‘‘సనాతన ధర్మం కూడా మలేరియా, డెంగీ, ఫ్లూ వంటిదే… సమూలంగా నిర్మూలించాలి…’’ ఇదీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుత్రరత్నం, కాబోయే ముఖ్యమంత్రిగా భజన చేయించుకోబడుతున్న ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… ఆ కుటుంబ రాజకీయ వాారసత్వమే ‘దేవుళ్లను బహిరంగంగా చెప్పులతో కొడుతూ ఊరేగించిన నాస్తిక భావజాలాన్ని ఆదర్శంగా తీసుకున్నది…’’
సో, స్టాలిన్ నాస్తిక వ్యాఖ్యలు చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో… అఫ్‌కోర్స్, అన్ని ధర్మాల, అన్ని మతాల ప్రజల పట్ల సమభావం చూపాల్సిన అధికార స్థానాల్లో ఉన్నవారి మాటలు జాగ్రత్తగా రావాలి… బట్, అంత తెలిస్తే తను స్టాలిన్ కొడుకు ఎలా అవుతాడు..,? తన వ్యాఖ్యల మీద తమిళనాడు హిందూ సమాజం నుంచి పెద్దగా వ్యతిరేక స్పందన వచ్చిందో లేదో తెలియదు గానీ తెలుగు హైందవం మాత్రం సోషల్ మీడియాలో తిట్లు, శాపనార్థాలతో విరుచుకుపడింది…
Ads
నిజానికి తెలుగు హైందవ నెటిజనులు స్టాలిన్ చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించలేదు… తన నాస్తికత్వం తీరును ఎండగట్టారు… ఒకవైపు క్రిస్టియానిటీని ఆచరిస్తూ, సనాతన ధర్మాన్ని పాతరేయాలి అనే వ్యాఖ్య అభ్యంతరకరం అందరికీ… తమిళనాట నాయకులు, పార్టీలు నాస్తిక వ్యాఖ్యలు చేయడం పెద్ద అసహజం ఏమీ కాదు… ఒక మతాన్ని ఆచరిస్తూ మరో మతాన్ని, అదీ మెజారిటీ మతాన్ని తూలనాడటం కూడా అక్కడ సహజమే… ఎటొచ్చీ అధికారంలో ఉన్నప్పుడు చేసే వ్యాఖ్యల్లో సంయమనం అవసరమనే సోయి లేదు అతనికి… దాన్నే అందరూ వ్యతిరేకించిన అంశం,.. ‘ఒక్కసారి క్రిస్టియానిటీనో లేక ఇస్లామ్‌నో ఇలా తూలనాడగలడా’ అనే ప్రశ్న నెటిజనం నుంచి వచ్చింది బలంగా… జర్నలిస్టు దేవికారెడ్డి వ్యాఖ్యను ఉదాహరణగా తీసుకుందాం…
వీళ్లమ్మ దుర్గ పరమభక్తురాలు… ఏటా చార్ ధామ్ యాత్ర చేస్తది… వీడికి అమ్మబుద్ధులు అబ్బలేదు…తాత తండ్రి అవకాశవాద రాజకీయం ఒంటబట్టింది… వాళ్లే కాస్త మేలు వీడికన్నా… వీడు క్రిస్టియన్ ను చేసుకుని, మారిపోయాడు… సనాతన ధర్మాన్ని మాత్రం తిడతాడు… వీడి తాత… బతుకంతా నాస్తికం, హేతువాదం, ద్రవిడవాదం అంటూ చచ్చేముందు… బతుకుమీద, అధికారం మీద ఆశతో రోజూ వేదపండితుల ఆశీర్వాదం తీసుకునేవాడు…
నిజానికి ఆమె సగటు కుటుంబ పార్టీల చెత్తా కల్చర్‌లో ఇమడదు… ఆమె చల్లటి కళ్లల్లో పడినా సరే, ఆమె ఎవరి గురించీ స్టాలిన్‌కు రికమెండ్ చేయదు… అస్సలు ఆమె భర్త రాజకీయ కార్యాచరణలో వేలుపెట్టదు… ఆమెకు అసలు రాజకీయాలే పడవు… దేశంలో పలువురు ముఖ్యమంత్రుల భార్యలు తమ ఇళ్లల్లోనే క్యాష్ కౌంటర్లు ఓపెన్ చేసి, వసూళ్ల దందాలన్నీ వాళ్లే చూసుకుంటుంటారు… ఈమెకు అవేమీ తెలియవు… స్టాలిన్ నాస్తికుడు, డీఎంకే మూల సిద్ధాంతాల్లో నాస్తికత్వం కూడా ఒకటి… కానీ స్టాలిన్ భార్య పరమ ఆస్తికురాలు… ఆమె దర్శించినన్ని గుళ్లు బహుశా ఎవరూ వెళ్లి ఉండరు… ఎక్కడా మీడియా దృష్టికి రాదు, కెమెరాలకు, ప్రచారానికి చాలా దూరంలో ఉంటుంది… భార్య ఆస్తికత్వాన్ని స్టాలిన్ వ్యతిరేకించడు, అది ఆమె వ్యక్తిగత విశ్వాసం అంటాడు… భర్త నాస్తికత్వం ఆమెకూ పట్టదు…
దుర్గ మాత్రమే కాదు… కరుణానిధి భార్య దయాళు అమ్మాల్ కూడా భక్తురాలే… (స్టాలిన్ తల్లి)… స్టాలిన్ సోదరి సెల్వికి కూడా ఆధ్యాత్మికత మీద గురి ఉంది… కణిమొళి కేసు సమయంలో కరుణానిధి కుటుంబసభ్యుల్లో చాలామంది గుళ్లు సందర్శించారు… పలు తమిళ పత్రికల్లో ఆ గుళ్ల జాబితా కూడా పబ్లిష్ చేశారు… సరే, ఎవరి నమ్మకాలు వాళ్లవి…
ఏమో… స్టాలిన్ కూడా మారతాడేమో… రాజకీయ నాయకుల సిద్ధాంతాలు, విశ్వాసాల్లో స్థిరత్వం ఏముంటుంది..? అవసరాన్ని బట్టి నటన… జనం కళ్లుగప్పడానికి…! లేదా నిజంగా మారొచ్చు కూడా..! రాహుల్ గాంధీ జంధ్యం వేస్తాడు, నేను కశ్మీరీ బ్రాహ్మడిని, శివభక్తుడిని అంటూ వీరంగం వేస్తాడు… ఆమీర్ ఖాన్ కలశపూజ చేస్తాడు… షారూక్ ఖాన్ వైష్ణోదేవి యాత్ర చేస్తాడు… ప్రియాంక గంగాస్నానం చేస్తుంది… జగన్ పుష్కరస్నానం చేస్తాడు… కొందరు వృద్దాప్యపు గందరగోళంలోకి జారిపోయి దేవుడిని ఆశ్రయిస్తారు… నారాయణ తిరుమల దర్శనం కావచ్చు, గద్దర్ గుడి సందర్శనలు కావచ్చు…
సో… స్టాలిన్ ఏ సందర్భంలో ఇలా సనాతన ధర్మాన్ని తూలనాడాడో తెలియదు… ఇక ఇలాగే ఉంటాడనీ అనుకోలేం… ఏమో, తనలోని నారాయణో, తనలోని గద్దరో బయటపడొచ్చు… అప్పుడు సనాతన ధర్మ విశిష్టత గురించి కూడా భక్తిపూరిత వ్యాఖ్యలు కూడా చేయొచ్చునేమో… ఇలా కర్మసిద్ధాంతాన్ని ఆశ్రయించడమనే ఖర్మసిద్ధాంతం తప్ప హైందవ సమాజం కూడా చేసేదేముంది..? అవునూ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నా మలై ఏమైనా స్పందించాడా..? అన్నట్టు… ఓ సందేహం… ఇతనికి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా..? హిందుత్వను తిడితే బీజేపీని తిట్టినట్టే అనే శుష్క దుర్భ్రమల్లో బతుకుతున్నాడా..?
Share this Article