ఓ డిస్‌క్లెయిమర్… కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిందేమో గానీ… కేటీయార్ మీద చేసిన వ్యాఖ్యలకు క్షమాపణేమీ చెప్పినట్టు లేదు… పైగా కేటీయార్‌ను వదలిపెట్టననీ అన్నట్టు గుర్తు…
పీసీసీ అధ్యక్షుడేమో… సారీ చెప్పాక, ఇంకా రచ్చ దేనికి అని మంత్రిని వెనకేసుకొచ్చినట్టూ గుర్తుంది… కానీ కోర్టు ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు… కొండా సురేఖను దాదాపు మందలిస్తున్నట్టుగానే వ్యాఖ్యలు చేసింది… కొన్ని తక్షణ నిర్ణయాలూ జారీ చేసింది… ఒకరకంగా సురేఖకు అభిశంసన…
మరి కాంగ్రెస్ పార్టీ ఆమె మీద ఏ చర్య తీసుకుంటుంది..? చర్య తీసుకుంటే కేటీయార్ గెలుపును అంగీకరించినట్టు… చర్య తీసుకోకపోతే సొసైటీలో నగుబాటు… తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓ చిక్కు ప్రశ్న తీసుకొచ్చారు మంత్రి గారు…
Ads
ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశం… కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ , ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆదేశం… పరువు నష్టం కేసులో ఓ మంత్రికి పైకోర్టు ఇంత సీరియస్ అవటం ఇదే మొదటి సారి…
ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం… ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్న సిటీ సివిల్ కోర్టు ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని ఆదేశించింది… ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ… యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యల వీడియోలను తొలగించాలని ఆదేశించింది…
కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది….
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్లయింది… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై ఎక్కడా స్పందించినట్టు కనిపించలేదు… పీసీసీ అధ్యక్షుడి స్పందన తప్ప మీడియాలో పార్టీ తరఫున ఇంకేమీ కనిపించలేదు కూడా… పైగా పాత వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు సురేఖ మీద ఫిర్యాదులు చేస్తున్నారు… సరే, అది వేరు, దానికీ సమంత బాపతు వ్యాఖ్యలకు సంబంధం లేదు…
కానీ ఇవన్నీ కలిసికట్టుగా సురేఖను పార్టీలో ఒంటరిని చేస్తున్నాయి… ముందే చెబుతున్నట్టు ఈ సమయంలో గనుక సురేఖపై చర్య తీసుకుంటే అది కేటీయార్ గెలుపును అంగీకరించినట్టు… నిజానికి అదే హుందాగా ఉంటుంది… ఒకవేళ సురేఖ మీద చర్య తీసుకోకపోతే జనం నవ్వుతారు… చివరకు కోర్టు ఇంత ఘాటుగా మందలించినా, ఆమె మరీ అలాంటి వ్యాఖ్యలు చేసినా పార్టీ సమర్థిస్తోందనేలా చెడు సంకేతాలు జనంలోకి వెళ్తాయి… చేదుగా ఉన్నా సరే అదే నిజం… ఏమో, రాహుల్ గాంధీ ఏమని ఆదేశిస్తారో మరి..!! నాగార్జున సపరేటుగా వేసిన సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసు రిజల్ట్ ఎలా వస్తుందో..!!
Share this Article