పార్ధసారధి పోట్లూరి …….. 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యేలా పాస్పోర్ట్ ఇప్పించండి – రాహుల్ కోరిక !
తనకి తాను బ్రిటీష్ పౌరుడుగా ప్రకటించుకున్న రాహుల్ ! సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ !
తనకి 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యే విధంగా పాస్పోర్ట్ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వమంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో [Rouse Avenue Court] పిటిషన్ వేశాడు రాహుల్ ! తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయినందున తన అధీనంలో ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ని సరెండర్ చేశానని ఇప్పుడు తనకి 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యేవిధంగా పాస్పోర్ట్ [ప్రత్యేక] ఇవ్వమని ఆదేశాలు ఇవ్వాల్సిందినగా తన అడ్వొకేట్ తరున్నం చీమా [Tarannum Cheema] చేత పిటిషన్ వేయించాడు రాహుల్ !
Ads
నిన్న విచారణ సందర్భంగా న్యాయమూర్తి సుబ్రహ్మణ్య స్వామిని వివరణ ఆడగగా… స్వామి బదులిస్తూ 10 సంవత్సరాల కోసం చెల్లుబాటు అయ్యేలా పాస్పోర్ట్ అడగడం అనేది అసాధారణం ! అదేమీ రాజ్యాంగ హక్కు కాదు! ప్రస్తుతం రాహుల్ ఎలాంటి రాజ్యాంగ పదవిలో లేడు కనుక రాహుల్ కి ప్రత్యేక పాస్పోర్ట్, అదీ 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యేవిధంగా ఇవ్వమని అడగడం విడ్డూరం !
సుబ్రహ్మణ్య స్వామి తన వాదనని కొనసాగిస్తూ అసలు రాహుల్ భారత దేశ పౌరసత్వం రద్దు చేయాలి అని అన్నాడు ! ఇటీవలే తాను లండన్ వెళ్ళినప్పుడు అక్కడి హై రాంక్ అధికారి ఒకరు తనతో మాట్లాడుతూ రాహుల్ తనని తాను బ్రిటీష్ పౌరుడిగా డిక్లేర్ చేసుకున్నాడు అని నాతో చెప్పాడు అని స్వామి కోర్టుకి తెలిపారు ! భారత దేశ రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం [Dual Citizenship ] కి అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి రాహుల్ భారత పౌరసత్వం రద్దు చేయాలి ! ఇక రాహుల్ భారత పౌరసత్వం రద్దు చేయాల్సి వస్తే అతనికి భారత దేశ పాస్పోర్ట్ తో పని ఏమిటీ ? ఇలా సాగింది స్వామి వాదన !
స్వామి వాదనకి ప్రతిస్పందిస్తూ రాహుల్ కౌన్సిల్ అయిన తరున్నమ్ చీమా రాహుల్ బ్రిటన్ పౌరసత్వం మీద ఎలాంటి వాదన చేయకుండా నేరుగా పాస్పోర్ట్ మీదనే తన వాదనలని కొనసాగించాడు. చీమా మాట్లాడుతూ తీవ్రమయిన నేరాలు చేసిన వాళ్ళకే పాస్పోర్ట్ ఇవ్వడం మీద అభ్యంతరాలు ఉంటాయి కానీ రాహుల్ అలాంటి నేరాలు ఏమీ చేయలేదు కనుక 10 సంవత్సరాలు చెల్లుబాటు అయ్యేవిధంగా పాస్ట్ పోర్టు అడగడానికి హక్కు ఉంది అని వాదించాడు !
వాదోపవాదనలు విన్న తరువాత న్యాయమూర్తి చివరికి 3 సంవత్సరాలు చెల్లుబాటయ్యే విధంగా సాధారణ పాస్పోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ తీర్పు ఇచ్చారు ! So ! డిప్లమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వడం కుదరదు ఎందుకంటే రాహుల్ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు కాదు కాబట్టి ! 10 ఏళ్లకి చెల్లుబాటు అయ్యేవిధంగా అడిగితే కోర్టు వారు 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుబాటు అయ్యే విధంగా పాస్పోర్ట్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు అదీ సాధారణ భారత పౌరులకి ఇచ్చే పాస్పోర్ట్ మాత్రమే !
రాహుల్ తనకి తాను ఒక అసాధారణ వ్యక్తిగా భావిస్తున్నట్లున్నాడు ! పార్లమెంట్ సభ్యత్వం పోయాక ఎందుకు గ్రీన్ చానెల్ ద్వారా వెళ్ళడానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అడుగుతున్నాడు ? సాధారణ భారత పౌరుడిగా లైన్లో నిలబడి అన్ని రకాల భద్రతా తనిఖీలు పూర్తి చేసుకొని వెళ్ళడానికి ఎందుకు నిరాకరిస్తున్నాడు ? అంటే బ్యాగేజీ తనిఖీ చేయకుండా ఉండాలనా ?
నిజానికి రాహుల్ అమెరికా పర్యటనకి వెళ్లాల్సి ఉంది జూన్ మొదటి వారంలో… కానీ అదే సమయంలో మోడీ అమెరికా పర్యటనలో ఉంటారు కాబట్టి తన పర్యటనని ముందుకు జరిపించుకొని ఈ నెల 28 న అమెరికా వెళుతున్నాడు. ఈ నెల 28న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సి వస్తుంది అని రాహుల్ బాధ అన్నమాట ! అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో రాహుల్ ప్రసంగిస్తాడుట ! అమెరికాలోని ఎయిర్పోర్ట్ లలో సాధారణ వ్యక్తిగా అందరిలాగా లైన్ లో నిల్చుని, చెకింగ్ అయ్యాక బయటకి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ! బహుశా తనకి ఇది అవమానంగా భావిస్తున్నాడు కాబోలు లేదా వేరే ఏదయినా కారణం ఉండొచ్చా ?
Share this Article