.
ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రంలోని ‘నాచే నాచే’ పాటపై అంతర్జాతీయ స్థాయిలో వివాదం నెలకొంది. ఈ పాట ట్యూన్‌కు సంబంధించి.. తాను 2024లో రూపొందించిన మ్యూజిక్ బీట్‌ను ‘రాజాసాబ్’ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాపీ చేశారని స్వీడన్‌కు చెందిన ప్రముఖ DJ విడోజీన్ ఆరోపించారు.
ప్రభాస్ నటనను అద్భుతమని కొనియాడుతూనే, మ్యూజిక్ కాపీ చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ చెప్పు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది…
Ads
తమన్ అంటే తెలిసిందే కదా… అతి పెద్ద కాపీ క్యాట్… ఏవేవో పాపులర్ ట్యూన్లను కాపీ చేసి యథాతథంగా కొట్టేయడం… అసలే రాజా సాబ్ సినిమాకు తను ఇచ్చిన ట్యూన్లు బాగా లేవనే టాక్ వచ్చింది, బీజీఎం కూడా పూర్…
ఓచోట బాగుంది, మరోచోట బాగాలేదు… సగం రికార్డింగ్ కాగానే తన టీమ్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నట్టున్నాడు… స్వీడన్ కంపోజర్ నుంచి నాచే నాచే ట్యూన్ కాపీ కొట్టినా సరే, అదీ పెద్దగా క్లిక్ కాలేదు…
సినిమాలో చాలాచోట్ల సౌండ్ సింక్ సరిగ్గా లేనేలేదు… చివరకు కొన్నిచోట్ల ప్రభాస్ డైలాగులు కూడా..! సంగీతం, ఎడిటింగ్, నిర్మాణ విలువల గురించి అసలు దర్శకుడు గానీ, నిర్మాత గానీ అసలు పట్టించుకోలేదు… పైగా ఈ కాపీ ట్యూన్ల సంగతి సరేసరి…
తమన్ ఏమైనా స్పందించాడా అనేదే కదా మీ ప్రశ్న… భలేవారే… తేలు కుట్టిన దొంగ.,. పదే పదే తేళ్లు కుట్టే దొంగ… పైగా ఓసారి చెప్పాడు, బోలెడు యాప్స్ యూజ్ చేస్తాననీ, తను కంపోజ్ చేసిన ట్యూన్ లాగే గతంలో సిమిలర్ ట్యూన్ ఎవరైనా కంపోజ్ చేశారా అని చెక్ చేయడానికి ఓ టీమ్ ఉందని..!! భలే నవ్విస్తాడు కదా..!!
Share this Article