.
( గోపు విజయకుమార్ రెడ్డి ) …. వేళ్లన్నీ వాళ్ళిద్దరి వైపే చూపిస్తున్నాయి.., ఎయిర్ ఇండియా ప్రమాదం B787-8 ప్రాధమిక నివేదిక ఏం చెబుతోంది, కీలకమైన ఆ రెండు నిముషాల్లో ఏం జరిగింది అసలు.., స్వతంత్ర భారత దేశ చరిత్రలో అతి పెద్ద విమాన విషాదం వెనుక మానవ కుట్ర కోణం..?
ఒక్కసారి డీటెయిల్స్ లోనికి వెళ్లే ముందు…. ప్రాధమిక దర్యాప్తులో మనం అమెరికా (బోయింగ్ – విమాన తయారీదారుడు, GE -విమాన ఇంజిన్ తయారీదారుడు,) UK, పోర్చుగీస్, కెనడా ( చనిపోయిన విదేశీ ప్రయాణికుల్లో ఈ దేశస్థులు కూడా ) అధికారులతో కలిసి ఒక దర్యాప్తు చేయడం ఇదే ప్రధమం…
Ads
అలాగే మొదటిసారి ఒక ఫ్లైట్ CDR డేటా ఇండియాలో డీకొడ్ చెయ్యడం కూడా ఇదే ప్రధమం… దర్యాప్తులో మమ్మల్నీ భాగస్వాములను చేయండని పైలట్ల అసోసియేషన్ అడుగుతోంది… అప్పుడే ఆ పైలట్లను నిందించవద్దని మన విమానయాన సంస్థలు కోరుతున్నాయి… కానీ..?
జులై 12 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి Governament of India ministry of civil aviation కి సంబంధించిన aircarft accident investigation bureau తన ప్రాధమిక దర్యాప్తు నివేదికను ప్రపంచం ముందు ఉంచింది… అది కూడా సరిగ్గా ఆక్సిడెంట్ అయినా నెల రోజుల్లోనే…
ఆ నివేదికలో పర్సనల్ గా ఆకర్షించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏమంటే…, సాధారణంగా ఏదయినా ప్రమాద దర్యాప్తులో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోపాటు, సేఫ్టీ అధికారులు పాల్గొంటారు కానీ ఇక్కడ ఆశ్చర్యంగా వీరితో పాటు, వైద్య అధికారులు, మానసిక రంగ నిపుణులు పాల్గొనడం, అంటే ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణల ద్వారా వాళ్ల మానసిక స్థితిని అంచనావేయడం కోసం అన్న మాట…
ఇది విమాన ప్రమాదాలలో కేవలం మానవ తప్పిదం జరిగినప్పుడు మాత్రమే వీళ్ళు పాల్గొంటారు… ఇంకా దీన్ని డిటైల్డ్ గా డీకోడ్ చేస్తే ప్రాథమికంగా పైలట్ల సంభాషణల్ని నిశితంగా పరిశీలించి, వాళ్ల మానసిక స్థితిని అంచనా వేయడం, వాళ్ల తప్పుందా అని అనలైజ్ చేయడం కోసం అన్నమాట…
వ్యాపిస్తున్న ఓ అభిప్రాయం మేరకు… చాలా క్లియర్ గా పైలట్ల కుట్ర కోణం ఉంది, ఇద్దరి పైలట్లలో ఎవరో ఒకరు కావాలనే చేసారు, కానీ ఎందుకు అనేదే అర్ధం కావటానికి టైం పడుతుంది…
ఈ డేటా మొత్తం ఇన్ డిటైల్ పరిశీలిస్తే ఇద్దరిలో ఎవ్వరో కావాలని చేస్తే, ఇంకో పైలట్ పాపం శాయశక్తులా కాపాడటానికి ట్రై చేసాడు… రెండు ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్లు రన్ మోడ్ నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్టు ఒక పైలట్ గమనించి, వెంటనే రన్ మోడ్ లోకి తేవడానికి ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది… ఇదంతా కేవలం 15-20 సెకండ్లలో జరిగిపోయింది…
పైన రిపోర్ట్ చూసిన తర్వాత ఎలా జరిగిందో, దాదాపుగా ఎవరు చేసారో తెలిసి పోతోంది.., ఇప్పుడు తెలవాల్సింది ఎందుకు చేసాడనే… లేదంటే, దీని వెనుక ఎవరున్నారో కనుక్కోవడమే…
ఒక పైలట్ మానసిక పరిస్థితి వలన కావొచ్చు లేదా ఇంకెవరైనా మోటివేట్ చేసారా అన్నది తేలాలి. ప్రమాదం జరిగిన తీరుని గమనిస్తే కచ్చితంగా ఇది ఏవియేషన్ ఇండస్ట్రీ గురుంచి బాగా తెలిసిన వాళ్ల పనే అన్నది కన్ ఫర్మ్… ఒకవేళ ఒక పైలట్ కుట్ర గనుక ఉండి ఉంటే, అది ఒకరకంగా ఆత్మాహుతి చర్య… తను కూడా మరణిస్తాడు కదా…
పైలట్ వ్యక్తిగత కక్షా..? లేదంటే, బోయింగ్ కంపెనీ ప్రత్యర్థి, లేదంటే టాటా ఎయిర్ ఇండియా ప్రత్యర్థి, లేదంటే ఉగ్ర కోణం (ఎవరూ క్రెడిట్ తీసుకున్నట్టు లేదు), లేదంటే అంతర్జాతీయ రక్షణ వ్యవహారాలు (ఈ కారణాలు కాకుండా ఇంకే కారణాలు కనిపించట్లేదు) అని ఏదో ఒకటి తెలుస్తుందా..? లేదంటే ఇది కూడా ఒక మలేసియన్ విమాన ప్రమాదంలాగే ఎవరికీ అంతు దొరకని ప్రమాదమే అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది…
Share this Article