Chada Sastry….. ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకి కేంద్ర న్యాయశాఖ మంత్రికి మధ్య జడ్జిల నియామకంపై వివాదం చెలరేగింది. గతంలో ఇటువంటివి మీడియాలో వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్నవారు కూడా సమాజంలో జరుగుతున్న వాటికి బహిరంగంగా స్పందిస్తూ వివాదాలకు కారణం అవుతున్నారు.
న్యాయ వ్యవస్ధలో ఉన్న వారు మామూలు పౌరులు, సాధారణ ఉద్యోగస్తులలాగే తమ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలూ బహిరంగంగా తెలియపరుస్తూ ఉంటే, వారు భవిష్యత్తులో జడ్జిలుగా నియామకం అవుతే, వారి తీర్పులపై ఖచ్చితంగా వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రభావం ఉంటుంది అని సామాన్య ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది.
సరిగ్గా ఇటువంటి రగడే ఇప్పుడు జరుగుతోంది. సుప్రీంకోర్టు కొలీజియం ఫలనావారిని ఫలానా చోట జడ్జిలుగా నియమించండి అని 5 పేర్లు సిఫార్స్ చేసింది. అయితే కేంద్రం నెలలు గడుస్తున్నా వాటిపై ఏ చర్య తీసుకోలేదు. చివరకు ఆ ఐదుగురూ జడ్జిలుగా నియమింపబడటానికి ఎందుకు అర్హులు కారో కేంద్రం కారణాలు తెలియచేస్తూ… వాటికి ఆధారంగా కేంద్ర నిఘా సంస్థలు అయిన ” రా మరియు ఐబీ” రిపోర్టులు జత చేసింది.
Ads
అయితే, అనూహ్యంగా కొలీజియం ఆ “రా, ఐబీ” రిపోర్టుల్లో ఉన్న విషయాలు బహిరంగపరుస్తూ ఆ వ్యక్తుల వ్యక్తిగత నడవడిక వారిని జడ్జిలుగా నియమించడానికి అడ్డు కాదు, మేం సిఫార్సు చేసిన వారిని మీరు జడ్జిలుగా నియమించవలసిందే అని కేంద్రానికి అదే లిస్ట్ మళ్ళీ తిరిగి పంపించింది.
తమ నిఘా సంస్థలు రహస్యంగా తయారు చేసి కొలీజియంకి రహస్యంగా పంపించిన నిఘా రిపోర్టులు బయట పెట్టడం చాలా సీరియస్ మేటర్ అని కేంద్ర న్యాయ శాఖా మంత్రి నిన్న ప్రకటించారు. తరువాత ఏం జరుగుతుందో ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
***
అసలు ఈ ఐదుగురి పేర్లు ఎవరివో @DS BABUb గారి పోస్ట్ ద్వారా చదవండి…
“తిరస్కరించిన వ్యక్తులకే జడ్జి పదవులివ్వాలి :: సుప్రీం కొలీజియమ్… ఐబి ఇంటెలిజన్స్, రా రిపోర్టుల బేఖాతరు.”
1. సౌరభ్ కిర్పాల్: ఢిల్లీ హైకోర్టు జడ్జి పదవికి కొలీజియం ఎంపిక. కిర్పాల్ మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కుమారుడు. ఇంటెలిజన్స్, రా రిపోర్టుల ప్రకారం అతను ఒక మగవాడితో శారీరక సంబంధాలు గే సంబంధం కలిగి ఉన్నాడు. అదికూడా ఒక విదేశీయుడు, స్విస్ జాతీయుడితో… అది న్యాయ వ్యవస్థకి కీడు. దేశానికి ప్రమాదం. కిర్పాల్ తన శృంగార అభీష్టాలను బహిరంగంగానే తెలియపరచాడు.
అయితే, సుప్రీం కొలీజియమ్ ‘‘ఎవరితో సంభోగం చెయ్యాలనేది అతని వ్యక్తిగతం. రాజ్యాంగం ప్రకారం అతని స్వేచ్ఛ. అతను దాచిపెట్టకుండా నిజాలు చెప్పడం ఇతని గొప్పదనం. అతనిని వెంటనే జడ్జిగా వేగంగా చర్యలు తీసుకుని అపాయింట్ చెయ్యండి…’’
2.జాన్ సత్యన్: ఇంటెలిజన్స్, రా రిపోర్టుల ప్రకారం అతను ప్రధాని మోడీని సోషల్ మీడియాలో విమర్శిస్తూ పోస్టులు పెట్టాడు… అతను, ప్రధానిని విమర్శిస్తూ ది క్వింట్ ఆర్టికల్స్ షేర్ చేశాడు. నీట్ లో సీటు రాని అనిత ఆత్మహత్య విషయంలో అతను ‘పొలిటికల్ బిట్రేయల్’ ‘సిగ్గుపడు ఇండియా’ అని పోస్టులు పెట్టాడు. ఈవిషయంగా మోడీని తీవ్రంగా విమర్శించాడు.
సుప్రీం కొలీజియం ‘‘ఎవరినైనా విమర్శించే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రతి వ్యక్తికీ ఉన్నాయి. అతనిని మద్రాస్ హైకోర్టు జడ్జిగా వెంటనే నియమించండి’’ అని చెబుతోంది…
3.సోమశేఖర్ సుందరేశన్: ఇంటెలిజన్స్, రా రిపోర్టుల ప్రకారం అతను సోషల్ మీడియాలో బయాస్డ్ గా పక్షపాతధోరణితో పోస్టులు పెడతాడు. పక్షపాత అభిప్రాయాలను పబ్లిక్ డొమైన్ లో పెడతాడు.
‘‘ప్రతిపౌరుడు రాజ్యాంగం 19(1)(a) ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే హక్కును స్వేచ్ఛగా తన అభిప్రాయాలను తెలియపరచే హక్కును కలిగియున్నాడు. అతని అభిప్రాయాలు అతనిని జడ్జిగా అపాయింట్ చేయడానికి ఆటంకం కాజాలవు. వెంటనే అతనిని బొంబాయి హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయండి’’ అని కొలీజియం చెప్పింది
4. అమితేష్ బెనర్జీ: ఇంటెలిజన్స్, రా రిపోర్టుల ప్రకారం 2002 గోద్రాలో ట్రైన్ తగలబెట్టబడి 56 మంది కరసేవకులు చనిపోయిన కేసులో రైల్వే బోర్డు ఈయనను కమిషన్ ఆఫ్ ఎంక్వయరీగా వేసింది. ఆ కేసులో ఈయన రైలు ప్రమాదవశాత్తు తగలబడిందని అబద్ధపు రిపోర్టు ఇచ్చాడు. అతను సుప్రీం కోర్టు మాజీ జడ్జి యుసిబెనర్జీ కొడుకు.
5. శాక్యా సేన్. :: అతనికి సెప్టెంబరు 21 లో కొలీజియం జడ్జిగా అపాయింట్ చేయమని రికమెండేషన్ చేసింది. ఆ ఫైల్ మరల మరల తిప్పిపంపకండి. అతనిని కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమించండి, త్వరగా… సోషల్ మీడియా రాతలు రాయడానికి అతనికి స్వేచ్ఛ ఉంది. వెంటనే అతనిని జడ్జిగా నియమించండి అని రికమెండ్ చేసింది…
…. చాడా శాస్త్రి….
Share this Article