లోకస్ స్టాండీ… మన సోకాల్డ్ జర్నలిస్టులో 95 శాతం మందికి దీనికి అర్థం తెలియదు… ష్యూర్… లీగల్ ఇష్యూస్ రెయిజ్ అయినప్పుడు, ఎవరైనా ఏదేని పిటిషన్ వేసినప్పుడు, నీకేం సంబంధం అనడుగుతుంది కోర్టు ఓం ప్రథమంగా… అదే లోకస్ స్టాండి అంటే…
సరే, ఇక విషయానికి వద్దాం… ఫర్ డిబేట్, వేణుస్వామి అనే ఆస్ట్రాలజిస్టు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి జ్యోతిష్యం పేరిట జొరబడుతున్నాడు అని ఎవరో జర్నలిస్టులు కోర్టుకు వెళ్తారట… కేసు పెడతారట… రైట్, తను చేసేది తప్పే అనుకుందాం కాసేపు… తన విద్య చెప్పిన జోస్యం తను చెబుతున్నాడు, అలాంటోళ్లు దేశంలో కోకొల్లలు… నమ్మకపోతే నమ్మకు, ఎవడు నమ్మమన్నాడు..? ఎవడు రాయమన్నాడు, ఎవడు వీడియోలు చేయమన్నాడు, ఎవడు టాంటాం చేయమన్నాడు..?
ఇప్పుడు జర్నలిజం అనేది.., ప్రత్యేకించి సెలబ్రిటీల గురించి నానా కూతలూ కూసే యూట్యూబర్లు, అంతెందుకు, మెయిన్ స్ట్రీమ్ చానెళ్లు, పత్రికలు చెప్పుకునే సోకాల్డ్ జర్నలిజం నిజంగా జర్నలిజమేనా..? డబ్బులు, పార్టీలు, ప్రలోభాలు, అమ్ముడుబోవడాలు… మీడియా మీట్లలో హీరోలు, దర్శకుల భజనలు, కాళ్ల మీద పారాడటాలు… హీరోయిన్ల మీద వెగటు వ్యాఖ్యలు సరేసరి… ప్రత్యేకించి యూట్యూబర్ల థంబ్ నెయిళ్లలో భాష చూస్తే తెలియడం లేదా మన జర్నలిజం స్థాయి ఏ పాతాళానికి పడిపోయిందో…? వీళ్లు ప్రమాణాల గురించి మాట్లాడటం… హవ్వ…
Ads
సరే… వేణుస్వామితో మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడాడు అట… బెదిరించాడా..? నోటీసు ఇచ్చాడా..? అప్పీల్ చేశాడా..? తెలియదు… మాజోలికి రావద్దు అన్నాడేమో… మరి ఒక రాజ్ తరుణ్, ఒక లావణ్య కేసులో ‘మా చేసిందేముంది..? అరియానాను ఎవరు లాగారు..? మాన్వి మల్హోత్రాను ఎవరు లాగారు..? ‘మా చేసిందేముంది..? ఎవరు ఎవరితో పడుకున్నారు అనేదే కదా మొత్తం మీడియా కాన్సంట్రేషన్… అంతెందుకు..? ఎవరో ఏపీ ఎమ్మెల్సీ, భార్యాబిడ్డలను వదిలేశాడు, ఇంకెవరినో ఉంచుకున్నాడు… (దువ్వాడ, దివ్వెల) రోజంతా ఇవే డిబేట్లు కదా… ఇది జర్నలిజం..? నాగచైతన్య, శోభిత జాతకాలు బాగా లేవని ఎవరో చెబితే ద్రోహం..? ఎలా..?
ట్రంప్ ఓడిపోతాడు అని అమెరికన్ ఫేమస్ జ్యోతిష్యుడు చెప్పాడు, మరెలా..? సోకాల్డ్ పొలిటికల్ ఎలక్షన్ సర్వేల మాటేమిటి..? వాటి శాస్త్రీయత మాటేమిటి..? ఎవడికిష్టం వచ్చిన సర్వే వాడు రాసేయడమే కదా… పోనీ, సెలబ్రిటీల జీవితాల్లోకి అడుగుపెట్టని ఒక్క మీడియా సంస్థ ఉందా..?
వేణుస్వామి కాదు, ఆయన సతీమణి శ్రీవాణి… గతంలో జర్నలిస్టే, వైణికురాలు, ఇదే దులిపేసింది ఓ వీడియోలో… దడదడా… పోనీ, ప్రస్తుతం జర్నలిస్టులు దేశోద్దారకులే అనుకుందాం… వాళ్లే కోర్టుకు పోయారు అనుకుందాం… గుడ్, చర్చ జరగాలి, విచారణ జరగాలి… జోస్యాల్లో ఏది చెప్పొచ్చు, ఏది చెప్పకూడదో న్యాయమూర్తులు చెప్పాలి… శనిశింగాపూర్‌లో శనిని ముట్టుకోవచ్చు, రుతుమహిళలు కూడా శబరిమలకు వెళ్లొచ్చు, మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు వంటి సంచలన విప్లవాత్మక తీర్పులు వస్తున్న కాలం కదా… జ్యోతిష్యాల మీద మాత్రమే కాదు…
వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను బజారుకు లాగితే శిక్షలేమిటో కూడా కోర్టులు చెబితే సూపర్… చెప్పగలిగే విద్వత్తు ఉంటేనే సుమా… అబ్బే, కోర్టులకు అవేమీ అక్కర్లేదు, జర్నలిస్టులకు అస్సలు అక్కర్లేదు అంటారా..? ఎస్, కరెక్ట్… దిక్కుమాలిన బురద జల్లుకునే నాయకుల డొల్ల ప్రకటనలతో సొసైటీలో ప్రబలుతున్న మెంటల్ నెగెటివిటీ మాటేమిటి..? ఇన్ని కోణాలున్నాయి… వేణుస్వామి భార్య శ్రీవాణి వీడియో వీలైతే సోషల్ మీడియాలో మీరే వెతుక్కొండి… జస్ట్, ఇదొక కోణం… దీనికి పూర్తి భిన్నమైన కోణాల్లో మీ వాదనలు, మీ అభిప్రాయాలున్నా సరే… నో ప్రాబ్లమ్… భిన్నాభిప్రాయాలు మంచివే… ! ఆమె ఎప్పుడూ వివాదాల్లోకి రాదు… కానీ తొలిసారి కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించింది..!!
చివరగా… లోకస్ స్టాండి అని మొదట్లో చెప్పుకున్నాం కదా… రేపు కోర్టు జర్నలిస్టులను ఇదే అడిగితే… ఏం జవాబు ఉంది..? పోనీ, పిల్ వేస్తారు అనుకుందాం… మరి తెల్లారిలేస్తే మనం జర్నలిస్టులుగా చేస్తున్నదేమిటి..? ఒక్క రాజ్‌తరుణ్ కేసు సరిపోదా..? ఒక ఆంధ్రా ఎమ్మెల్సీ కేసు సరిపోదా..? ఈ వార్తలన్నీ వ్యక్తుల జీవితాల్లోకి జొరబడటం కాదా..? ఏది కరెక్టు..? ఏది నాట్ కరెక్టు..? ఇది ఒక వేణుస్వామికి సమర్థన కాదు… మనమెంత పరిశుద్ధంగా ఉన్నాం అని మథించుకోవడానికి..?! డిబేట్ జరగనీ, ఏ వారణాసి యూనివర్శిటీయో జ్యోతిష్యం సబ్జెక్టును రద్దు చేయమని కోర్టులు చెబుతాయా చూద్దాం…
ఒక శ్రీరెడ్డిని అర్ధనగ్నంగా బజారులో కూర్చోబెట్టిన ఆ జర్నలిజాన్ని ఏమందాం మరి..? అందరూ వెళ్లే అదే ఒరవడిలో అదే ఉరవడిలో పడి కొట్టుకుపోవడం కాదు, సోకాల్డ్ పెద్ద చానెళ్ల సోకాల్డ్ పెద్ద జర్నలిస్టులు అన్ని విషయాలనూ జడ్జ్ చేయడం కాదు, భిన్న కోణాల్ని మనం స్పృశించలేమా..?
మరొకటీ చెప్పాలి… బ్రాడ్‌కాస్ట్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు… త్వరలో రాబోతోంది… నివేదికల ప్రకారం, ముసాయిదా బిల్లులో ప్రింట్ మీడియా మినహా అన్ని రకాల ప్రసార మాధ్యమాలను నియంత్రించే నిబంధన ఉంది… OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ కంటెంట్ కూడా నియంత్రించబడుతుంది… ప్రమాణాలు, పరిమితులు కూడా నిర్దేశించబోతున్నదేమో…!!
Share this Article