎత్తు వరకూ కట్టాలో కూడా ఈ మోరల్ పోలీసులే నిర్ణయిస్తే..? ఎస్, అసభ్య వస్త్రధారణకు పెట్టింది పేరైన అనసూయకు శివాజీ వ్యాఖ్యల్ని తప్పుపట్టే నైతికత లేకపోవచ్చు… కానీ ఈ మగ ఇండస్ట్రీలో ధైర్యంగా నోరిప్పింది ఆమె…
- మరొకరి వ్యాఖ్య ఏమిటంటే సోషల్ మీడియాలో… ‘‘అసలు చీర కడితేనే నడుం అంతా కనిపిస్తుంది… పంజాబీ డ్రెస్, చుడీదార్ వేసుకున్నా ఈ సరుకు సామాను బెడద తప్పదు కదా… సనాతన వస్త్రధారణ అని గొంతు విప్పుతున్న ఎందరు చీరలు కడుతున్నారు..? అంతెందుకు, వోణీ లంగా ధరించే ఒక్క యువతిని చూపించండి…. పోనీ, శివాజీ ఏమైనా ధోతీ కట్టుకుని తిరుగుతున్నాడా..? బూతు జబర్దస్త్ జడ్జిగా చేసినప్పుడు ఏమైపోయాడు ఈ మోరల్ జడ్జి..? పైగా బూతులు ఊరి భాష అంటాడేమిటి ఈ సంస్కారరహితుడు’’ అంటున్నాడు ఆయన…
గతంలో ఆలీ వేదిక మీదే పిచ్చి కూతలు కూశాడు కదా… సుమ మీద కూడా… ఈమధ్య రాజేంద్ర ప్రసాద్ తిక్క వ్యాఖ్యల మాటేమిటి…? ఒక్క శివాజీ దొరికాడా అని కొందరి సమర్థన… ఏమిటో చర్చ వ్యాపిస్తోంది ఇటూ ఇటూ…
ఇందరు ఇన్ని మాట్లాడుతున్నారు గానీ… అసలు సరుకు సామాను కనిపించని డ్రెస్సింగ్ ఏమిటో మాత్రం ఎవరూ చెప్పరు… ‘‘అందంగా కనిపించడం తప్పు కాదు, అసభ్యంగా ఎదుటివాడి కామపు చూపుల్లో పడేలా ఉండనంతవరకూ…’’ అదే శివాజీ వ్యాఖ్యల ఉద్దేశం అంటున్నారు కదా కొందరు… కానీ తను వాడిన దరిద్రపు ముండ, సామాను వంటి పదాలు ఓ చిల్లర తత్వాన్ని ప్రదర్శించడం లేదా..?!
Share this Article